పుష్ప 2 రిలీజ్ డేట్ పై క్లారిటీ

pushpa 2 makers clarity on release date

సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా వచ్చిన సినిమా పుష్ప. అల్లు అర్జున్ ఫుల్ డీ గ్లామరైజ్డ్ గా రా అండ్ రస్టిక్ మేకోవర్ లో గంధపు చెక్కల స్మగ్లింగ్ నేపథ్యంలో వచ్చిన ఈసినిమా దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ప్రస్తుతం ఈసినిమాకు సెకండ్ పార్ట్ వస్తున్న సంగతి తెలిసిందే కదా. ఈసినిమా షూటింగ్ ఎప్పుడో మొదలుపెట్టారు చిత్రయూనిట్. ఇప్పటివరకూ కొంత షూటింగ్ కూడా పూర్తి చేసుకుంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇదిలాఉండగా ఈసినిమాను ఆగష్ట్ 15వ తేదీన రిలీజ్ చేస్తున్నట్టు ఇప్పటికే ప్రకటించిన సంగతి తెలిసిందే కదా. అయితే ఈమధ్య ఈ సినిమా రిలీజ్ డేట్ పై పలు వార్తలు తెరపైకి వస్తున్నాయి. ఈసినిమా రిలీజ్ డేట్ మారే అవకాశం ఉందన్న కథనాలు మొదలయ్యాయి. అయితే ఇప్పుడు ఈ వార్తలకు క్లారిటీ వచ్చేసింది. కొత్త సంవత్సరం సందర్భంగా చిత్రయూనిట్ పోస్టర్ ను రిలీజ్ చేసింది. అందులో 2024 రూల్ పుష్ప అంటూ పోస్టర్ లో పేర్కొన్నారు. అంతేకాదు రిలీజ్ డేట్ ను కూడా మెన్షన్ చేస్తూ ఆగష్ట్ 15వ తేదీనే రిలీజ్ అవుతుందని తెలిపారు. దీంతో ఈసినిమా రిలీజ్ డేట్ పై క్లారిటీ వచ్చేసింది.

కాగా పుష్ప..ది రూల్ కూడా మైత్రీ మూవీ మేకర్స్‌ బ్యానర్‌పై భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతుంది. రెండో పార్టులో కూడా కన్నడ బ్యూటీ రష్మిక మందన్నా ఫీ మేల్‌ లీడ్‌ రోల్‌లో నటిస్తుంది. అలానే దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించనున్నాడు. అయితే ఇతర నటీనటులపై క్లారిటీ రావాల్సి ఉంది. జగపతిబాబు కూడా ఓకీలక పాత్రలో నటిస్తున్నాడు. మరి పార్ట్ 2 తో ఎన్ని రికార్డులు క్రియేట్ చేస్తాడో చూడాలి.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

11 − one =