ఆర్ఆర్ఆర్ సినిమాతో ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్నారు ఎన్టీఆర్, రామ్ చరణ్. ఇక ఈసినిమా అయిపోయింది కాబట్టి తమ నెక్స్ట్ ప్రాజెక్ట్స్ పై దృష్టి పెడుతున్నారు. ఇప్పటికే రామ్ చరణ్ శంకర్ తో చేస్తున్న మూవీ షూటింగ్ లో పాల్గొంటున్నాడు. ఇక ఎన్టీఆర్ కొరటాల శివతో తన తరువాత ప్రాజెక్ట్ ను చేస్తున్నాడు. ప్రస్తుతం ఎన్టీఆర్ అభిమానులు ఎదురుచూస్తుంది ఎన్టీఆర్ 30వ సినిమా కోసం. ఈసినిమా ఎప్పుడు మొదలవుతుందా అని ఫ్యాన్స్ ఆసక్తికరంగా ఎదురుచూస్తున్నారు. ఇక ఈసినిమా ఇప్పటికే మొదలవ్వాలి కానీ అనుకోకుండా ఆలస్యమవుతూ వస్తుంది. అయితే సెప్టెంబర్ నుండి ఈసినిమా సెట్స్ పైకి వెళ్లే ప్రయత్నాలు జరుగుతున్నట్టు పలు వార్తలు వచ్చాయి.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
తాజాగా ఈసినిమా ఆలస్యానికి కారణం ఏంటో తెలియచేశారు కళ్యాణ్ రామ్. తను నటిస్తున్న బింబిసార సినిమా త్వరలో ప్రేక్షకుల ముందుకు వస్తున్న సంగతి తెలిసిందే. ఈనేపథ్యంలో ప్రమోషన్ కార్యక్రమాలతో బిజీగా ఉన్నారు చిత్రబృందం. ఈ సందర్బంగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న కళ్యాణ్ రామ్ ఎన్టీఆర్ 30వ సినిమా గురించి మాట్లాడుతూ.. ప్రస్తుతం తారక్ ఇమేజ్ ప్రపంచవ్యాప్తంగా పెరిగిపోయింది.. దీంతో చిత్రయూనిట్ ప్రతి చిన్న విషయంలో కూడా చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు..ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ఆడియన్స్ ను దృష్టిలో పెట్టుకొని తెరకెక్కించాలని చూస్తున్నారు. ఏదో సినిమా తీసేశాం రిలీజ్ చేసేశాం అన్నట్టు ఉండకుండా ఎక్కువ మంది ప్రేక్షకుల సెన్సిబిలిటీకి తగ్గట్టు లాంగ్ రన్ లో ఉండేలా ప్లాన్ చేస్తున్నారు అంటూ తెలిపాడు. మరి మొత్తానికి కొరటాల గ్లోబల్ ఆడియన్స్ ను దృష్టిలో పెట్టుకొని భారీగానే ప్లాన్ చేస్తున్నట్టు అర్థమవుతుంది.
కాగా యువసుధ ఆర్ట్స్ , ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్స్ పై ఈసినిమాను నిర్మిస్తున్నారు. ఈసినిమాలో నటించే హీరోయిన్ అలానే ఇతర నటీనటులకు సంబంధించిన వివరాలు త్వరలోనే తెలియచేయనున్నారు. ఈసినిమాకు అనిరుధ్ సంగీతం అందిస్తున్నాడు. శ్రీకర ప్రసాద్ ఎడిటర్ గా సబు సిరిల్ సినిమాటోగ్రాఫర్ గా వ్యవహరించనున్నట్టు తెలిపారు.



మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:



























