గురువుగారితో నా కథ డిస్కషన్..!

Director Buchi Babu Gives Clarity About Working With Sukumar,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Tollywood Latest News, Director Buchi Babu,Buchi Babu,Director Buchi Babu About Sukumar,Director Buchi Babu Working with Sukumar,Director Buchi Babu About Sukumar,Director Buchi Babu Upcoming Movies, Director Buchi Babu New Movie Updates,Director Buchi Babu and Sukumar,Director Buchi Babu Working With Guru Sukumar,Director Buchi Babu Latest Movie Updates

సుకుమార్ దగ్గర శిష్యరికం చేసి మొదటి సినిమా ఉప్పెన తోనే బ్లాక్ బస్టర్ హిట్ కొట్టాడు బుచ్చిబాబు. ఇక ఈసినిమా తరువాత ఈసినిమాలో హీరో హీరోయిన్స్ గా చేసిన కృతి శెట్టి, వైష్ణవ్ తేజ్ ఇప్పటికే పలు సినిమాలతో బిజీగా ఉన్నారు. బుచ్చిబాబు మాత్రం ఇప్పటివరకూ మరో సినిమాను లైన్ లో పెట్టలేదు. ఉప్పెన తర్వాత బుచ్చి బాబు, యంగ్ టైగర్ ఎన్టీఆర్ తో తన త‌ర్వాత సినిమా ఉంటుందని, దర్శకుడు చెప్పిన కథ తారక్ కు బాగా నచ్చడంతో గ్రీన్ సిగ్నల్ కూడా ఇచ్చాడని కూడా అన్నారు. కానీ అది కూడా కుదరలేదు. ఆతరువాత బుచ్చి బాబు తన మొదటి హీరో వైష్ణవ్ తో కలిసి మరో సినిమా చేయాలని ప్లాన్ చేస్తున్నాడు అన్నారు. అది వార్తల వరకే పరిమితమైంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక త్వరలోనే బుచ్చిబాబు తన నెక్స్ట్ సినిమాను ప్రారంభించనున్నట్టు తెలుస్తుంది. ఈనేపథ్యంలోనే తాజాగా తన తరువాత సినిమాపై అప్ డేట్ ఇచ్చాడు బుచ్చిబాబు. సుకుమార్ తన ఫొటో పోస్ట్ చేస్తూ..ఈ ఫొటో నేను తరువాత చేయబోయే నాసినిమాకథ డిస్కషన్ సందర్భంలోది మాగురువుగారు..
సుకుమార్ సార్ నా కోసం నా సినిమా కథ కోసం హెల్ప్ చేయడానికి వచ్చారు. సుకుమార్ సార్ సినిమా కథలో కూర్చుని డిస్కషన్ చేసేంత స్థాయి నాకు లేదు రాదు.ఆయన నుంచి నేర్చుకోవడం తీసుకోవడమే తప్ప, ఆయనకి ఇచ్చేంత లేదు అంటూ ట్వీట్ చేశాడు. మరి త్వరలోనే బుచ్చిబాబు తన సినిమాకు సంబంధించిన అప్ డేట్ ఇస్తాడేమో చూడాలి.

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.