పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా క్రిష్ దర్శకత్వంలో వస్తున్న సినిమా హరిహర వీరమల్లు. ఈసినిమా కోసం పవన్ అభిమానులు ఎంత ఆసక్తిగా ఎదురుచూస్తున్నారో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. వేయికళ్లతో ఎదురుచూస్తున్నారు. పీరియాడిక్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ బందిపోటుగా నటిస్తున్నాడని తెలుస్తోంది. ఇప్పటికే ఈ సినిమానుంచి విడుదలైన పోస్టర్లు, గ్లిమ్ప్స్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాయి. ప్రస్తుతం అయితే ఈసినిమా షూటింగ్ ను పూర్తిచేసే పనిలో ఉన్నారు మేకర్స్. గత నెల నుంచి రామోజీ ఫిల్మ్ సిటీలోని హైదరాబాద్ లోనే వేసిన ఓ భారీ సెట్ లో రెగ్యూలర్ షూటింగ్ ను కొనసాగిస్తున్నారు. ఇప్పటికే సెట్స్ నుంచి పవన్ కళ్యాణ్ బైక్ రైడ్ స్టిల్స్, ఫొటోలు లీక్ అవుతూ సినిమాపై అంచనాలను పెంచేస్తున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఇదిలా ఉండగా ఈసినిమాలో ఇప్పటికే పలు బాలీవుడ్ స్టార్స్ నటిస్తున్న సంగతి తెలిసిందే కదా. ఇప్పుడు మరో స్టార్ హీరో కూడా ఈసినిమాలో జాయిన్ అయినట్టు తెలుస్తుంది. ఈసినిమాలో ఒక కీలక పాత్రకోసం బాబీ డియోల్ ను ఎంపిక చేశారు క్రిష్. తాజాగా ఆయన షూటింగ్ లో జాయిన్ అయ్యారు. ఇందుకు సంబంధించిన వీడియోను రిలీజ్ చేశారు.
కాగా ఈసినిమాలో పవన్ కళ్యాణ్‌కు జోడీగా నిధి అగర్వాల్ నటిస్తుండగా.. అర్జున్ రాంపాల్ కూడా కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ప్రముఖ నిర్మాత ఎ.ఎం.రత్నం తన మెగా సూర్యా ప్రొడక్షన్ బ్యానర్‌పై ఈ సినిమాను సమర్పిస్తున్నారు. ప్రముఖ సంగీత దర్శకుడు యం.యం.కీరవాణి సంగీతం అందిస్తుండగా.. ప్రముఖ సినిమాటోగ్రాఫర్ జ్ఞాన శేఖర్ వి.ఎస్. సినిమాటోగ్రాఫర్ గా పనిచేస్తున్నారు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: