మహేష్ తో సినిమా-మసూద హీరోయిన్ ఇంట్రెస్టింగ్ రిప్లై

Masooda Beauty Bandhavi Gives Interesting Reply to Mahesh Babu Fan,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Latest Tollywood News,Actress Bandhavi,Bandhavi Latest News,Masooda,Masooda Movie,Masooda Telugu Movie,Masooda News,Masooda Movie Latest News,Actress Bandhavi Gives Interesting Reply to Mahesh Babu Fan,Heroine Bandhavi Gives Interesting Reply to Mahesh Babu Fan

సూపర్ స్టార్ మహేష్ బాబుతో సినిమా చేయాలని ఏ హీరోయిన్ కు మాత్రం ఉండదు. కానీ అది అంత ఈజీ కాదన్న విషయం కూడా చాలా మందికి తెలుసు. స్టార్ హీరోయిన్లకు అంటే ఆ అవకాశం ఈజీగా వస్తుంది కానీ.. మిగిలిన హీరోయిన్లకు మాత్రం చాలా కష్టం. ఇక ఇప్పుడిప్పుడే వస్తున్న వాళ్ల పరిస్థితి ఎలా ఉంటుందో చెప్పనక్కర్లేదు. ఈనేపథ్యంలోనే మహేష్ సినిమా అంటే మసూద హీరోయిన్ ఇంట్రెస్టింగ్ రిప్లై ఇచ్చింది. తాజాగా సోషల్ మీడియా ద్వారా ఫ్యాన్స్ తో ముచ్చటించింది బాంధవి. దీనిలో భాగంగానే ఓ మహేష్ అభిమాని మహేష్ బాబు-బాంధవి కాంబినేషన్ లో మూవీ వస్తే ఫ్యాన్స్ కు పండగే అని పోస్ట్ చేయగా దానికి బాంధవి స్పందిస్తూ.. అత్యాశ అనుకోండి.. అంటే అన్నారు కానీ ఆ ఊహ ఎంత బాగుంది అని రిప్లై ఇచ్చింది. మరి ఫ్యూచర్ లో ఈ కాంబినేషన్ సెట్ అయ్యే అవకాశం ఉందేమో.. బాంధవి కోరిక తీరుతుందేమో చూద్దాం..

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఈ మధ్య కాలంలో హార్రర్ సినిమాలకు బాగా డిమాండ్ పెరిగిపోయింది. అందుకే మేకర్స్ కూడా ఈ జోనర్ లో సినిమాలు చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ప్రేక్షకులను కాస్త భయపెట్టామంటే చాలు సినిమా సూపర్ హిట్టే. ఇక ఈనేపథ్యంలో రీసెంట్ గా వచ్చి ప్రేక్షకులను భయపెట్టిన సినిమా మసూద. సాయికిరణ్ దర్శకత్వంలో తిరువీర్ , కావ్య క‌ల్యాణ్‌రామ్ జంటగా..  బాంధవి, సంగీత కీలక పాత్రలో నటించిన సినిమా మసూద. హార్రర్ నేపథ్యంలో చిన్న సినిమాగా వచ్చిన ఈసినిమా మాత్రం ఆద్యంతం సస్పెన్స్ తో ప్రేక్షకులను కట్టిపడేస్తూ ఆకట్టుకుంటుంది.

కాగా ఈసినిమాలో ఇంకా శుభలేఖ సుధాకర్, సత్యం రాజేష్, అఖిలా రామ్, సత్య ప్రకాష్ తదితరులు కూడా కీలక పాత్రల్లో నటించారు. మ‌ళ్లీ రావా, ఏజెంట్ సాయిశ్రీ‌నివాస ఆత్రేయ చిత్రాలతో సక్సెస్‌ఫుల్ బ్యానర్‌గా పేరు తెచ్చుకున్న స్వధ‌ర్మ్ ఎంట‌ర్‌టైన్‌మెంట్‌ బ్యానర్ పై ఈసినిమాను నిర్మించారు. ఈసినిమాకు సినిమాటోగ్రఫి నగేష్ బానెల్, సంగీతం ప్రశాంత్ ఆర్ విహారి అందించారు.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

twelve + seven =