ట్యాగ్ · 4407 కథనాలు · పేజీ 8

డైనమిక్ లుక్స్ లో యంగ్ టైగర్ ఎన్టీఆర్

మెగా పవర్ స్టార్ తో మెగా ప్రిన్స్

స్టార్ డైరెక్టర్ నిర్మాతగా హార్రర్ సినిమా?

వెండి తెర యముడు కైకాల సత్యనారాయణ ఇక లేరు

ధమాకా అవుట్ అండ్ అవుట్ ఎంటర్ టైనర్

అడివి శేష్ కొత్త ప్రాజెక్ట్ అప్ డేట్

కాంతార రిషబ్ శెట్టి కి అల్లు అర్జున్ అభినందనలు

రంగమార్తాండ-చిరు పవర్ ఫుల్ షాయరీ

ధమాకా మూవీ హిలేరియస్ ఎంటర్ టైనర్ - శ్రీలీల

హిట్ 2 హిందీ రిలీజ్ డేట్ ఫిక్స్

కన్ఫామ్ తునివు తెలుగు టైటిల్ రిలీజ్

మేజర్ యాక్షన్ సీక్వెన్స్ పూర్తి చేసుకున్న హరిహర వీరమల్లు

బెదురులంక 2012 గ్లింప్స్ రిలీజ్

కొరమీను ట్రైలర్ రిలీజ్
ఇండియా లో 200 కోట్ల క్లబ్ దిశగా అవతార్ 2
పలు బ్లాక్ బస్టర్ హాలీవుడ్ మూవీస్ దర్శకుడు జేమ్స్ కామెరాన్ దర్శకత్వంలో తెరకెక్కిన విజువల్ వండర్ అవతార్ హాలీవుడ్ మూవీ 2009 లో రిలీజ్ అయ్యి ఘనవిజయం సాధించి, భారీ కలెక్షన్స్ తో వరల్డ్ బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ మూవీగా నిలిచింది. లైట్ స్ట్రామ్ ఎంటర్‌టైన్‌మెంట్-టీఎస్‌జీ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్స్ పై జేమ్స్ కామెరాన్ దర్శకత్వం లో సామ్ వర్తింగ్టన్, జో సాల్డనా ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన అవతార్ మూవీ సీక్వెల్ అవతార్ : ది వే ఆఫ్ వాటర్ మూవీ డిసెంబరు 16న విడుదల అయ్యి భారీ కలెక్షన్స్ తో దూసుకుపోతోంది.

డైనమిక్ లుక్స్ లో యంగ్ టైగర్ ఎన్టీఆర్
వరుస బ్లాక్ బస్టర్ మూవీస్ లో అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి ప్రేక్షకులను అలరిస్తున్న యంగ్ టైగర్ ఎన్టీఆర్, రీసెంట్ గా రిలీజ్ అయిన బ్లాక్ బస్టర్ ఆర్ఆర్ఆర్ మూవీ లో గోండు వీరుడు కొమురం భీమ్ పాత్రలో అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి ఎన్టీఆర్ ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. ఎన్టీఆర్ ఆర్ట్స్, యువసుధ ఆర్ట్స్ బ్యానర్స్ పై కొరటాల శివ దర్శకత్వంలో ఎన్టీఆర్ హీరోగా తెరకెక్కనున్న #NTR30 మూవీ త్వరలో సెట్స్ పైకి వెళ్ళనుంది. ఈ మూవీ తరువాత ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో మరో మూవీ కి ఎన్టీఆర్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన విషయం తెలిసిందే.

అమిగోస్ మూవీ లో మూడు విభిన్న పాత్రలలో కళ్యాణ్ రామ్
హీరో , నిర్మాత నందమూరి కళ్యాణ్ రామ్ బింబిసార మూవీ తో భారీ హిట్ అందుకున్న విషయం తెలిసిందే. ఆ మూవీ లో అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి కళ్యాణ్ రామ్ ప్ర్క్షకులను అలరించారు. బింబిసార మూవీ సక్సెస్ ను ఎంజాయ్ చేస్తున్న కళ్యాణ్ రామ్ ప్రస్తుతం డెవిల్ , అమిగోస్ మూవీస్ లో నటిస్తున్నారు. బ్లాక్ బస్టర్ బింబిసార సీక్వెల్ బింబిసార 2 మూవీ కై అన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయి. బింబిసార 2 మూవీ త్వరలోనే సెట్స్ పైకి వెళ్లనుంది.

మెగా పవర్ స్టార్ తో మెగా ప్రిన్స్
బ్లాక్ బస్టర్ ఆర్ ఆర్ ఆర్ మూవీ లో అల్లూరి సీతారామరాజుగా అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందారు. ఆర్ ఆర్ ఆర్ మూవీ సక్సెస్ ను ఎంజాయ్ చేస్తున్న రామ్ చరణ్ ప్రస్తుతం భారీ చిత్ర దర్శకుడు శంకర్ ఎస్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న #RC 15 మూవీ లో నటిస్తున్నారు. పలు సూపర్ హిట్ మూవీస్ తో ప్రేక్షకులను అలరిస్తున్న మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ ప్రస్తుతం ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో తెరకెక్కుతున్న యాక్షన్ ఎంటర్ టైనర్ #VT 12 మూవీ లో నటిస్తున్నారు. శక్తి ప్రతాప్ సింగ్ హడా దర్శకత్వంలో వరుణ్ తేజ్ హీరోగా తెలుగు , హిందీ భాషలలో తెరకెక్కుతున్న#VT 13 మూవీ పూజాకార్యక్రమం…

స్టార్ డైరెక్టర్ నిర్మాతగా హార్రర్ సినిమా?
ప్రస్తుతం హార్రర్ సినిమాల ట్రెండ్ నడుస్తున్న సంగతి తెలిసిందే కదా. ఆడియన్స్ అందరూ ఈ జోనర్ కు ఎప్పుడూ కనెక్ట్ అవుతారు కాబట్టి మేకర్స్ కూడా ఈ జోనర్ లో సినిమాలు తీయడానికి ఇష్టపడుతుంటారు. ఇక ఇప్పుడు మరో క్రేజీ కాంబినేషన్ తెరపైకి రానున్నట్టు తెలుస్తుంది. స్టార్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ నిర్మాతగా మారి ఓ హార్రర్ సినిమాను తెరకెక్కించనున్నట్టు సమాచారం. హీరో పృథ్విరాజ్ ఓ ఇంటర్వ్యూలో ఈ విషయాన్ని పంచుకోవడంతో ఇప్పుడు ఇది హాట్ టాపిక్ గా మారింది. అంతేకాదు కాదు ఈహార్రర్ సినిమాలో లీడ్ రోల్ లో క్రేజీ కాంబనేషన్ ను తీసుకురానున్నారట. ఆ జంట ఎవరో కాదు.. హార్రర్ సినిమాలు తీయడంలో ఎక్పర్ట్ అయిన రాఘవ లారెన్స్ ఇంకా లేడీ…

వెండి తెర యముడు కైకాల సత్యనారాయణ ఇక లేరు
సిపాయి కూతురు (1959) మూవీ తో టాలీవుడ్ లో కెరీర్ ప్రారంభించిన కైకాల సత్యనారాయణ, హీరో నందమూరి తారకరామారావు కు పలు మూవీస్ లో డూప్ గా నటించారు. కనకదుర్గ పూజా మహిమ మూవీ లో విలన్ గా నటించిన కైకాల విలన్ పాత్రలకు పెట్టింది పేరుగా మారారు.పౌరాణిక, సాంఘిక, చారిత్రక, జానపద సినిమాలలో నటించిన కైకాల సుమారు 750 కు పైగా సినిమాలలో విలన్ , క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటించారు. సూపర్ హిట్ యమగోల మూవీ లో ఫస్ట్ టైమ్ యమధర్మరాజు గా కైకాల అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి ప్రేక్షకులను అలరించారు.కైకాల యముడిగా నటించిన యముడికి మొగుడు , యమలీల , యమగోల మళ్ళీ మొదలయ్యింది మూవీస్ ఘనవిజయం సాధించాయి.

ధమాకా అవుట్ అండ్ అవుట్ ఎంటర్ టైనర్
మాస్ మహారాజా రవితేజ, కమర్షియల్ మేకర్ త్రినాథరావు నక్కిన కాంబినేషన్ లో వస్తున్న సినిమా మాస్ అండ్ యాక్షన్ ఎంటర్‌టైనర్ 'ధమాకా'. రవితేజ సరసన టాలీవుడ్ ఫేవరేట్ హీరోయిన్ శ్రీలీల హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రాన్ని టిజి విశ్వ ప్రసాద్ భారీగా నిర్మిస్తున్నారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ & అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ పతాకాలపై రూపొందుతున్న ఈ చిత్రానికి వివేక్ కూచిభొట్ల సహ నిర్మాత. ఇప్పటికే విడుదలైన ధమాకా పాటలు, టీజర్, ట్రైలర్ అద్భుతమైన రెస్పాన్స్ తో సినిమాపై భారీ అంచనాలు పెంచాయి. డిసెంబర్ 23న 'ధమాకా' ప్రపంచవ్యాప్తంగా థియేటర్లో విడుదలౌతున్న నేపధ్యంలో హీరో రవితేజ విలేఖరుల సమావేశంలో చిత్ర విశేషాలని పంచుకున్నారు.

అడివి శేష్ కొత్త ప్రాజెక్ట్ అప్ డేట్
వైవిధ్య కథలను ఎంచుకుంటూ టాలీవుడ్‌లో తనకంటూ ప్రత్యేక గుర్తింపును తెచ్చుకున్నాడు యంగ్ హీరో అడివి శేష్. నటుడిగానే కాదు అటు రచయితగా కూడా తన టాలెంట్ ను చూపిస్తూ దూసుకుపోతున్నాడు. అందుకే వరుసగా హిట్లను అందుకుంటు కెరీర్ లో దూసుకుపోతున్నాడు. ఈ ఏడాది మేజర్, హిట్ 2 అంటూ రెండు సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు అడివి శేష్. రెండు సినిమాలు కూడా మంచి విజయాలు అందుకున్నాయి. రెండు సినిమాలు కూడా రెండు డిఫరెంట్ జోనర్లు. మేజర్ పేట్రియాటిజం నేపథ్యంలో అలానే హిట్ 2 సినిమా సస్పెన్స్ థ్రిల్లర్ నేపథ్యంలో ఈసినిమాలు వచ్చాయి.

కనెక్ట్ మూవీ రివ్యూ
ఓవరాల్ గా చెప్పాలంటే థ్రిల్లర్ సినిమాలను ఇష్టపడే వాళ్లకు ఈసినిమా బాగా కనెక్ట్ అవుతుందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు.

కాంతార రిషబ్ శెట్టి కి అల్లు అర్జున్ అభినందనలు
హోంబలే ఫిల్మ్స్ బ్యానర్‌పై స్వీయ దర్శకత్వంలో కన్నడ హీరో రిషబ్ శెట్టి ప్రధాన పాత్రలో నటించిన కాంతార కన్నడ మూవీ సెప్టెంబర్ 30వ తేదీన రిలీజ్ అయ్యి ఘనవిజయం సాధించిన విషయం తెలిసిందే. ఈ చిత్రంలో కిషోర్, అచ్యుత్ కుమార్, సప్తమి గౌడ, ప్రమోద్ శెట్టి కీలక పాత్రలలో నటించారు. బి .అజనీష్ లోకనాథ్ సంగీతం అందించారు. కాంతార మూవీ అన్ని భాషలలోనూ అద్భుత రెస్పాన్స్ సాధించిన విషయం తెలిసిందే. కాంతార మూవీ ప్రపంచవ్యాప్తంగా 400 కోట్లు పైగా కలెక్ట్ చేసి రికార్డ్ క్రియేట్ చేసింది. ఈ మూవీపై ప్రేక్షకులతో పాటు సినీ ప్రముఖులు ప్రశంసలు కురిపిస్తున్న విషయం తెలిసిందే.కాంతార మూవీ కి ఓటీటీ లో కూడా అద్భుత స్పందన లభిస్తుంది.

95 వ అకాడమీ అవార్డ్స్ కు షార్ట్ లిస్ట్ అయిన ఫస్ట్ ఇండియన్ సాంగ్ నాటు నాటు
డివివి ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై స్టార్ డైరెక్టర్ రాజమౌళి దర్శకత్వంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోలుగా భారీ బడ్జెట్, భారీ తారాగణంతో తెరకెక్కిన పీరియాడికల్ యాక్షన్ డ్రామా రౌద్రం రణం రుధిరం మూవీ మార్చి 25 వ తేదీ రిలీజ్ అయ్యి ఘనవిజయం సాధించి , ప్రపంచవ్యాప్తంగా 1140కోట్లకు పైగా కలెక్షన్స్ సాధించింది. మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు పాత్రలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, గోండు వీరుడు కొమురం భీమ్ గా ఎన్టీఆర్ తమ పవర్ ఫుల్ యాక్టింగ్ టాలెంట్ తో ప్రేక్షకులను అలరించారు. ఆర్ఆర్ఆర్ మూవీ పై హాలీవుడ్ ప్రముఖులు ప్రశంసలు కురిపించిన విషయం తెలిసిందే.

రంగమార్తాండ-చిరు పవర్ ఫుల్ షాయరీ
క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణవంశీ ఎప్పటినుండో మంచి హిట్ కోసం ఎదురుచూస్తున్న సంగతి తెలిసిందే. ఈమధ్య కాలంలో ఆయన తీసిన సినిమాలు బాక్సాఫీస్ వద్ద బోల్తాకొట్టడంతో ఇప్పుడు ఎలాగైనా హిట్ కొట్టాలని చూస్తున్నాడు. ఈనేపథ్యంలోనే ఇప్పుడు రంగమార్తాండ సినిమాతో వచ్చేస్తున్నాడు. ఈసినిమా మరాఠీలో సూపర్ హిట్ అయిన ‘నటసామ్రాట్’ సినిమాకు రీమేక్ అన్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం అయితే పోస్ట్ ప్రొడక్షన్ పనులను జరుపుకుంటుంది. మరోవైపు కృష్ణవంశీ కూడా పోస్ట్ ప్రొడక్షన్ పనులకు సంబంధించిన అప్ డేట్స్ ఎప్పటికప్పుడు ఇస్తూనే ఉన్నాడు. ఎమోషనల్ డ్రామా నేపథ్యంలో ఈసినిమా తెరకెక్కుతుంది.

ధమాకా మూవీ హిలేరియస్ ఎంటర్ టైనర్ - శ్రీలీల
పీపుల్ మీడియా ఫ్యాక్టరీ , అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ బ్యానర్స్ పై మాస్ డైరెక్టర్ నక్కిన త్రినాథరావు దర్శకత్వంలో రవితేజ , పెళ్ళిసందD మూవీ ఫేమ్ శ్రీ లీల జంటగా తెరకెక్కిన మాస్ ఎంటర్ టైనర్ మూవీ ధమాకా డిసెంబర్ 23వ తేదీ రిలీజ్ కానుంది. భీమ్స్ సంగీతం అందిస్తున్నారు. ఫన్ , ఫ్యామిలీ ఎమోషన్స్ తో తెరకెక్కిన ఈ మూవీ పోస్టర్స్ , గ్లింప్స్, సాంగ్స్ , ట్రైలర్ ను చిత్ర యూనిట్ రిలీజ్ చేయగా ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. సాంగ్స్ లో హీరో రవితేజ , శ్రీలీల ఎనర్జిటిక్ డ్యాన్స్ పెర్ఫార్మెన్స్ ప్ర్క్షకులను విశేషంగా ఆకట్టుకుంది.

వీర సింహారెడ్డి సుగుణ సుందరి సాంగ్ మేకింగ్ వీడియో రిలీజ్
మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై గోపీచంద్ మలినేని దర్శకత్వంలో బాలకృష్ణ హీరోగా వాస్తవ సంఘటనలతో రాయలసీమ ఫ్యాక్షనిజం బ్యాక్ డ్రాప్ గా యాక్షన్ ఎంటర్ టైనర్ వీర సింహారెడ్డి మూవీ సంక్రాంతి కానుకగా జనవరి 12 వ తేదీ రిలీజ్ కానుంది. శృతి హాసన్ కథానాయిక. వరలక్ష్మి శరత్ కుమార్, దునియా విజయ్ ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు. చంద్రిక రవి ఒక స్పెషల్ సాంగ్ లో నటిస్తున్నారు. థమన్ ఎస్ సంగీతం అందిస్తున్నారు. చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన హీరో బాలకృష్ణ ఫస్ట్ లుక్ పోస్టర్, ఫస్ట్ హంట్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన ఫస్ట్ సింగిల్ జై బాలయ్య ప్రేక్షకులను ఆకట్టుకుంది.

హిట్ 2 హిందీ రిలీజ్ డేట్ ఫిక్స్
మన తెలుగు సినిమాలకు ఇప్పుడు నార్త్ లో ఎంత డిమాండ్ పెరిగిందో చూస్తూనే ఉన్నాం. ఇక్కడ హిట్ అయిన సినిమాలను హిందీలో కూడా రిలీజ్ చేస్తూ అక్కడ కూడా హిట్లను సొంతం చేసుకుంటున్నారు మేకర్స్. ఇక ఇప్పుడు మరో సినిమా హిందీ రిలీజ్ కు సిద్దమైంది. అడివి శేష్ హీరోగా వచ్చిన సినిమా హిట్ 2. ఈసినిమా హిట్ సినిమాకు రీమేక్ అన్న సంగతి తెలిసిందే కదా. శైలేష్ కొలను దర్శకత్వంలో సస్పెన్స్ థ్రిల్లర్ నేపథ్యంలో వచ్చిన ఈసినిమా ప్రేక్షకులను ఆకట్టుకొని సూపర్ హిట్ అయింది. ఇక కలెక్షన్స్ పరంగా కూడా భారీ కలెక్షన్స్ ను అందించింది. ఇప్పుడు ఈసినిమాను హిందీ లో కూడా రిలీజ్ చేస్తున్న సంగతి తెలిసిందే కదా. తాజాగా హిందీ రిలీజ్ డేట్ ను కూడా…

