మొత్తానికి ఈఏడాది రెండు సినిమాలతో వచ్చి రెండు సినిమాలతో బ్లాక్ బస్టర్ హిట్లను అందుకున్నాడు నటసింహం బాలకృష్ణ. అంతేకాదు ఈసినిమాతో హ్యాట్రిక్ ను సైతం అందుకున్నాడు. అఖండ, వీరసింహారెడ్డి, ఇప్పుడు భగవంత్ కేసరి సినిమాతో వరుసగా మూడు బ్లాక్ బస్టర్ లను సొంతం చేసుకున్నాడు. ఇప్పుడున్న పరిస్థితుల్లో హ్యాట్రిక్ కొట్టడం అంటే మాములు విషయం కాదు కానీ బాలయ్య మాత్రం ఆ రేర్ ఫీట్ ను అందుకున్నాడు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
అనిల్ రావిపూడి దర్శకత్వంలో ఈసినిమా రాగా ఇందులో అన్ని సినిమాలకు భిన్నంగా బాలయ్యతో చేయించాడు అనిల్. ఈసారి ఎమోషనల్ యాక్షన్ ఎంటర్టైనర్ తో వచ్చాడు. అంతేకాకుండా మహిళలకు మంచి మేసేజ్ ను కూడా ఇవ్వడంతో అన్ని వర్గాల వారిని ఆకట్టుకుంటుంది. అందుకే కలెక్షన్స్ పరంగా అన్ స్టాపబుల్ అంటూ పరుగులు పెడుతుంది ఈసినిమా. ఈసినిమా ఇప్పటికే 100 కోట్ల క్లబ్ లోకి చేరిన సంగతి తెలిసిందే కదా. ఇక నేటితో సినిమా రిలీజ్ అయి వారం రోజులు పూర్తి చేసుకుంది. దీంతో ఫస్ట్ వీక్ ముగిసేవరకూ ఈసినిమా 112 కోట్లకు పైగా కలెక్షన్స్ ను సొంతం చేసుకుంది. 68 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ తో బరిలోకి దిగిన ఆసినిమా ప్రపంచ వ్యాప్తంగా వారం రోజులకు 56 కోట్ల వరల్డ్ వైడ్ షేర్ అందుకుంది. మరి ఈ వీకెండ్ లోపు బ్రేక్ ఈవెన్ చేసే అవకాశం కనిపిస్తుంది.
A worldwide gross of a Massive 112.18cr+ in its First week for #BhagavanthKesari at the box office 🔥
Audiences of all ages are showering all their love on the #BlockbusterBhagavanthKesari ❤️🔥
– https://t.co/rrWPhVwU6B#NandamuriBalakrishna @AnilRavipudi @MsKajalAggarwal… pic.twitter.com/PkSpFs6iqh
— Shine Screens (@Shine_Screens) October 26, 2023
కాగా కాజల్ హీరోయిన్ గా నటించగా శ్రీలీల మరో కీలక పాత్రలో నటించింది. ఇప్పటివరకూ గ్లామర్ రోల్స్ చేసిన శ్రీలీల ఈసినిమాలో పెర్ఫార్మన్స్ ఓరియెంటెడ్ రోల్ చేసింది. అర్జున్ రాంపాల్ విలన్ పాత్రలో నటించాడు. షైన్ స్క్రీన్స్ బ్యానర్ పై సాహు గారపాటి, హరీష్ పెద్ది నిర్మించిన ఈసినిమాకు
సినిమాటోగ్రఫి.. సి.రామ్ ప్రసాద్, సంగీతం.. ఎస్ థమన్ అందించారు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: