అర్జున్ రెడ్డి ఫేమ్ సందీప్ వంగ దర్శకత్వంలో రణబీర్ కపూర్ హీరోగా వస్తున్న సినిమా యానిమల్. డిసెంబర్ 1వ తేదీన ఈసినిమాను రిలీజ్ చేస్తున్న నేపథ్యంలో ప్రమోషన్ కార్యక్రమాల్లో స్పీడు పెంచారు మేకర్స్. ఇప్పటికే రిలీజ్ చేసిన పాటలు, పోస్టర్లకు అలానే టీజర్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇంకా మ్యూజికల్ ప్రమోషన్ కార్యక్రమాలను కూడా మొదలుపెట్టారు. ఇప్పటికే అమ్మాయి అనే పాటను రిలీజ్ చేశారు. మొదటి సాంగ్ లో రష్మిక-రణబీర్ పెళ్లికి ఇంట్లో పెద్దవాళ్లు ఒప్పుకోకపోవడం.. అయినా వారిద్దరి బయటకు వెళ్లిపోయి పెళ్లి చేసుకోవడం చూపించారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇప్పుడు రెండో పాటను రిలీజ్ చేశారు మేకర్స్. నే వేరే నవ్వు వేరే అంటూ వచ్చే ఈపాటను రిలీజ్ చేశారు. ఇక ఈపాటలో రష్మిక-రణబీర్ కు ఇద్దరు పిల్లలను చూపించారు.. ఇక రణబీర్ రావడం.. ఆతరువాత వదిలి వెళ్లిపోవడం.. చివరిలో నేను వెళుతున్నాడు.. నేను మళ్లీ రాకపోతే పెళ్లి చేసుకోవద్దు అంటూ చెబుతాడు. మంచి ఎమోషనల్ గా ఉన్న ఈపాట అయితే ఆకట్టుకుంటుంది.
Animal 2nd Telugu Song || Ney VeyReyhttps://t.co/LPthWUAvwk 👆🏼@AnimalTheFilm #RanbirKapoor @iamRashmika @singer_karthik @shreyaspuranik @IananthaSriram @sureshsrajan @imvangasandeep @TSeries @EricnPillai @SVC_official @VangaPranay @VangaPictures pic.twitter.com/7G6UXzsvDv
— Bhadrakali Pictures (@VangaPictures) October 27, 2023
కాగా ఈసినిమాలో రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తుండగా.. అనిల్ కపూర్, బాబి డియోల్ కూడా కీలక పాత్రల్లో నటిస్తున్నారు టీ సిరీస్, సినీ వన్ స్టూడియోస్, భద్రకాళీ పిక్చర్స్ బ్యానర్స్ పై భూషణ్‌కుమార్, కిషన్ కుమార్, ప్రణయ్ రెడ్డి వంగ, మురాద్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. తెలుగులో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై రిలీజ్ చేస్తున్నారు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: