బాక్సాఫీస్ వద్ద యానిమల్ సంచలనం

Animal Box Office Collection Day 10 Ranbir Kapoor's Action Drama Enters Rs 700 Cr Club

బాలీవుడ్ స్టార్ హీరో రణ్​బీర్ కపూర్ హీరోగా.. ‘అర్జున్ రెడ్డి’ ‘కబీర్ సింగ్’ ఫేమ్ సందీప్ రెడ్డి వంగా తెర‌కెక్కించిన తాజా చిత్రం ‘యానిమల్’. ఈ సినిమాలో రష్మిక మందన్నా హీరోయిన్‌గా న‌టించ‌గా.. ప్రముఖ బాలీవుడ్ నటులు అనిల్ కపూర్, బాబీ డియోల్‌ కీలక పాత్రలు పోషించారు. అలాగే తృప్తి దిమ్రి, బబ్లూ పృథ్విరాజ్, చారు శంకర్, శక్తి కపూర్, ప్రేమ్ చోప్రా, సురేఖ్ ఒబెరాయ్ తదితరులు ఇతర పాత్రల్లో కనిపించారు. తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళ భాషల్లో డిసెంబర్ 1న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇక విడుదలకు ముందే సినిమాపై భారీ అంచనాలు నెలకొనగా.. రిలీజైన నాటినుంచే బాక్సాఫీస్‌ వద్ద సంచలనాలు సృష్టిస్తోంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఈ క్రమంలో విడుదలైన అన్ని చోట్లా హౌల్​ఫుల్​ షోస్​తో ప్రదర్శితమౌతూ వసూళ్ల వర్షం కురిపిస్తోంది. వైల్డ్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌‌గా రూపొందిన ఈ మూవీకి తెలుగులోనూ మంచి రెస్పాన్స్ వస్తుంది. కాగా ఈ సినిమాలో రణ్‍బీర్ కపూర్ విశ్వరూపం చూపించాడని, కెరీర్ బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇచ్చాడని ఫ్యాన్స్ ప్రశంసిస్తున్నారు. ఈ నేపథ్యంలో ‘యానిమల్’ బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టిస్తోంది. అలాగే డైరెక్టర్ సందీప్ వంగ టేకింగ్‍కి అందరూ ఫిదా అవుతున్నారు. మరోవైపు ఈ సినిమాను చూసిన పలువురు సినీ ప్రముఖులు ప్రశంసిస్తూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు.

దీంతో యానిమల్ అన్‌స్టాపబుల్‌గా దూసుకెళ్తోంది. రీసెంట్‌గా ఈ సినిమా 700 కోట్ల క్ల‌బ్‌లోకి చేరింది. కేవ‌లం 10 రోజుల్లోనే ఈ చిత్రం రూ.700 కోట్ల మార్క్‌ను అందుకోవడం విశేషం. కాగా, 10వ‌ రోజైన ఆదివారం ఒక్క హిందీలోనే రూ. 87.56 కోట్ల వసూళ్లు సాధించినట్లు మేకర్స్ ప్రకటించారు. ఇక ఇప్పటివరకు ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా మొత్తం రూ.717.46 కోట్లకు పైగా వసూళ్లు సాధించి రూ. 800 కోట్ల దిశగా పరుగులు పెడుతోంది. కాగా ఈ చిత్రంలో మితి మీరిన హింస, శృంగార సన్నివేశాలు ఎక్కువగా ఉన్నాయని ఒకవైపు విమర్శలు ఎన్ని వస్తున్నా.. వసూళ్ళలో మాత్రం ‘యానిమల్’ అదరగొడుతుండటం గమనార్హం.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

20 − 18 =