ఆపరేషన్ వాలెంటైన్ కొత్త రిలీజ్ డేట్ ఫిక్స్

Operation Valentine Movie New Release Date

మెగా కాంపౌండ్ నుండి వచ్చి తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును తెచ్చుకున్నాడు వరుణ్ తేజ్. రీసెంట్ గానే గాండీవధారి అర్జున సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. అయితే ఆసినిమా అనుకున్నంత విజయాన్ని అయితే అందించలేకపోయింది. ఇక ఇప్పుడు మరో సినిమాను రిలీజ్ కు సిద్దం చేసేస్తున్నాడు. శక్తి ప్రతాప్ సింగ్ హడా దర్శకత్వంలో వరుణ్ తేజ్ హీరోగా వస్తున్న సినిమా ఆపరేషన్ వాలెంటైన్. వాస్తవ సంఘటనల స్ఫూర్తితో, భారత వైమానిక దళ ధైర్య సాహసాలని చూపే ఈ మోస్ట్ ఎవైటెడ్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా వస్తున్న ఈసినిమాలో లో వరుణ్ తేజ్ బ్రేవ్ ఎయిర్ ఫోర్స్ ఫైలట్ గా నటిస్తున్నాడు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ప్రస్తుతం అయితే ఈసినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులను జరుపుకుంటుంది. అయితే ఈసినిమా ఇప్పటికే రిలీజ్ అవ్వాల్సి ఉంది. కానీ రిలీజ్ డేట్ వాయిదా పడింది. రెండు రోజుల క్రితమే కొన్ని అనివార్య కారణాల వల్ల చెప్పిన తేదీకి ఆపరేషన్ వాలెంటైన్ సినిమాను విడుదల చేయలేకపోతున్నాము.. మరికొన్ని రోజుల్లోనే ఈ సినిమాకు సంబంధించిన కొత్త విడుదల తేదీని అధికారికంగా ప్రకటిస్తామని క్లారిటీ ఇచ్చారు. ఇక చెప్పినట్టే నేడు తాజాగా ఈ సినిమా కొత్త రిలీజ్ డేట్ ను ప్రకటించారు మేకర్స్. ఈసినిమాను వచ్చే ఏడాది ఫిబ్రవరి 16వ తేదీన రిలీజ్ చేస్తున్నట్టు అధికారికంగా ప్రకటించారు.

కాగా ఈసినిమాలో మాజీ మిస్ యూనివర్స్ మానుషి చిల్లార్ హీరోయిన్ గా నటిస్తుంది. ఈ సినిమాలో రాడార్ ఆఫీసర్ పాత్రలో నటిస్తోంది. శక్తి ప్రతాప్ సింగ్ హడా, అమీర్ ఖాన్, సిద్ధార్థ్ రాజ్ కుమార్ రాసిన ఈ చిత్రాన్ని సోనీ పిక్చర్స్ ఇంటర్నేషనల్ ప్రొడక్షన్స్, రినైసన్స్ పిక్చర్స్ సందీప్ ముద్ద భారీ స్థాయిలో నిర్మిస్తున్నారు.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

19 − 5 =