‘విక్రాంత్ రోణ’ తెలుగు మూవీ రివ్యూ

అనూప్ భండారి దర్శకత్వంలో కన్నడ స్టార్ హీరో సుదీప్ హీరోగా వస్తున్న సినిమా విక్రాంత్ రోణ. ఈసినిమాను భారీ బడ్జెట్ తో నిర్మించారు మేకర్స్. ఇక మొదటి నుండి ఈసినిమాపై భారీ అంచనాలే ఉండగా దానికి తోడు ఈసినిమా నుండి రిలీజ్ అయిన టీజర్, ట్రైలర్ తో పాటు అన్ని అప్ డేట్లు సినిమాపై భారీ అంచనాలను పెంచేశాయి. ఇక భారీ అంచనాల మధ్య ఈసినిమా నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈసినిమా ఎలాంటి టాక్ ను సొంతం చేసుకుందో తెలియాలంటే రివ్యూలోకి వెళ్లాల్సిందే

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

నటీనటులు.. సుదీప్, నిరూప్ భండారి, నీతా అశోక్, జాక్వెలెన్ ఫెర్నాండేజ్
దర్శకత్వం.. అనూప్ భండారి
బ్యానర్స్.. షాలిని ఆర్ట్స్
నిర్మాతలు..జాన్‌ మంజునాథ్‌‌, శాలిని మంజునాథ్
సినిమాటోగ్రఫి.. విలియమ్ డేవిడ్
సంగీతం.. అజనీశ్ లోక్ నాథ్

కథ..

కొమరట్టు అనే గ్రామం.. ఆ గ్రామంలో పిల్లలు అందరూ హత్యలకు గరవుతుంటారు. అయితే అప్పటికే గ్రామంలో భూతాలు ఉన్నాయని.. అవే పిల్లలను చంపేస్తున్నాయని రూమర్లు ఉంటాయి. ఈకేసు ఇన్వెస్టిగేషన్ లోనే ఆ ఊరి ఇన్ స్పెక్టర్ చనిపోతాడు. ఇక ఆ ఇన్ స్పెక్టర్ ప్లేస్ లో కొత్త ఇన్ స్పెక్టర్ గా వస్తాడు విక్రాంత్ రోణా (కిచ్చా సుదీప్ ) . అసలు ఆ కొమరట్టు గ్రామంలో భూతాలు ఉన్నాయని ఎవరు పుకారు పుట్టించారు ?, విక్రాంత్ రోణా ఈ గ్రామానికే ఎందుకు వచ్చాడు ?, పిల్లలను చంపుతున్న వ్యక్తిని విక్రాంత్ రోణా ఎలా పట్టుకున్నాడు? అనేది మిగిలిన కథ.

విశ్లేషణ

కన్నడ హీరో అయినా కూడా సుదీప్ తెలుగు ప్రేక్షకులకు పెద్దగా పరిచయం అవసరం లేదు. ఈగ సినిమాలో తన నటనతో మరింత ఇమేజ్ ను సొంతం చేసుకున్నాడు. ఆ తరువాత బహుబలి, సైరా నరసింహారెడ్డి సినిమాలో కూడా కీలక పాత్రల్లో నటించాడు. ఇక ఇప్పుడు విక్రాంత్ రోణ అంటూ వచ్చేశాడు. ఇక కథ ప్రకారం అయితే ఇలాంటి కథలు ఇప్పటికీ చాలానే వచ్చాయి. అందులోనూ అనూప్ భండారి 2015 లో డైరక్ట్ చేసిన రంగి తరంగ పెద్ద హిట్. అప్పట్లో అదొక సెన్సేషన్. ఎన్నో అవార్డ్ లు వచ్చాయి. దీంతో ఈసినిమాకు మొదటి నుండీ మంచి బజ్ ఏర్పడింది. ఇక ఆ తర్వాత అలాంటి నేపథ్యంలో ఉన్న కథలను తీయలేదు. చాలా గ్యాప్ తరువాత ఈసినిమానుసిద్దం చేశాడు. ఈసినిమాతో కూడా మరోసారి సక్సెస్ అయ్యాడు. అనూప్ భండారి చెప్పాలనుకున్న థీమ్ తో పాటు సినిమాను గ్రాండ్ విజువల్ గా తెరకెక్కించాడు. యాక్షన్ సీక్వెన్స్, థ్రిల్లింగ్ ఎలిమెంట్స్, ఇంటర్వెల్ బ్యాంగ్ ఇంకా క్లైమాక్స్ ఇలా అన్ని పర్ ఫెక్ట్ గా సెట్ చేశాడు. అందరికీ తెలిసిన పాయింట్ నే కొత్తగా చెప్పే ప్రయత్నం చేశాడు.

ఇక సుదీప్ నటన గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఎప్పటిలాగే ఈసినిమాలో కూడా తన నటనతో ఆకట్టుకున్నాడు. తన పాత్రకు తగ్గట్లు లుక్స్ అండ్ నటన పరంగా ఆకట్టుకున్నాడు. ముఖ్యంగా క్లైమాక్స్ లో వచ్చే ఎమోషనల్ సీన్లలో సుదీప్ నటన సినిమాకే ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి. ఇక జాక్వెలీన్ స్క్రీన్ స్పెస్ తక్కువగానే ఉన్నా తన నటనతో ఆకట్టుకుంటుంది. విలన్ గా నటించిన నటుడు… అదేవిధంగా మిగిలిన నటీనటులు కూడా తమ పాత్రల పరిధి మేరకు బాగా నటించారు. ప్రతి ఒక్కరు తమ పాత్రలో ఒదిగిపోయారు.

ఇక సాంకేతిక విభాగానికి వస్తే సినిమాలో కెమెరా పనితనం, వీఎఫెక్స్ వర్క్‌కు వంక పెట్టలేము. అటవీ ప్రాంతం, నైట్ ఎఫెక్ట్స్, సెట్స్ అన్నీ కూడా ఎంతో రిచ్‌గా ఉన్నాయి. ఇక బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కూడా బాగా ఇచ్చారు. బయపెట్టే సన్నివేశాల్లో వచ్చే బ్యాక్ గ్రౌండ్ స్కోర్ సినిమాకు హైలెట్ గా నిలుస్తుంది. భారీ బడ్జెట్ కాబట్టి అదే రేంజ్ లో సాంకేతిక విలువలు రిచ్ గా ఉన్నాయి.

ఓవరాల్ గా చెప్పాలంటే హారర్ జోనర్ సినిమాలు నచ్చేవాళ్లకు ఈసినిమా బాగా నచ్చుతుంది. అలాగే విజువల్స్ పరంగా కూడా ఈసినిమా బాగుంది కాబట్టి విజువల్స్ కోసం చూసేవాళ్లు చూడొచ్చు.

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.