పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూసే సినిమాల్లో బ్రో సినిమా కూడా ఒకటి. ఈసినిమాకు సముద్రఖని దర్శకత్వం వహిస్తుండగా పవన్ కళ్యాణ్-సాయిధరమ్ తేజ్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. దీంతో సినీ లవర్స్ అందరూ ఈ క్రేజీ కాంబినేషన్ కోసం ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. ఈసినిమా జులై28వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానున్న నేపథ్యంలో చిత్రయూనిట్ జోరుగా ప్రమోషన్ కార్యక్రమాలు చేస్తుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఈసినిమా మ్యూజిక్ కు సంబంధించి థమన్ ఎప్పటికప్పుడు అప్ డేట్స్ ఇస్తూనే ఉన్నాడు. రీసెంట్ గానే ఈసినిమా బ్యాక్ గ్రౌండ్ స్కోర్ పనుల్లో బిజీగా ఉన్నానంటూ తెలిపాడు. ఇక ఇప్పుడు తాజాగా మరో అప్ డేట్ ఇచ్చాడు. అదేంటంటే ఈసినిమా బీజియం లాస్ట్ డే అంటూ తన ట్విట్టర్ ద్వారా తెలిపాడు. అంతేకాదు ఈసినిమాకోసం పనిచేసిన 127 మంది మ్యుజీషియన్స్ కు అలానే సింగర్స్ కు థ్యాంక్స్ అంటూ పోస్ట్ లో పేర్కొన్నాడు.
మరోవైపు ఇప్పటికే మ్యూజికల్ ప్రమోషన్స్ ను మొదలుపెట్టిన సంగతి తెలిసిందే కదా. ఇప్పటివరకూ రెండు పాటలు రిలీజ్ చేశారు. మై డియర్ మార్కండేయ, జానవులే అంటూ రెండు పాటలు రిలీజ్ చేయగా రెండు పాటలకి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇక ట్రైలర్ ను కూడా త్వరలో రిలీజ్ చేయనున్నారు. ఈమేరకు ట్రైలర్ రిలీజ్ డేట్ ను కూడా ఫిక్స్ చేశారు మేకర్స్. జులై 21వ తేదీన ఈసినిమా ట్రైలర్ ను రిలీజ్ చేయనున్నారు.
ఈసినిమాలో హీరోయిన్ గా కేతిక శర్మ హీరోయిన్ గా నటిస్తుంది. ఇంకా రోహిణి, బ్రహ్మానందం, తనికెళ్ల భరణి, సుబ్బరాజు, ప్రియా ప్రకాష్ వారియర్, రాజా చెంబోలు పలు కీలకపాత్రల్లో నటించనున్నారు. కాగా కాగా పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ, జీ స్టూడియోస్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈసినిమాకు టీజీ విశ్వప్రసాద్ నిర్మాతగా వ్యవహరించనున్నారు. త్రివిక్రమ్ ఈ సినిమాకు డైలాగులు స్క్రీన్ ప్లే.. థమన్ సంగీతం అందిస్తున్నాడు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: