సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన నిర్మాత బెల్లంకొండ సురేష్ అలాగే టాలీవుడ్ నుంచి కూడా పలువురు ప్రముఖులు నూతన ముఖ్యమంత్రికి శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఇప్పటికే మెగాస్టార్ చిరంజీవి, అక్కినేని నాగార్జున, నందమూరి బాలకృష్ణ, దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు తదితరులు సీఎం రేవంత్ రెడ్డిని కలిశారు. ఈ క్రమంలో తాజాగా ప్రముఖ ప్రొడ్యూసర్ బెల్లంకొండ సురేష్ కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలుసుకున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఈ మేరకు బెల్లంకొండ సురేష్ మంగళవారం సచివాలయంలో సీఎం రేవంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. ఇటీవలే తెలంగాణ రెండో ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన సందర్భంగా అయనకు పుష్పగుచ్ఛం ఇచ్చి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం సీఎం రేవంత్ రెడ్డితో కాసేపు ముచ్చటించారు. సినీ పరిశ్రమలో అందరితో కలుపుగోలుగా వుండే మీరు ఈ రోజున ముఖ్యమంత్రి అయ్యారు, పరిశ్రమ అభివృద్ధికి మీ సహాయ సహకారాలు అందించాలని కోరగా అందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సానుకూలంగా స్పందించారు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: