తెలుగు , తమిళ , హిందీ భాషల పలు బ్లాక్ బస్టర్ మూవీస్ లో రకుల్ ప్రీత్ సింగ్ తన అందం , అభినయం తో ప్రేక్షకులను అలరిస్తూ స్టార్ హీరోయిన్ గా రాణిస్తున్నారు. స్టార్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ కథానాయికగా తెరకెక్కిన “డాక్టర్ జీ”, “థ్యాంక్ గాడ్” , “మిషన్ సిండ్రెల్లా “, “చ్ఛాత్రివాలి ” ( హిందీ) శివ కార్తికేయన్ “అయలాన్ “ (తమిళ) మూవీస్ విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. ఒక కామెడీ వెబ్ సిరీస్ తో పాటు తెలుగు , తమిళ భాషలలో తెరకెక్కుతున్న “31 అక్టోబర్ లేడీస్ నైట్ ” మూవీ లో రకుల్ నటిస్తున్నారు. అజిత్ హీరోగా తెరకెక్కనున్న “#AK 61 ” తమిళ మూవీలో రకుల్ కథానాయికగా ఎంపిక అయ్యారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
తాజాగా రకుల్ ఒక ఇంటర్వ్యూ లో మాట్లాడుతూ .. సౌత్ ఇండస్ట్రీలో ఎన్నో వైవిధ్యభరితమైన సినిమాల్లో నటించాననీ , కానీ ఒక బయోపిక్ చేయాలని ఉందనీ , గొప్పగా చెప్పుకునేవారి జీవిత కథలో నటించాలని ఉందనీ , అలాగే అవుట్ అండ్ అవుట్ లవ్ స్టోరీస్ చేసేందుకు ఇష్టపడతాననీ , ” దిల్ వాలే దుల్హానియా లేజాయింగే” వంటి అందమైన ప్రేమకథలో నటించాలనుకుంటున్నాననీ , ఎక్కువగా లవ్ స్టోరీస్, బయోపిక్స్ చేసేందుకు మాత్రమే ఇష్టపడతాననీ , అలాంటి అవకాశం వస్తే తప్పకుండా నటిస్తాననీ చెప్పారు.




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: