ప్రభాస్ సలార్ నైజాం లో సరికొత్త రికార్డు సృష్టించింది.నిన్నటి తో ఈసినిమా 100కోట్ల మార్క్ ను క్రాస్ చేసింది దాంతో ఈ ఫీట్ సాధించిన మూడో సినిమాగా ఘనత సాధించింది.ఇంతకుముందు బాహుబలి 2,ఆర్ఆర్ఆర్ ఈరికార్డు ను చేరుకున్నాయి.ఇక సలార్ నైజాం లో డ్రీం రన్ ను కొనసాగిస్తోంది.ప్రభాస్ కు నైజాంలో సాలిడ్ ట్రాక్ రికార్డు వుంది. ఇంతకుముందు ప్లాప్ సినిమాలు కూడా మంచి వసూళ్లను రాబట్టాయి.ఇప్పుడు సలార్ కు హిట్ టాక్ రావడంతో ఏకంగా 100కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టి చరిత్ర సృష్టించింది.ఆల్రెడీ బ్రేక్ ఈవెన్ ను కూడా క్రాస్ చేసింది.మైత్రి మూవీ మేకర్స్ ఈసినిమాను నైజాం లో రిలీజ్ చేసింది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక తెలుగు రాష్ట్రాల విషయానికి వస్తే నిన్నటి వరకు ఈసినిమా 220కోట్ల గ్రాస్ మార్క్ ను చేరుకుంది దాంతో బ్రేక్ ఈవెన్ ను క్రాస్ చేసి హిట్ అనిపించుకుంది.హిందీలో కూడా 100కోట్ల నెట్ ను క్రాస్ చేసి హిట్ అనిపించుకుంది.ఓవరాల్ గా చూస్తే 12 రోజుల్లో ప్రపంచ వ్యాప్తంగా 550కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లను రాబట్టుకుంది. మరో 60కోట్ల వరకు రాబడితే చాలు బ్రేక్ ఈవెన్ ను క్రాస్ చేసినట్లే.సంక్రాంతి వరకు ఛాన్స్ ఉండడంతో ఆ మార్క్ ను చేరుకోవడం పెద్ద కష్టమేమి కాకపోవచ్చు.
ప్రశాంత్ నీల్ డైరెక్ట్ చేసిన ఈసినిమాలో పృథ్వీరాజ్ సుకుమారన్ కీలక పాత్రలో కనిపించగా రవి బస్రుర్ సంగీతం అందించాడు. విజయ్ కిరగందూర్ నిర్మించాడు.ఇక సలార్ రెండు పార్టులు గా రానుందని తెలిసిందే. ప్రస్తుతం విడుదలైన మొదటి పార్ట్ సీజ్ ఫైర్ సూపర్ రెస్పాన్స్ తెచ్చుకోవడంతో సెకండ్ పార్ట్ శౌర్యంగ పర్వం ఫై అంచనాలు పెరిగాయి.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: