
ట్యాగ్ · 4407 కథనాలు · పేజీ 7


ఫ్యాన్స్ కు సూర్య మెసేజ్

హరిహర వీరమల్లు లో బాలీవుడ్ స్టార్ హీరో
ధమాకా ఫస్ట్ డే సాలిడ్ కలెక్షన్స్

ధనుష్ సార్ బ్యాక్ టు బ్యాక్ అప్ డేట్స్

85 శాతం షూటింగ్ పూర్తి చేసుకున్న సలార్

ధమాకా మూవీ టీమ్ సక్సెస్ సెలబ్రేషన్స్

వీరసింహారెడ్డి మూవీ సెట్స్ లో వీరమల్లు

సోషల్ మీడియా లో ట్రెండింగ్ లో శృతి హాసన్

హన్సిక గాంధారి ఫస్ట్ లుక్ రిలీజ్

యంగ్ హీరోయిన్ శ్రీలీల క్రేజ్

జనవరి లో #SSMB 28 మూవీ భారీ షెడ్యూల్

త్వరలో కాంతార మూవీ సీక్వెల్ ఆర్ ప్రీక్వెల్ - హోంబలే ఫిల్మ్స్ అధినేత
హోంబలే ఫిల్మ్స్ బ్యానర్‌పై స్వీయ దర్శకత్వంలో కన్నడ హీరో రిషబ్ శెట్టి ప్రధాన పాత్రలో నటించిన కాంతార కన్నడ మూవీ సెప్టెంబర్ 30వ తేదీన రిలీజ్ అయ్యి ఘనవిజయం సాధించిన విషయం తెలిసిందే. ఈ చిత్రంలో కిషోర్, అచ్యుత్ కుమార్, సప్తమి గౌడ, ప్రమోద్ శెట్టి కీలక పాత్రలలో నటించారు. బి .అజనీష్ లోకనాథ్ సంగీతం అందించారు. కాంతార మూవీ అన్ని భాషలలోనూ అద్భుత రెస్పాన్స్ సాధించిన విషయం తెలిసిందే. కాంతార మూవీ ప్రపంచవ్యాప్తంగా 400 కోట్లు పైగా కలెక్ట్ చేసి రికార్డ్ క్రియేట్ చేసింది. ఈ మూవీపై ప్రేక్షకులతో పాటు సినీ ప్రముఖులు ప్రశంసలు కురిపిస్తున్న విషయం తెలిసిందే.కాంతార మూవీ కి ఓటీటీ లో కూడా అద్భుత స్పందన లభిస్తుంది.

500 సినిమాలకు డబ్బింగ్ ఆర్టిస్ట్ గా సింగర్ సునీత రికార్డ్
సింగర్ , టి వి ప్రెజెంటర్ , వాయిస్ ఆర్టిస్ట్ సునీత ప్లే బ్యాక్ సింగర్ గా గులాబి మూవీ తో టాలీవుడ్ కు పరిచయం అయ్యారు. పలు సూపర్ హిట్ సాంగ్స్ తో ప్రేక్షకులను అలరిస్తూ సక్సెస్ ఫుల్ సింగర్ గా కొనసాగుతున్నారు. తెలుగు, తమిళ , కన్నడ భాషలలో సుమారు 3000 సాంగ్స్ తో సునీత తన గాన మాధుర్యం తో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు.టాలెంటెడ్ సింగర్ సునీత ప్లే బ్యాక్ సింగర్ , డబ్బింగ్ ఆర్టిస్ట్ గా 9నంది , బెస్ట్ ప్లే బ్యాక్ సింగర్ గా 2 ఫిల్మ్ ఫేర్ అవార్డ్స్ అందుకున్నారు. పలు మ్యూజిక్ బేస్డ్ టివి ప్రోగ్రామ్స్ కు సునీత యాంకర్ , హోస్ట్ గా పనిచేశారు. సోషల్ మీడియా లో యాక్టివ్ గా ఉంటూ పలు ఫొటోస్ షేర్ చేస్తూ అభిమానులను…

ఫ్యాన్స్ కు సూర్య మెసేజ్
తమిళ్ స్టార్ హీరో సూర్య ప్రస్తుతం వరుస హిట్లతో ఫుల్ ఫామ్ లో ఉన్నాడు సూర్య. పలు బ్లాక్ బస్టర్ మూవీస్ లో అద్భుతంగా పెర్ఫార్మ్ చేస్తూ, తమిళ తెలుగు ప్రేక్షకులను అలరిస్తున్నాడు. ప్రస్తుతం అయితే సూర్య పలు సినిమాలతో బిజీగా ఉన్నారు. అందులో తమిళ్ స్టార్ డైరెక్టర్ శివ దర్శకత్వంలో వస్తున్న సినిమా కూడా ఒకటి. సూర్య42 అనే వర్కింగ్ టైటిల్ తోనే ఈసినిమా ప్రస్తుతం రూపొందుతుంది. హిస్టారికల్ వార్ బ్యాక్‌డ్రాప్‌లో.. ఈ సినిమా 1000 సంవత్సరాల క్రితం జరిగిన కథ ఆధారంగా తెరకెక్కుతున్నట్టు తెలుస్తుంది. ఇప్పటికే ఈసినిమా కొంత వరకూ షూటింగ్ ను పూర్తి చేసుకుంది. ఇక దీనితో పాటు పలు సినిమాలు కూడా సూర్య లిస్ట్ లో ఉన్నాయి.

హరిహర వీరమల్లు లో బాలీవుడ్ స్టార్ హీరో
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా క్రిష్ దర్శకత్వంలో వస్తున్న సినిమా హరిహర వీరమల్లు. ఈసినిమా కోసం పవన్ అభిమానులు ఎంత ఆసక్తిగా ఎదురుచూస్తున్నారో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. వేయికళ్లతో ఎదురుచూస్తున్నారు. పీరియాడిక్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ బందిపోటుగా నటిస్తున్నాడని తెలుస్తోంది. ఇప్పటికే ఈ సినిమానుంచి విడుదలైన పోస్టర్లు, గ్లిమ్ప్స్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాయి. ప్రస్తుతం అయితే ఈసినిమా షూటింగ్ ను పూర్తిచేసే పనిలో ఉన్నారు మేకర్స్. గత నెల నుంచి రామోజీ ఫిల్మ్ సిటీలోని హైదరాబాద్ లోనే వేసిన ఓ భారీ సెట్ లో రెగ్యూలర్ షూటింగ్ ను కొనసాగిస్తున్నారు. ఇప్పటికే సెట్స్ నుంచి…

జపాన్ ఫేమస్ అండ్ లార్జెస్ట్ మూవీ సైట్ లో టాప్ 3 చిత్రాల్లో ఒకటిగా ఆర్ ఆర్ ఆర్
డివివి ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై స్టార్ డైరెక్టర్ రాజమౌళి దర్శకత్వంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ , యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోలు గా భారీ బడ్జెట్ , భారీ తారాగణం తో తెరకెక్కిన పీరియాడికల్ యాక్షన్ డ్రామా రౌద్రం రణం రుధిరం మూవీ మార్చి 25 వ తేదీ ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అయ్యి సూపర్ హిట్ టాక్ సొంతం చేసుకుని ప్రపంచవ్యాప్తంగా 1140కోట్లకు పైగా కలెక్షన్స్ సాధించింది. మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు పాత్రలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, గోండు వీరుడు కొమురం భీమ్ గా ఎన్టీఆర్ తమ పవర్ ఫుల్ యాక్టింగ్ టాలెంట్ తో ప్రేక్షకులను అలరించారు.ఆర్ ఆర్ ఆర్ మూవీ పై హాలీవుడ్ ప్రముఖులు ప్రశంసలు కురిపించిన విషయం తెలిసిందే.
ధమాకా ఫస్ట్ డే సాలిడ్ కలెక్షన్స్
మొత్తానికి ఈ ఏడాది చివరిలో హిట్ ను అందుకున్నాడు మాస్ మహారాజా రవితేజ. ఈ ఏడాది ఇప్పటికే ఖిలాడి, రామారావు ఆన్ డ్యూటీ అనే సినిమాలను రిలీజ్ చేయగా.. రెండు సినిమాలు కూడా బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టాయి. ఇక నిన్న ధమాకా సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. నక్కిన త్రినాథరావు దర్శకత్వంలో రవితేజ హీరోగా వచ్చిన మాస్ యాక్షన్ ఎంటర్ టైనర్ ధమాకా నిన్న రిలీజ్ అయింది. ఇక ఈసినిమాలో ప్రేక్షకులకు కావాల్సిన అంశాలు ఉండటంతో సినిమా సూపర్ హిట్ టాక్ ను సొంతం చేసుకుంది. రవితేజ కామెడీ, ఎనర్జిటిక్ పెర్ఫార్మెన్స్, యాక్షన్ సీక్వెన్స్, పాటలు ఇంకా హీరో-హీరోయిన్స్ మధ్య కెమిస్ట్రీ అన్నీ సినిమాలో హెలైట్ గా నిలిచాయి.

ధనుష్ సార్ బ్యాక్ టు బ్యాక్ అప్ డేట్స్
తమిళ్ హీరోలు ఇప్పుడు తెలుగులో కూడా సినిమాలు చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఇప్పటివరకూ తెలుగులో డబ్బింగ్ వర్షన్ ను రిలీజ్ చేసిన హీరోలు ఇప్పుడు డైరెక్ట్ గా సినిమాలు చేస్తున్నారు. ఇక వారిలో ధనుష్ ముందున్నాడు. ఇప్పటివరకూ తన సినిమాలను తెలుగులో డబ్ చేసి రిలీజ్ చేస్తూ వచ్చారు. ఇక ఇప్పుడు డైరెక్ట్ గా తెలుగులోనే సినిమా చేస్తూ తెలుగు ప్రేక్షకులను అలరించడానికి వచ్చేస్తున్నాడు. వెంకీ అట్లూరీ దర్శకత్వంలో ధనుష్ హీరోగా వస్తున్న సినిమా సార్. ఈసినిమా ఇప్పుడు షూటింగ్ ను పూర్తిచేసుకునే పనిలో ఉంది. ధనుష్ తెలుగులో నటిస్తోన్న తొలి సినిమా కావడంతో ఈసినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. ఇక ఈసినిమా ప్రమోషన్…

మాస్ మహారాజా రవితేజ ఫస్ట్ పాన్ ఇండియా మూవీ టైగర్ నాగేశ్వర రావు
తేజ్ నారాయణ్ అగర్వాల్ సమర్పణలో అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ బ్యానర్ పై వంశీ దర్శకత్వం లో మాస్ మహారాజా రవితేజ హీరోగా స్టువర్ట్ పురం గజదొంగ నాగేశ్వరరావు జీవిత చరిత్ర ఆధారంగా పాన్ ఇండియా మూవీ టైగర్ నాగేశ్వరరావు తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఈ మూవీలో నుపుర్ సనన్ కథానాయిక కాగా గాయత్రి భరద్వాజ్, రేణు దేశాయ్, అనుపమ్ ఖేర్ ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు. ఈ మూవీ తో 18 సంవత్సరాల తరువాత రేణు దేశాయ్ టాలీవుడ్ కు రీఎంట్రీ ఇస్తున్నారు. జి వి ప్రకాష్ కుమార్ సంగీతం అందిస్తున్నారు. ఈ మూవీ నుండి ఫస్ట్ పోస్టర్, రేణు దేశాయ్ లుక్ ను మేకర్స్ రిలీజ్ చేయగా ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి.

85 శాతం షూటింగ్ పూర్తి చేసుకున్న సలార్
హోంబలే ఫిల్మ్స్ బ్యానర్ పై బ్లాక్ బస్టర్ కె జి ఎఫ్ చాప్టర్ 1, చాప్టర్ 2 మూవీస్ ఫేమ్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ , శృతి హాసన్ జంటగా భారీ బడ్జెట్ తో తెలుగు , కన్నడ భాషలలో తెరకెక్కుతున్న హై వోల్టేజ్ యాక్షన్ ఎంటర్ టైనర్ సలార్ మూవీ 2023 సెప్టెంబర్ 28 వ తేదీ రిలీజ్ కానుంది. రవి బస్రూర్ సంగీతం అందిస్తున్నారు.సలార్ మూవీ డార్క్ సెంట్రిక్ థీమ్ టెక్నాలజీ తో తెరకెక్కుతుంది. భారత చలన చిత్ర పరిశ్రమలో డార్క్ సెంట్రిక్ థీమ్ టెక్నాలజీ తో తెరకెక్కుతున్న మొదటి చిత్రంగా సలార్ మూవీ రికార్డ్ క్రియేట్ చేసింది .ఫస్ట్ టైమ్ ప్రభాస్ , శృతి హాసన్ జంటగా నటిస్తున్న సలార్ మూవీలో మలయాళ స్టార్ హీరో…

ధమాకా మూవీ టీమ్ సక్సెస్ సెలబ్రేషన్స్
పీపుల్ మీడియా ఫ్యాక్టరీ , అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ బ్యానర్స్ పై మాస్ డైరెక్టర్ నక్కిన త్రినాథరావు దర్శకత్వంలో రవితేజ , పెళ్ళిసందD మూవీ ఫేమ్ శ్రీ లీల జంటగా తెరకెక్కిన మాస్ ఎంటర్ టైనర్ మూవీ ధమాకా డిసెంబర్ 23వ తేదీ రిలీజ్ అయ్యి ఘన విజయం సాధించింది. కానుంది. భీమ్స్ సంగీతం అందించారు. సినిమామొదటి నుండి చివరి వరకు హీరో రవితేజ తన ఎనర్జిటిక్ పెర్ఫార్మెన్స్ తో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. శ్రీలీల తన అద్భుతమైన స్క్రీన్ ప్రెజెన్స్ తో హీరో రవితేజ తో మాస్ డ్యాన్స్ తో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు.ఈ సినిమాలో పంచ్ డైలాగులు, కామెడీ సన్నివేశాలు, ఎమోషనల్ సీన్స్, ఫైట్స్ చాలా ప్లస్ అయ్యాయి.

మహేష్ తో సినిమా-మసూద హీరోయిన్ ఇంట్రెస్టింగ్ రిప్లై
సూపర్ స్టార్ మహేష్ బాబుతో సినిమా చేయాలని ఏ హీరోయిన్ కు మాత్రం ఉండదు. కానీ అది అంత ఈజీ కాదన్న విషయం కూడా చాలా మందికి తెలుసు. స్టార్ హీరోయిన్లకు అంటే ఆ అవకాశం ఈజీగా వస్తుంది కానీ.. మిగిలిన హీరోయిన్లకు మాత్రం చాలా కష్టం. ఇక ఇప్పుడిప్పుడే వస్తున్న వాళ్ల పరిస్థితి ఎలా ఉంటుందో చెప్పనక్కర్లేదు. ఈనేపథ్యంలోనే మహేష్ సినిమా అంటే మసూద హీరోయిన్ ఇంట్రెస్టింగ్ రిప్లై ఇచ్చింది. తాజాగా సోషల్ మీడియా ద్వారా ఫ్యాన్స్ తో ముచ్చటించింది బాంధవి. దీనిలో భాగంగానే ఓ మహేష్ అభిమాని మహేష్ బాబు-బాంధవి కాంబినేషన్ లో మూవీ వస్తే ఫ్యాన్స్ కు పండగే అని పోస్ట్ చేయగా దానికి బాంధవి స్పందిస్తూ.. అత్యాశ అనుకోండి.. అంటే అన్నారు కానీ…

వీరసింహారెడ్డి మూవీ సెట్స్ లో వీరమల్లు
మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై గోపీచంద్ మలినేని దర్శకత్వంలో బాలకృష్ణ హీరోగా వాస్తవ సంఘటనలతో రాయలసీమ ఫ్యాక్షనిజం బ్యాక్ డ్రాప్ గా యాక్షన్ ఎంటర్ టైనర్ వీర సింహారెడ్డి మూవీ సంక్రాంతి కానుకగా జనవరి 12 వ తేదీ రిలీజ్ కానుంది. శృతి హాసన్ కథానాయిక. వరలక్ష్మి శరత్ కుమార్, దునియా విజయ్ ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు. చంద్రిక రవి ఒక స్పెషల్ సాంగ్ లో నటిస్తున్నారు. థమన్ ఎస్ సంగీతం అందిస్తున్నారు. చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన హీరో బాలకృష్ణ ఫస్ట్ లుక్ పోస్టర్, ఫస్ట్ హంట్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన సాంగ్స్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి.

18 పేజెస్ మూవీ రివ్యూ- క్రేజీ లవ్ స్టోరీ
ఓవరాల్ గా చెప్పాలంటే 18 పేజెస్ సినిమా ఓ విభిన్నమైన లవ్ స్టోరీ అని చెప్పొచ్చు. భావోద్వేగ భరితంగా సాగే ఫీల్ గుడ్ డిఫరెంట్, క్రేజీ లవ్ స్టోరీగా నిలుస్తుంది 18 పేజెస్.

వరుసగా మూడు సార్లు ఉత్తమ నటి అవార్డ్స్ అందుకున్న తాప్సీ
ఝుమ్మంది నాదం మూవీ తో టాలీవుడ్ కు పరిచయం అయిన తాప్సీ, ఆడుకాలం మూవీ తో కోలీవుడ్ , డబుల్స్ మూవీ తో మల్లూవుడ్ , చష్మే బద్దూర్ మూవీ తో బాలీవుడ్ కు పరిచయం అయ్యారు. తెలుగు, తమిళ, హిందీ భాషల పలు బ్లాక్ బస్టర్ మూవీస్ లో తన అందం , అభినయం తో ప్రేక్షకులను అలరిస్తున్న తాప్సీ పలు సూపర్ హిట్ ఉమెన్ సెంట్రిక్ మూవీస్ లో అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నారు. ప్రస్తుతం తమిళ భాషలో జనగణమన, ఏలియన్ సినిమాల్లో నటిస్తోన్న తాప్సీ... హిందీలో వో లడ్‌కీ హై కహాన్ తోపాటు రాజ్‌కుమార్ హిరానీ డైరెక్షన్‌లో షారుఖ్ ఖాన్ హీరోగా నటిస్తోన్న డుంకీ సినిమాల్లో నటిస్తున్నారు. అవుట్ సైడర్ ఫిల్మ్స్‌పేరుతో నూతన…

సోషల్ మీడియా లో ట్రెండింగ్ లో శృతి హాసన్
తెలుగు , తమిళ , హిందీ భాషలలో పలు బ్లాక్ బస్టర్ మూవీస్ లో శృతి తన అందం , అభినయంతో ప్రేక్షకులను అలరిస్తున్న విషయం తెలిసిందే. స్టార్ హీరోయిన్ శృతి హాసన్ ప్రస్తుతం ప్రభాస్ హీరోగా తెలుగు , కన్నడ భాషలలో తెరకెక్కుతున్న సలార్ , బాలకృష్ణ హీరో గా తెరకెక్కుతున్న వీరసింహారెడ్డి , మెగా స్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కుతున్న వాల్తేరు వీరయ్య మూవీస్ షూటింగ్స్ తో బిజీగా ఉన్న విషయం తెలిసిందే.

5సంవత్సరాలుగా అభిమానుల ప్రేమ, అభిమానం కు థ్యాంక్స్ - కళ్యాణి ప్రియదర్శన్
హీరో అఖిల్ అక్కినేని హలో ! (2017 ) మూవీ తో టాలీవుడ్ కు కథానాయికగా పరిచయం అయిన కళ్యాణి ప్రియదర్శన్ సూపర్ హిట్ చిత్రలహరి మూవీ తో ప్రేక్షకులను అలరించారు. శివకార్తికేయన్ హీరో మూవీ తో కోలీవుడ్, దుల్కర్ సల్మాన్ వరనే ఆవశ్యముండు మూవీ తో మలయాళ చిత్ర పరిశ్రమకు కళ్యాణి పరిచయం అయ్యారు.స్టార్ హీరో శింబు కు కళ్యాణి జోడీగా నటించిన మానాడు తమిళ మూవీ ఘనవిజయం సాధించింది. కళ్యాణి హీరోయిన్ గా తెరకెక్కిన హ్రిదయం , బ్రో డాడీ , తళ్ళుమాల మలయాళ మూవీస్ ఘనవిజయం సాధించాయి.

