తెలుగు, తమిళ చిత్రాల్లో ఎన్నో వైవిధ్యమైన పాత్రలు చేసి తిరుగులేని స్థానాన్ని దక్కించుకున్న విలక్షణ నటుడు చియాన్ విక్రమ్. తన ప్రతి సినిమాలో ఏదో ఒక వైవిధ్యత ఉండేలా చూసుకుంటాడు. ప్రస్తుతం విక్రమ్ పలు సినిమాలతో బిజీగా ఉన్నాడు. అందులో ధ్రువ నక్షత్రం సినిమా కూడా ఒకటి. అయితే ఈసినిమా ఇప్పటిది కాదు ఎప్పటినుండో పెండింగ్ లో ఉన్న సినిమా. గౌతమ్ మీనన్ దర్శకత్వంలో ఈసినిమా వస్తుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
నిజానికి 2016 లో షూటింగ్ మొదలు పెట్టుకున్న ఈ చిత్రాన్ని 2017 లో రిలీజ్ చేయాలని అనుకున్నారు. కానీ అనేక కారణాలు వల్ల సినిమా వాయిదా పడుతూ వచ్చింది. ఇక ఎట్టకేలకు షూటింగ్ పూర్తి చేసి ఈసినిమాను రిలీజ్ కు సిద్దం చేస్తున్నారు. నవంబర్ 24వ తేదీన ఈసినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈనేపథ్యంలో ఈసినిమా ప్రమోషన్స్ ను మొదలుపెట్టారు. దీనిలో భాగంగానే తాజాగా ఈసినిమా ట్రైలర్ ను రిలీజ్ చేశారు మేకర్స్. ట్రైలర్ అయితే ఆకట్టుకుంటుంది.
ఇక ఈసినిమాలో రీతూ శర్మ హీరోయిన్ గా నటిస్తుంది. ఇంకా ఐశ్వర్యారాజేశ్, సిమ్రాన్, రాధికా ఇతర నటీనటులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఒండ్రగ ఎంటర్టైన్మెంట్, కొండదువోం ఎంటర్టైన్మెంట్, ఎస్కేప్ ఆర్టిస్ట్స్ మోషన్స్ పిక్చర్స్ బ్యానర్లపై సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ మూవీకి హరీష్ జైరాజ్ సంగీతం అందిస్తున్నాడు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: