టాలీవుడ్ ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా వచ్చిన ఈతరం హీరోల్లో యంగ్ హీరో కార్తికేయ కూడా ఒకరు. ఆర్ఎక్స్ 100 అనే సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన కార్తికేయ మొదటి సినిమాతోనే బ్లాక్ బస్టర్ హిట్ ను అందుకున్నాడు. ఇక ఆసినిమా తరువాత వచ్చిన అవకాశాలను అందిపుచ్చుకొని హీరోగా నిలదొక్కుకోగలిగాడు. ప్రస్తుతం అయితే కార్తికేయ నుండి వస్తున్న సినిమా బెదురులంక 2012. క్లాక్స్ దర్శకత్వంలో బెదురులంక అనే ఊరిలో 2012లో యుగాంతం వస్తుందన్న పుకార్లు ఎలాంటి పరిణామాలు తీసుకొచ్చాయి అనే నేపథ్యంలో ఈ మూవీ తెరకెక్కనున్నట్టు తెలుస్తుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
చాలా కాలంగా సైలెంట్ గా ఉన్న చిత్రయూనిట్ రీసెంట్ గానే ఈసినిమా రిలీజ్ డేట్ ను ఫిక్స్ చేస్తూ ప్రకటించారు. ఈసినిమాను ఆగష్ట్ 25 వ తేదీన ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. ఈనేపథ్యంలో చిత్రయూనిట్ ప్రస్తుతం ప్రమోషన్ కార్యక్రమాలతో బిజీగా ఉంది. ఇక రీసెంట్ గానే ఈసినిమా నుండి టీజర్ ను రిలీజ్ చేయగా అది సూపర్ రెస్పాన్స్ ను సొంతం చేసుకుంది. మరోవైపు మ్యూజికల్ ప్రమోషన్ కార్యక్రమాలను కూడా మొదలుపెట్టనున్నారు. ఇప్పటికే వెన్నెల్లో ఆడపిల్ల అనే ఫస్ట్ సాంగ్ ను రిలీజ్ చేయగా ఈ పాట మంచి రెస్పాన్సే సొంతం చేసుకుంది. ఇక ఇప్పుడు సెకండ్ సాంగ్ తో వచ్చేశారు మేకర్స్. సొల్లుడా సాంగ్ అంటూ సాగే ఫుల్ సాంగ్ ను తాజాగా రిలీజ్ చేశారు మేకర్స్.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:































