విజయ్ దేవరకొండ ‘ఐరన్‌ వంచాలా ఏంటి?’ డైలాగ్.. ట్విట్టర్‌లో ట్రెండింగ్‌

Vijay Deverakonda Dialogue From Family Star Trending in Twitter

సోషల్ మీడియా వినియోగం పెరిగిన ఈ రోజుల్లో ప్రతి చిన్న విషయం హైలైట్ అవుతోంది. ఏ ఫోటో ఎందుకు వైరల్ అవుతుందో.. ఏ వీడియో ఎందుకు ట్రెండ్ అవుతుందో ఎవ్వరూ ఊహించలేరు. సామాన్యులకు చెందిన విషయాలే ఇలా ఉంటే.. ఇక సెలెబ్రిటీల సంగతి అయితే చెప్పనక్కరలేదు. తాజాగా ఇలాంటిదే ఒక డైలాగ్ సోషల్ మీడియాలో విపరీతంగా ట్రెండింగ్‌ అవుతోంది. ఇంతకీ విషయం ఏంటంటే..? టాలీవుడ్ రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ ‘ఖుషి’ తర్వాత రీసెంట్‌గా ‘ఫ్యామిలీ స్టార్‌’ అనే సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. పరశురామ్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న ఈ మూవీలో ‘సీతారామం’ ఫేమ్ మృణాల్‌ ఠాకూర్‌ కథానాయికగా న‌టిస్తుంది. ఇటీవలే ఈ సినిమా నుంచి టీజ‌ర్ విడుద‌ల అయిన విష‌యం గుర్తుండే ఉంటుంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

కాగా ఈ టీజ‌ర్‌లో విజ‌య్ దేవరకొండ చెప్పిన ఒక డైలాగ్ ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది. ప్రస్తుతం ఇంటర్నెట్‌లో “ఏం నడుస్తోంది?” అనే ప్రశ్నకు సమాధానంగా.. ఆ డైలాగ్ నడుస్తోంది అని నెటిజెన్లు అంటున్నారు. దీనికి సంబంధించి పలు మీమ్స్ కూడా నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఇక ఇంత‌కీ ఆ డైలాగ్ ఎంటంటే.. “ఐర‌నే వంచాలా ఏంటి?”. ‘ఫ్యామిలీ స్టార్‌’ టీజ‌ర్‌లో విలన్‌ హీరోని ఉద్దేశించి ‘లైన్లో నిలబడి ఉల్లిపాయలు తేవడాలు, టైమ్‌కి లేచి పిల్లల్ని రెడీ చేసి స్కూల్‌కి పంపించడాలు అనుకున్నావా మగతనం అంటే’ అని ఎగతాళిగా అంటాడు.

అయితే దీనికి విజయ్ సమాధానమిస్తూ.. ‘భలే మాట్లాడతారన్నా మీరంతా.. ఉల్లిపాయలు కొంటే ఆడు మనిషికాదా.. పిల్లల్ని రెడీ చేస్తే ఆడు మగాడు కాదా.. ఐరన్‌ వంచాలా ఏంటి? అని కూల్‌గా చెబుతాడు. దీంతో ఈ డైలాగ్ కి ఫిదా అయిన నెటిజెన్స్ ట్విట్టర్‌లో ఐర‌నే వంచాలా ఏంటి? అంటూ తెగ ట్రెండ్ చేస్తున్నారు. ప్రభాస్ ‘మిర్చి’ సినిమాలో విలన్ కు వార్నింగ్ ఇచ్చే సన్నివేశం.. అలాగే ‘దమ్ము’ సినిమాలో ఫైట్ లో జూనియర్ ఎన్టీఆర్ ఒక విలన్ మెడ చుట్టూ ఐరన్ రాడ్ వంచే సీన్ వంటివి వైరల్ చేస్తున్నారు. చివరకు సూపర్ హిట్ హాలీవుడ్ మూవీ ‘ఐరన్ మాన్’ లోని సన్నివేశానికి కూడా ఈ డైలాగ్ జోడించడం విశేషం. దీనికి సంబ‌ధించిన పోస్టుల‌పై మీరూ ఓ లుక్కేయండి.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

seventeen − 2 =