నమ్రతతో మహేశ్‌ బాబు లవ్లీ పిక్.. నెట్టింట వైరల్

Mahesh Babu Shared Lovely Pic with Wife Namrata Goes Viral

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్‌ బాబు సినిమాలతో ఎంత బిజీగా ఉన్నప్పటికీ తప్పనిసరిగా ఫ్యామిలీకి తగిన సమయం కేటాయిస్తుంటారన్న విషయం తెలిసిందే. ఒకవైపు ప్రొఫెషనల్ కెరీర్‌ని, అలాగే మరోవైపు పర్సనల్ లైఫ్‌ని ఆయన సమంగా బ్యాలన్స్ చేస్తుంటారు. ఈ విషయంలో చాలామందికి మహేశ్‌ బాబు ఇన్స్పిరేషన్‌గా నిలుస్తారంటే అతిశయోక్తి కాదు. మూవీ షూటింగులతో బిజీగా నిత్యం ఉండే ఆయన ఏ మాత్రం ఖాళీ సమయం దొరికినా కుటుంబంతో గడపడానికే ప్రాధాన్యం ఇస్తారు. ఇక నూతన సంవత్సర వేడుకలను ఎక్కువగా విదేశాల్లో జరుపుకోవడం మహేశ్‌కి అలవాటు. దీనిలో భాగంగా ఈసారి మహేశ్ బాబు కొత్త సంవత్సర వేడుకలు జరుపుకునేందుకు కుటుంబ సమేతంగా దుబాయ్ వెళ్లారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

దీనిలో భాగంగా ఈసారి మహేశ్ బాబు కొత్త సంవత్సర వేడుకలు జరుపుకునేందుకు కుటుంబ సమేతంగా దుబాయ్ వెళ్లారు. అయితే పనిలోపనిగా మహేశ్ అక్కడ ఒక సాఫ్ట్ డ్రింక్ యాడ్ షూటింగ్‍ చిత్రీకరణలో కూడా పాల్గొన్నట్లు ఆయన సతీమణి నమ్రత శిరోద్కర్ సోషల్ మీడియాలో షేర్ చేసిన ఫోటోల ద్వారా తెలుస్తోంది. అయితే ఈ సందర్భంగా మహేశ్ బాబు కొత్త సంవత్సరానికి స్వాగతం పలుకుతూ తన అభిమానుల కోసం రొమాంటిక్ ఫోటో ఒకటి ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశారు. అందులో నమ్రత సోఫాలో కూర్చుని ఉండగా.. పక్కనే ఉన్న మహేశ్ ఆమెను ప్రేమగా ముద్దు పెట్టుకుంటున్నట్టుగా ఉంది. ప్రస్తుతం ఈ ఫోటో సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది.

 

View this post on Instagram

 

A post shared by Mahesh Babu (@urstrulymahesh)

ఇక సినిమాల విషయానికి వస్తే, మహేశ్ బాబు ప్రస్తుతం ‘గుంటూరు కారం’ మూవీలో నటిస్తుండగా.. ఇటీవలే షూటింగ్ పూర్తి అయింది. త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో శ్రీలీల, మీనాక్షి చౌదరిలు కథానాయికలుగా చేస్తున్నారు. ఈ సినిమాకు థమన్ సంగీతం అందిస్తుండగా.. మధి కెమెరామెన్‌గా, నవీన్ నూలి ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. హారిక అండ్ హాసిని క్రియేషన్స్‌పై ఎస్.రాధాకృష్ణ నిర్మిస్తున్న ఈ సినిమా సంక్రాంతి పండగ సందర్భంగా జనవరి 12న గ్రాండ్‍గా విడుదలవుతోంది.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

1 × five =