యాక్షన్ ఎలిమెంట్స్ తో ఆకట్టుకుంటున్న సైంధవ్ ట్రైలర్

venkatesh saindhav movie trailer out now

టాలీవుడ్ అగ్రహీరో విక్టరీ వెంకటేష్ కూడా వరుసగా సినిమాలు చేసుకుంటూ వెళుతున్నారు. అంతేకాదు ఓటీటీలో కూడా తన ఎంట్రీ ఇప్పటికే ఇచ్చేశారు. రానా నాయుడు అంటూ వచ్చిన ఈ వెబ్ సిరీస్ బాగానే ఆకట్టుకుంది. అయితే వెంకీని సిల్వర్ స్క్రీన్ పై చూసి చాలా రోజులైపోయింది. దీంతో వెంకీ సినిమాకోసం ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇక వెంకీ నుండి మరికొద్ది రోజుల్లో రాబోతున్న సినిమా సైంధవ్. శైలేష్ కొలను దర్శకత్వంలో ఈసినిమా తెరకెక్కింది. చాలా కాలం తర్వాత యాక్షన్ మూవీతో వెంకటేష్ వస్తుండటం మరోవైపు.. తండ్రీ,కూతుళ్ల సెంటిమెంట్ కూడా ఈ సినిమాలో ఉండటంతో సైంధవ్‍కు చాలా క్రేజ్ పెరిగింది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ప్రస్తుతం అయితే చిత్రయూనిట్ ప్రమోషన్ కార్యక్రమాలతో బిజీగా ఉంది. ఇప్పటికే టీజర్, పాటలు రిలీజ్ చేయగా.. తాజాగా ట్రైలర్ ను రిలీజ్ చేశారు మేకర్స్. ట్రైలర్ కూడా ఆకట్టుకుంటుంది. మరోసారి వెంకీ మాస్ పాత్రలో యాక్షన్ సీక్వెన్స్ తో ఆకట్టుకునేలా ఉన్నాడు. ఎమోషనల్ సన్నివేశాలు కూడా కనెక్ట్ అయ్యేలా ఉన్నాయి. విజువల్స్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కూడా ఆక్టటుకుంటున్నాయి. ట్రైలర్ అయితే సినిమాపై అంచనాలను మరింత పంచేశాయి.

కాగా శ్రథ్త శ్రీనాథ్ హీరోయిన్ గా నటిస్తున్న ఈసినిమాలో బాలీవుడ్‌ యాక్టర్‌ నవాజుద్దీన్ సిద్దిఖీ, ఆర్య, రుహానీ శర్మ, ఆండ్రియా జెర్మియా కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ఈసినిమాకు సంతోష్ నారాయణన్ సంగీతం అందిస్తుండగా.. ఎస్ మణికందన్ కెమెరామెన్ గా, గ్యారీ బిహెచ్ ఎడిటర్ గా, అవినాష్ కొల్లా ప్రొడక్షన్ డిజైనర్ గా పని చేస్తున్నారు. నిహారిక ఎంటర్ టైన్మెంట్ బ్యానర్ పై వెంకట్ బోయనపల్లి ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈసినిమాకు కిషోర్ తాళ్లూరు సహ నిర్మాత సైంధవ్ పాన్ ఇండియా చిత్రంగా అన్ని దక్షిణాది భాషలు, హిందీలో విడుదల కానుంది.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

5 × five =