హను రాఘవపూడి దర్శకత్వంలో వస్తున్న పీరియాడిక్ లవ్‌స్టోరీ సీతారామం. 1965 కాలానికి ప్రజెంట్ టైమ్‌ను కలుపుతూ డిఫరెంట్ స్క్రీన్‌ప్లేతో ఈసినిమాను తెరకెక్కిస్తున్నాడు. మలయాళ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ హీరోగా ఈసినిమా వస్తుంది. మహానటి, కనులు కనులను దోచాయంటే సినిమాలతో తెలుగులో ఫ్యాన్ ఫాలోయింగ్‌ను ఏర్పరచుకున్నాడు దుల్కర్ సల్మాన్. ఇక ఈసినిమా ఆగష్ట్ 5వ తేదీన గ్రాండ్ గా రిలీజ్ కానున్న నేపథ్యంలో ప్రమోష్ కార్యక్రమాల్లో స్పీడు పెంచారు. ఇప్పటికే ఈసినిమా నుండి టీజర్, ట్రైలర్, పాటలు రిలీజ్ చేయగా వాటికి ఎలాంటి రెస్పాన్స్ వచ్చిందో చూశాం. ఇక తాజాగా ఈసినిమా సెన్సార్ కార్యక్రమాలు కూడా పూర్తి చేసుకుంది. ఈసినిమాకు క్లీన్ యూ సర్టిఫెకెట్ ను అందించారు సెన్సార్ బృందం.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
Wishing our RAM, @dulQuer a very Happy Birthday ❤️
𝑨𝒏𝒅 𝒊𝒕’𝒔 𝒂 𝒄𝒍𝒆𝒂𝒏 𝑼 𝒄𝒆𝒓𝒕𝒊𝒇𝒊𝒄𝒂𝒕𝒆 𝒇𝒓𝒐𝒎 𝒄𝒆𝒏𝒔𝒐𝒓.#SitaRamam @mrunal0801 @iamRashmika @iSumanth @hanurpudi @Composer_Vishal @VyjayanthiFilms @SwapnaCinema @SonyMusicSouth #SitaRamamOnAug5 pic.twitter.com/e8pZSIcwZZ
— Vyjayanthi Movies (@VyjayanthiFilms) July 28, 2022
ఇక ఈసినిమాలో మృణాల్ ఠాకూర్ హీరోయిన్ గా నటిస్తుంది. ఇంకా సుమంత్ బ్రిగేడియర్ విష్ణు శర్మ పాత్రలో నటిస్తుండగా.. సుమంత్ భార్యగా భూమికా చావ్లా నటిస్తోంది. రష్మిక మందన్నా సెకండ్ ఫీమేల్ లీడ్ రోల్ ల నటిస్తుంది. రష్మిక కశ్మీరీ యువతి అఫ్రీన్ పాత్రలో నటిస్తుండగా..పెళ్లి చూపులు ఫేం డైరెక్టర్ తరుణ్ భాస్కర్ బాలాజీ పాత్రలో, ప్రకాశ్‌రాజ్ ఈ చిత్రంలో మరో కీ రోల్ పోషిస్తున్నాడు. కాగా వైజయంతి మూవీస్ సమర్పణలో స్వప్న సినిమాస్ పతాకంపై అశ్విని దత్, ప్రియాంక్ దత్ నిర్మిస్తున్నారు. విశాల్ చంద్రశేఖర్ సంగీతం అందిస్తున్న ఈసినిమాకు పీఎస్ వినోద్ సినిమాట్రోగాఫర్ గా పనిచేస్తున్నారు. తెలుగు, తమిళం, మలయాళం భాషల్లో ఆగష్ట్ 5న థియేటర్లలో గ్రాండ్‌గా రిలీజ్ అవుతుంది.




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:




























