బుల్లి తెర స్టార్ యాంకర్ సుమ తనయుడు రోషన్ హీరోగా ఎంట్రీ ఇస్తున్న సంగతి తెలిసిందే కదా. క్షణం, కృష్ణ అండ్ హిజ్ లీల సినిమాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు రవికాంత్ పేరెపు దర్శకత్వంలో రోషన్ హీరోగా బబుల్ గమ్ సినిమా వస్తుంది. ఈసినిమా డిసెంబర్ 29వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. ప్రస్తుతం అయితే చిత్రయూనిట్ ప్రమోషన్ కార్యక్రమాలతో బిజీగా ఉంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక టీజర్ తోనే ఈసినిమాపై అంచనాలను ఒక్కసారిగా పెంచేశాడు రోషన్. మొదటి సినిమా అయినా కూడా చాలా ఈజ్ తో నటిస్తున్నట్టు ఇప్పటికే వచ్చిన అప్ డేట్ల నుండి అర్థమవుతుది. అంతేకాదు పాటలు కూడా మంచి రెస్పాన్స్ ను సొంతం చేసుకుంటున్నాయి. హబీబీ జిలేబీ సాంగ్, ఇజ్జత్ సాంగ్ అలానే రీసెంట్ జాను అంటూ వచ్చిన ఎమోషనల్ సాంగ్ డిఫరెంట్ గా ఉండి ఆకట్టుకున్నాయి. ఇప్పుడు తాజాగా ఈసినిమా ట్రైలర్ రిలీజ్ డేట్ ను ఫిక్స్ చేశారు మేకర్స్. డిసెంబర్ 15వ తేదీన 11గంటల 44 నిమిషాలకు ఈసినిమా ట్రైలర్ ను రిలీజ్ చేస్తున్నట్టు ప్రకటించారు.
Get ready to witness the fight for Love & Respect ❤️
Unveiling the #Bubblegum trailer on DEC 15th @ 11:44AM 💥
In cinemas from Dec 29th 🎥@ravikanthperepu @RoshanKanakala @Maanasa_chou @sureshraghu_DOP @SricharanPakala @maheshwarimovie… pic.twitter.com/yOXWw9cZjc
— People Media Factory (@peoplemediafcy) December 11, 2023
కాగా ఈసినిమాలో మానస చౌదరి హీరోయిన్ గా నటిస్తుంది. పీపుల్ మీడియా ఫ్యాక్టరీతో కలిసి మహేశ్వరి మూవీస్ నిర్మిస్తున్న ఈసినిమాకు శ్రీచరణ్ పాకాల సంగీతం.. సురేష్ రగుతు సినిమాటోగ్రఫి అందిస్తున్నాడు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: