‘లైగర్’ యాటిట్యూడ్ గ్లింప్స్ టీజర్ కు ముహూర్తం ఫిక్స్..!

Vijay Deverakonda’s LIGER Attitude Glimpse Teaser Out Now,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Tollywood Latest News, LIGER,LIGER Movie,LIGER Telugu Movie,LIGER Movie Teaser,LIGER latest Teaser,LIGER Telugu Teaser,Vijay Deverakonda LIGER Movie Teaser Glimpse Out Now, Liger Attitude Glimpse Teaser Out Now,Vijay Deverakonda Upcoming movies,Vijay Deverakonda upcoming Movies,Vijay Deverakonda Movie Updates,Vijay Deverakonda Kushi movie Shooting Updates, Liger Teaser Out Now,Glimpse Teaser out Now

ఇస్మార్ట్ శంకర్ సినిమాతో మళ్లీ తనలోని మాస్ యాంగిల్ ను చూపించి మంచి హిట్ కొట్టిన పూరీ జగన్నాథ్.. రౌడీ హీరో విజయ్ దేవరకొండతో లైగర్ తో వచ్చేస్తున్నాడు. బాక్సింగ్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈసినిమాపై మొదటి నుండీ మంచి అంచనాలు ఉన్నాయి. ఇక అర్జున్ రెడ్డి తరువాత విజయ్ కు సౌత్ తో పాటు నార్త్ లో కూడా మంచి క్రేజ్ రావడంతో పాన్ ఇండియా రేంజ్ లో ఈసినిమాను రిలీజ్ చేస్తున్నారు. ఫస్ట్ లుక్ పోస్టర్ తోనే అందరిలో మంచి హైప్ క్రియేట్ చేసిన లైగర్ ఆ తర్వాత ప్రతి అప్ డేట్ తో సినిమా మంచి బజ్ ను క్రియేట్ చేశారు. ఇటీవల అక్డి పక్డి సాంగ్ తో పాటు విజయ్ బోల్డ్ ఫోటో అలానే ట్రైలర్ ఇవన్నీ కూడా అంచనాలు అమాంతం పెంచేసాయి. ఇక ఇప్పుడు మరో అప్ డేట్ తో వచ్చేశారు మేకర్స్. ఈసినిమా నుండి విజయ్ యాటిట్యూడ్ గ్లింప్స్ ను రిలీజ్ చేస్తున్నట్టు తెలిపారు. జులై 29 ఉదయం 9 గంటలకు రిలీజ్ చేయబోతున్నట్లు ప్రకటించారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఈ సినిమాలో విజయ్ దేవరకొండకు జోడీగా అనన్య పాండే నటిస్తుండగా. బాక్సింగ్ లెజెండ్ మైక్ టైసన్ కీలక పాత్రలో నటించనున్నారు. రమ్యకృష్ణ తోపాటు బాలీవుడ్ హీరో సునీల్ శెట్టి కూడా ఓ కీలక పాత్రలో నటిస్తున్నాడు. ఈ సినిమాను పూరి కనెక్ట్స్ , ధర్మా ప్రొడక్షన్స్ బ్యానర్ పై తెలుగు, హిందీ, తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో తెరకెక్కిస్తున్నారు. ఆగష్ట్ 25వ తేదీన ఈసినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

nineteen − four =