నాగ చైతన్య చందూ మొండేటి దర్శకత్వంలో సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే కదా. తండేల్ అనే టైటిల్ తో ఈసినిమా వస్తుంది. మత్స్యకారుడు గణగల్ల రామరావు జీవితాన్ని ఈసినిమా ద్వారా చూపిస్తున్నారు. ఇక యదార్థ సంఘటనల ఆధారంగా తెరకెక్కుతున్న ఈసినిమా కోసం నాగచైతన్య తన మేకోవర్ ను పూర్తిగా మార్చేశాడు. ఇక ఈ సినిమా షూటింగ్ ను ఈమధ్యనే మొదలుపెట్టిన సంగతి తెలిసిందే కదా. షూటింగ్ మొదలుపెట్టినప్పుటినుండీ ఏదో ఒక అప్ డేట్ ఇస్తూనే ఉన్నారు. ఈసినిమా షూటింగ్ ఉడిపిలో మొదలవ్వగా రీసెంట్ గానే ఈసినిమా షూటింగ్ లో సాయి పల్లవి కూడా జాయిన్ అయినట్టు తెలిపారు. ఇక ఇప్పుడు తాజాగా మరో సర్ ప్రైజింగ్ అప్ డేట్ ఇచ్చారు మేకర్స్. ఈసినిమా ఫస్ట్ గ్లింప్స్ ను రిలీజ్ చేయబోతున్నట్టు ప్రకటించారు మేకర్స్. జనవరి 5వ తేదీన సాయంత్రం 5 గంటలకు గ్లింప్స్ ను రిలీజ్ చేస్తున్నట్టు తెలిపారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
There is a riveting story from the captivating world of the coast, waiting to be told 🌊#EssenceofThandel out on January 5th at 5:00 PM ❤️🔥#Thandel #Dhullakotteyala 🔥
Yuva Samrat @chay_akkineni @Sai_Pallavi92 @chandoomondeti @ThisIsDSP #AlluAravind #BunnyVas @_riyazchowdary… pic.twitter.com/AOq7Kb2T4n
— Geetha Arts (@GeethaArts) January 2, 2024
కాగా ఈసినిమాలో సాయి పల్లవి హీరోయిన్ గా నటిస్తుంది. అల్లు అరవింద్ సమర్పణలో గీతా ఆర్ట్స్ 2 బ్యానర్ పై బన్నీ వాసు ఈసినిమాను నిర్మిస్తున్నాడు. దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్న ఈసినిమాకు శ్యామ్ దత్ సినిమాటోగ్రఫి అందిస్తున్నాడు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు :
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:




























