గుంటూరు కారంలోకి అలా వచ్చాను- డీవోపీ మనోజ్ పరమహంస

dop manoj paramahamsa about guntur kaaram movie

త్రివిక్రమ్ దర్శకత్వంలో సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా వస్తున్న సినిమా గుంటూరు కారం. ఈసినిమా ప్రస్తుతం షూటింగ్ ను పూర్తి చేసకుంటుంది. ఇక ఈసినిమా నుండి ఈమధ్యన వచ్చే అప్ డేట్లు సినిమాపై అంచనాలను పెంచేస్తున్నాయి. అంతేకాదు పలువురు ఈసినిమా గురించి చేస్తున్న కామెంట్స్ కూడా సినిమాపై క్యూరియాసిటీని పెంచుతున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక తాజాాగా ఈసినిమా గురించి డీవోపీ మనోజ్ పరమహంస కూడా మాట్లాడుతూ పలు ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న మనోజ్ ను కొన్ని షాట్స్ ఇప్పటికే పీఎస్ వినోద్ గారు చేశారు.. ఆయన ప్లేస్ లోకి మీరు ఎలా వచ్చారు..?ఇప్పుడు మీరు జాయిన్ ఎలా ఉంది.. మహేష్ గారితో వర్క్ చేయడం ఎలా ఉంది అన్న ప్రశ్నలకు. వినోద్ కు కొన్ని కమిట్ మెంట్స్ ఉండటం వల్ల థమన్ నాకు ఫోన్ చేసి అడిగాడు.. అప్పటికే నిఖిల్ స్వయంభూ లైన్ లో ఉంది.. కానీ థమన్ మాత్రం నువ్వు చేయాలని.. మేము మాట్లాడుకుంటా అని చెప్పాడు. అలా ఈసినిమాలోకి వచ్చాను.

నాకైతే ఎలాంటి ఛాలెంజెస్ లేవు.. పీఎస్ వినోద్ కొన్ని షాట్స్ తీశారు.. తన సీన్స్ సెపరేట్.. నాకు ఫ్రీడమ్ ఇచ్చేశారు. ఇంకా మహేష్ తో చేయడంతో నాకు ఒక కంప్లీషన్ వచ్చినట్టు ఒక ఫీల్ వచ్చింది.. దాదాపు అందరి స్టార్స్ తో చేశాను.. అందులోనూ అందరినీ నచ్చిన వ్యక్తి మహేష్.. నన్ను అడుగుతుండేవాళ్లు.. అందరితో చేస్తున్నావు.. మహేష్ తే చేయడంలేదు ఏంటని అనేవాళ్లు..దీంతో ఇప్పుడు ఇది కంప్లీట్ అయింది.. మహేష్ గారికి సినిమా ఫీల్డ్ లో అన్ని విషయాలు తెలుసు.. మనం చేసే పని, లైటింగ్ అన్ని డీటెయిల్స్ తెలుసు.. అన్ని విషయాలు గమనిస్తుంటారు..మనం ఏచిన్న తప్పు చేసినా కనిపెట్టేస్తారు.. ఆయన చాలా పర్ఫెక్ట్ ఉంటారు.. అన్నీ పిక్చర్ పర్ఫెక్ట్ గా ఉండాలి అన్నట్టు ఉంటారు.కొంతమంది డీవోపీ గురించి పట్టించుకోరు కానీ మహేష్ మాత్రం చాలా డీటైయిల్డ్ గా ఉంటారు అని తెలిపాడు.

హారిక అండ్ హాసిని క్రియేషన్స్‌పై ఎస్.రాధాకృష్ణ ఈసినిమాను నిర్మిస్తున్న ఈసినిమాకు నవీన్ నూలి ఎడిటర్‌గా, థమన్ సంగీత దర్శకుడిగా పనిచేస్తున్నారు. ఈసినిమాను సంక్రాంతి కానుకగా 2024, జనవరి 12న ప్రపంచవ్యాప్తంగా భారీస్థాయిలో విడుదల చేస్తున్నారు.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.