మా ఊరి పొలిమేర-2 విడుద‌ల‌ తేదీ ఖరారు

Maa Oori Polimera-2 Movie in Theaters From Nov 2nd

శ్రీకృష్ణ క్రియేష‌న్స్ బేన‌ర్‌పై గౌరు గ‌ణ‌బాబు స‌మ‌ర్ప‌ణ‌లో గౌరికృష్ణ నిర్మాత‌గా రూపొందుతోన్న చిత్రం “మా ఊరి పొలిమేర-2′. డా. అనిల్ విశ్వ‌నాథ్ ద‌ర్శ‌కుడు. స‌త్యం రాజేష్‌, డా. కామాక్షి భాస్కర్ల, గెట‌ప్ శ్రీను, రాకెండ్ మౌళి, బాలాదిత్య, సాహితి దాస‌రి, ర‌వి వ‌ర్మ‌, చిత్రం శ్రీను, అక్ష‌త శ్రీనివాస్‌ ముఖ్య పాత్ర‌ల్లో న‌టించారు. కాగా ఈ చిత్రానికి గ్యాని సంగీతం అందిస్తుండగా.. ఖుషేంద‌ర్ ర‌మేష్ రెడ్డి సినిమాటోగ్ర‌ఫీ బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఈ చిత్రం అన్ని కార్య‌క్ర‌మాలు పూర్తి చేసుకుని నవంబ‌ర్ 2న గ్రాండ్‌గా విడుద‌ల‌ కావడానికి సిద్ధ‌మవుతోంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఈ సంద‌ర్భంగా నిర్మాత గౌరికృష్ణ మాట్లాడుతూ.. ” ‘మా ఊరి పొలిమేర‌’ మొద‌టి పార్ట్ ఎంత పెద్ద హిట్ట‌యిందో అంద‌రికీ తెలిసిందే. సెకండ్ పార్ట్ పై ఇప్ప‌టికే భారీ అంచానాలు ఏర్ప‌డ్డాయి. ఆ అంచ‌నాల‌కు త‌గ్గ‌ట్టుగా ఎక్క‌డా రాజీ ప‌డ‌కుండా భారీ బడ్జెట్‌తో చేశాం. ఇటీవ‌ల మెగాప్రిన్స్ వ‌రుణ్ తేజ్ చేతుల మీదుగా విడుద‌లైన టీజ‌ర్‌కు మంచి రెస్పాన్స్ వ‌చ్చింది. ప్ర‌తి విష‌యంలో ఎంతో కేర్ తీసుకుని ద‌ర్శ‌కుడు విశ్వ‌నాథ్ ‘మా ఊరి పొలిమేర‌-2’ పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ ప‌నులు పూర్తి చేస్తున్నారు. న‌వంబ‌ర్ 2న సినిమాను గ్రాండ్‌గా థియేట‌ర్స్‌లో రిలీజ్ చేస్తున్నాం” అని అన్నారు.

ఇక ద‌ర్శ‌కుడు డా. అనిల్ విశ్వ‌నాథ్ మాట్లాడుతూ.. “గ్రామీణ నేప‌థ్యంలో జ‌రిగే మ‌ర్డ‌ర్ మిస్ట‌రీకి బ్లాక్ మ్యాజిక్ అంశాన్ని జోడించి ‘మా ఊరి పొలిమేర‌-2’ చిత్రాన్ని తెర‌కెక్కించాం. మొద‌టి పార్ట్ క‌న్నా సెకండ్ పార్ట్ ఇంకా ఎంతో ఇంట్ర‌స్టింగ్‌గా ఉండ‌బోతుంది. ఇటీవ‌ల విడుద‌లైన టీజ‌ర్‌కు ట్రెమండ‌స్ రెస్పాన్స్ వచ్చింది. పాడేరు, కేర‌ళ‌, ఉత్త‌రాఖండ్ లో షూటింగ్ చేశాము. మా నిర్మాత ఎక్క‌డా రాజీ ప‌డ‌కుండా నేను అడిగిన ప్ర‌తిదీ స‌మ‌కూర్చుతూ సినిమా క్వాలిటీగా రావ‌డానికి స‌హ‌క‌రిస్తున్నారు. స‌త్యం రాజేష్‌, కామాక్షి అద్భుతంగా న‌టించారు. నవంబ‌ర్ 2న మా సినిమా గ్రాండ్‌గా థియేట‌ర్స్‌లో రిలీజ్ కాబోతుంది” అని తెలిపారు.

బ్లాక్‌ మేజిక్‌ కాన్సెప్ట్‌తో తెరకెక్కిన ‘మా ఊరి పొలిమేర‌` నేరుగా ఓటీటీలో రిలీజై సూపర్ హిట్ అయింది. హాట్‌స్టార్‌లో విడుదలైన ఈ సినిమా కొన్ని వారాల పాటు ట్రెండింగ్‌లో ఉంది. ఇందులో సత్యం రాజేష్‌ నటన చూసి ప్రతి ఒక్కరూ షాక్ అయ్యారు. అప్పటివరకు కమెడియన్‌గా నటించిన రాజేష్‌.. ఈ సినిమాతో ప్రతినాయకుడిగా తనలోని విలక్షణ నటనను చూపించి పలువురి ప్రశంసలు అందుకున్నాడు. ఓటీటీలో ఈ సినిమా సూపర్‌ రెస్పాన్స్‌ తెచ్చుకోవడంతో, మేకర్స్ వెంటనే సీక్వెల్‌ను చేయనున్నట్లు ప్రకటించారు. అయితే ఫస్ట్ పార్టుకు వచ్చిన ఆదరణతో.. సీక్వెల్‌ను మాత్రం ఈసారి థియేటర్‌లోనే రిలీజ్‌ చేయాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే న‌వంబ‌ర్ 2న సినిమాను థియేట‌ర్స్ లో రిలీజ్ చేస్తున్నారు.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.