హన్సిక గాంధారి ఫస్ట్ లుక్ రిలీజ్
దేశ ముదురు సినిమాతో తెలుగు ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన హన్సిక మొదటి సినిమాతోనే యాత్ మనసు దోచేసింది. ఇక ఈసినిమాతో తరువాత హన్సిక కు పలు అవకాశాలు వచ్చి తెలుగులో బిజీ అయిపోయింది. కానీ ఆతరువాత కాస్త అవకాశాలు తగ్గుముఖం పట్టడంతో తమిళ్ ఇండస్ట్రీకి వెళ్లిపోయింది. ఇక అక్కడ కూడా వరుస అవకాశాలు రాబట్టుకొని అక్కడ కూడా బిజీ అయిపోయింది. కానీ ఈమధ్య అక్కడ కూడా కాస్త ఛాన్స్ లు తగ్గడంతో కొద్ది రోజులు సెలైంట్ గానే ఉంది. ఇక ఇప్పుడిప్పుడే మళ్లీ పలు సినిమాలతో కెరీర్ లో బిజీగా ఉంది. ఇప్పటికే పలు సినిమాలు లైన్ లో ఉన్నాయి. మై నేమ్ ఈజ్ శృతి, 105 మినట్స్ సినిమాలు చేస్తోంది.

యంగ్ హీరోయిన్ శ్రీలీల క్రేజ్
కమర్షియల్ హిట్ పెళ్ళి సందD మూవీ తో టాలీవుడ్ కు పరిచయమైన శ్రీలీల, ఆ మూవీ లో తన అందం, అభినయంతో ప్రేక్షకులను అలరించారు. యంగ్ హీరో నవీన్ పొలిశెట్టి అనగనగా ఒక రాజు, వైష్ణవ్‌తేజ్ మూవీ , గాలి జనార్ధన్‌రెడ్డి తనయుడు హీరోగా పరిచయమవుతున్న మూవీ , సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా తెరకెక్కుతున్న#SSMB 28 , రామ్ హీరోగా తెరకెక్కుతున్న #RAPO 20 నితిన్ హీరోగా తెరకెక్కుతున్న యాక్షన్ ఎంటర్ టైనర్ #NITHIN32 , #NBK108 మూవీస్ లో శ్రీలీల నటిస్తున్నారు.

ధమాకా మూవీ రివ్యూ
ఓవరాల్ గా చెప్పాలంటే ఒక కామెడీ ప్లస్ మాస్ సినిమా ఎంజాయ్ చేయాలనుకునేవారికి ఈ సినిమా ఖచ్చితంగా నచ్చుతుంది.

జనవరి లో #SSMB 28 మూవీ భారీ షెడ్యూల్
వరుస బ్లాక్ బస్టర్ మూవీస్ తో ప్రేక్షకులను అలరిస్తూ టాలీవుడ్ లో సూపర్ స్టార్ గా రాణిస్తున్న మహేష్ బాబు రీసెంట్ గా బ్లాక్ బస్టర్ సర్కారు వారి పాట మూవీ తో ప్రేక్షకులను అలరించిన విషయం తెలిసిందే. శ్రీమతి మమత సమర్పణ లో హారిక &హాసిని క్రియేషన్స్ బ్యానర్ పై త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో మహేష్ బాబు , పూజా హెగ్డే జంటగా మూవీ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. అతడు , ఖలేజా మూవీస్ తరువాత వారిద్దరి కాంబినేషన్ లో హ్యాట్రిక్ మూవీ గా తెరకెక్కుతున్న #SSMB28 మూవీ కి థమన్ ఎస్ సంగీతం అందిస్తున్నారు.