సూపర్ స్టార్ మహేష్ బాబు- త్రివిక్రమ్ కాంబినేషన్ లో వస్తున్న గుంటూరు కారం రీసెంట్ గా చిన్న చిన్న షెడ్యూల్ షూటింగ్ ను కంప్లీట్ చేసుకుంది.ఈ గురువారం నుండి అన్నపూర్ణ స్టూడియో లో కొత్త షెడ్యూల్ స్టార్ కానుంది.ఈ షెడ్యూల్ లో మహేష్ జాయిన్ కానున్నాడు.ప్రముఖ ఫైట్ మాస్టర్లు రామ్ – లక్ష్మణ్ నేతృత్వంలో కొన్ని యాక్షన్ సన్నివేశాలను చిత్రీకరించనున్నారట.ఎలాగైనా నవంబర్ లోగా షూటింగ్ పూర్తి చేయాలనే పట్టుదలతో వుంది చిత్ర బృందం.ఇక ఈసినిమా నుండి త్వరలోనే సాంగ్ ను కూడా రిలీజ్ చేయనున్నారు.ఇప్పటివరకు రెండు పాటలు లాక్ చేశారట.అతి త్వరలో మొదటి పాటకు సంబంధించిన అప్డేట్ ఇవ్వనున్నారని సమాచారం.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
యాక్షన్ మరియు ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ఈసినిమాలో శ్రీ లీల,మీనాక్షి చౌదరి హీరోయిన్లుగా నటిస్తుండగా తమన్ సంగీతం అందిస్తున్నాడు.హారిక హాసిని క్రియేషన్స్ నిర్మిస్తుంది.వచ్చే ఏడాది సంక్రాంతి కి విడుదలకానుంది.ఇదిలావుంటే త్రివిక్రమ్ -మహేష్ కాంబో లో ఇది మూడో సినిమా. ఇంతకుముందు వచ్చిన అతడు,ఖలేజా చిత్రాలు థియేటర్లలో సరైన రెస్పాన్స్ తెచ్చుకోలేకపోయాయి మరి ఈ గుంటూరు కారం ఆ లోటును తీర్చుతుందో లేదో చూడాలి.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: