సూపర్ స్టార్ మహేష్ బాబు నుండి వస్తున్న మోస్ట్ అవైటెడ్ సినిమా గుంటూరు కారం. అతడు, ఖలేజా సినిమాల తరువాత మాటల మాంత్రికుడు త్రివిక్రమ్, మహేష్ బాబు కాంబినేషన్ లో వస్తున్న సినిమా కాబట్టి సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. ప్రస్తుతం అయితే చిత్రయూనిట్ ప్రమోషన్ కార్యక్రమాలతో బిజీగా ఉంది. ఇప్పటికే ఈసినిమా నుండి పలు పోస్టర్లు, అలానే దమ్ మసాలా సాంగ్ అలానే ఓ మై బేబీ, కుర్చీ మడత పెట్టి అనే పాటలను రిలీజ్ చేయగా వాటికి సూపర్ రెస్పాన్స్ వచ్చింది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక తాజాగా ఈసినిమా గురించి పలు విషయాలు పంచుకున్నారు నిర్మాత నాగవంశీ. ట్విట్టర్ స్పేస్ లో మహేష్ బాబు ఫ్యాన్స్ తో ముచ్చటించిన నాగవంశీ పలు విషయాలపై క్లారిటీ ఇచ్చారు. మహేష్ తో సినిమా కోసం దాదాపు 5ఏళ్లుగా వెయిట్ చేస్తున్నాం.. ఇప్పుడు అది నెరవేరిందని తెలిపారు. అంతేకాదు మహేష్ ఫ్యాన్స్ వర్రీ అవ్వాల్సిన పనిలేదు.. ఫస్ట్ హాఫ్ బీజీయం ఇప్పటికే లాక్ చేశాం..చాలా బాగా వచ్చింది.. ఈసినిమా ప్రోపర్ ఫన్ ఎంటర్ టైనర్ .. ఇంటర్వెల్ సీక్వెన్స్ లో మహేష్ ఎమోషన్ బాగా వర్కవుట్ అయింది. లాస్ట్ 45 నిమిషాలు ఫైట్, సాంగ్ ఇంకా ఎమోషన్ తో థ్రిల్లింగ్ గా ఉంటుందన్నారు. టైటిల్ కార్డ్ రెడీ అవుతుంది.. అందరికీ నచ్చితే మూవీలో అటాచ్ చేస్తామని తెలిపారు. ఇంకా రెవెన్యూ లిమిటేషన్స్ గురించి కంగారు పడాల్సిన పనిలేదు..ఈసినిమా లాంగ్ రన్ లో నడుస్తుందని క్లారిటీ ఇచ్చారు. నైజాం, ఇంకా ఏపీలో 1ఏఎం, 4ఏఎం షోస్ కు ట్రై చేస్తున్నాం. ట్రైలర్ ను జనవరి 6వ తేదీన రిలీజ్ చేస్తున్నట్టు కన్ఫామ్ చేశారు.
ఈసినిమాలో మహేష్ బాబు సరసన మీనాక్షి చౌదరి, శ్రీలీల హీరోయిన్లుగా నటిస్తున్నారు. హారిక అండ్ హాసిని క్రియేషన్స్‌పై ఎస్.రాధాకృష్ణ ఈసినిమాను నిర్మిస్తున్న ఈసినిమాకు మధి కెమెరామెన్‌గా, నవీన్ నూలి ఎడిటర్‌గా, థమన్ సంగీత దర్శకుడిగా పనిచేస్తున్నారు. ఈసినిమాను సంక్రాంతి కానుకగా 2024, జనవరి 12న ప్రపంచవ్యాప్తంగా భారీస్థాయిలో విడుదల చేస్తున్నారు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: