ఫ్యామిలీ మ్యాన్ మిస్ చేసుకున్న చిరంజీవి ?

chiranjeevi rejects the family man

ది ఫ్యామిలీ మ్యాన్ వెబ్ సిరీస్ ఎంత పెద్ద హిట్టో తెలిసిందే.2019 సెప్టెంబర్ లో విడుదలైన ఈ వెబ్ సిరీస్ సెన్సేషన్ సృష్టించింది.అమెజాన్ ప్రైమ్ లో వచ్చిన ఈ సిరీస్ కొన్ని నెలలపాటు ట్రెండింగ్ లో కొనసాగింది.మొదటి సీజన్ బ్లాక్ బాస్టర్ కావడంతో రెండో సీజన్ కూడా వచ్చింది.ఈసీజన్ కూడా అదే మ్యాజిక్ ను రిపీట్ చేసింది.ఈసిరీస్ ను రాజ్ &డీకే డైరెక్ట్ చేయగా బాలీవుడ్ నటుడు మనోజ్ బాజ్ పాయ్ లీడ్ రోల్ లో నటించాడు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

అయితే ఫ్యామిలీ మ్యాన్ ఆఫర్ ముందు మెగాస్టార్ చిరంజీవి కి వచ్చిందట.దీన్ని వెబ్ సిరీస్ గా కాకుండా సినిమాగా చేద్దాం అని రాజ్&డీకే ,చిరును కలిసి స్టోరీ వినిపించారట.కానీ చిరు ఒప్పుకోలేదు.ఇద్దరు పిల్లల తండ్రి గా కనిపిస్తే ఫ్యాన్స్ ఒప్పుకుంటారో లేదో అని రిజెక్ట్ చేశాడట.దాంతో డైరెక్టర్స్ ఆ పిల్లల పాత్రలను కూడా తీసేద్దాం అనుకున్నారట అయినా చిరు ఇంట్రెస్ట్ చూపించలేదట.అప్పటికి చిరంజీవి, ఖైదీ నెంబర్ 150 సక్సెస్ సెలబ్రేషన్ మూడ్ లో వున్నాడట.

ఈవిషయాలను ప్రముఖ నిర్మాత వైజయంతి మూవీస్ అధినేత అశ్వినీదత్ రీసెంట్ గా జరిగిన ఒక ఇంటర్వ్యూ లో వెల్లడించాడు.ఈవార్తలు కాస్త సోషల్ మీడియా లో వైరల్ అవ్వడం తో చిరు ఒక మంచి సినిమాను మిస్ చేసుకున్నాడని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.ఒకవేళ మరి చిరంజీవి,ది ఫ్యామిలీ మ్యాన్ చేస్తే ఎలావుండేదో.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

 

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

six + eleven =