యంగ్ టైగర్ ఎన్టీఆర్ పై లేడీ సూపర్ స్టార్ నయనతార ప్రశంసలు
తెలుగు , తమిళ భాషల పలు సూపర్ హిట్ కమర్షియల్ ఫిల్మ్స్ తోపాటు ఉమెన్ సెంట్రిక్ ఫిల్మ్స్ తో ప్రేక్షకులను అలరిస్తూ నయనతార లేడీ సూపర్ స్టార్ గా కొనసాగుతున్నారు. వి వి వినాయక్ దర్శకత్వంలో ఎన్టీఆర్ , నయనతార , షీలా ప్రధాన పాత్రలలో తెరకెక్కిన యాక్షన్ కామెడీ అదుర్స్ మూవీ ఘనవిజయం సాధించిన విషయం తెలిసిందే. ఈ మూవీ లో రెండు పాత్రలలో నటించిన ఎన్టీఆర్ , నయనతార ల స్క్రీన్ కెమిస్ట్రీ ప్రేక్షకులను ఆకట్టుకుంది. పూర్తి కామెడీ ఎంటర్ టైనర్ గా తెరకెక్కిన ఈ మూవీ లో బ్రహ్మానందం , ఎన్టీఆర్ ల కాంబినేషన్ సీన్స్ , బ్రహ్మానందం , నయనతార కాంబినేషన్ సీన్స్ నవ్వులతో ప్రేక్షకులను ముంచెత్తాయి.

కన్ఫామ్ తునివు తెలుగు టైటిల్ రిలీజ్
అజిత్- హెచ్ వినోద్ కాంబినేషన్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. వీరిద్దరి కాంబినేషన్ లో ఇప్పటికే రెండు సినిమాలు వచ్చాయి. నెర్కొండ పార్వాయి సినిమా ఇంకోటి వాలిమై సినిమా. నెర్కొండ పార్వాయి సినిమా పింక్ సినిమాకు రీమేక్. ఈసినిమా సూపర్ హిట్ అయింది. దీంతో వాలిమై సినిమాను కూడా రూపొందించారు. ఇటీవలే ఈసినిమా రిలీజ్ అయి మిశ్రమ ఫలితాన్ని అందించింది. ఇప్పుడు వీరిద్దరి కాంబోలో తునివు సినిమా వస్తుంది. కన్ఫామ్ ప్రస్తుతం ఈసినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులను ముగించుకునే పనిలో ఉంది.

మేజర్ యాక్షన్ సీక్వెన్స్ పూర్తి చేసుకున్న హరిహర వీరమల్లు
మెగా సూర్య ప్రొడక్షన్ బ్యానర్‌పై క్రియేటివ్ డైరెక్టర్ క్రిష్ దర్శకత్వంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా 17వ శతాబ్దం నాటి మొఘలాయిలు, కుతుబ్ షాహీల కాలం నేపథ్యంలో భారీ సెట్స్, భారీ బడ్జెట్ తో పీరియాడికల్ యాక్షన్ అడ్వెంచర్ హరిహర వీరమల్లు మూవీ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. పాన్ ఇండియా మూవీగా తెరకెక్కుతున్న ఈ మూవీ లో నిధి అగర్వాల్, నర్గీస్ ఫక్రి కథానాయికలు. కీరవాణి సంగీతం అందిస్తున్నారు. చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన పోస్టర్స్, పవర్ గ్లాన్స్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి.

బెదురులంక 2012 గ్లింప్స్ రిలీజ్
టాలీవుడ్ యంగ్ హీరో కార్తికేయ ఎప్పటినుండో మంచి హిట్ కోసం ఎదురుచూస్తున్నాడు. ప్రస్తుతం మరో సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. క్లాక్స్ దర్శకత్వంలో కార్తికేయ హీరోగా వస్తున్న సినిమా బెదురులంక 2012. విలేజ్ బ్యాక్ డ్రాప్ లో ఈసినిమా రూపొందుతుందన్న విషయం తెలిసిందే కదా. ప్రస్తుతం అయితే ఈసినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులను జరుపుకుంటుంది. ఇప్పటివరకూ ఈసినిమా నుండి పలు పోస్టర్లు మాత్రమే రిలీజ్ చేశారు. ఇక ఈసినిమా నుండి తాజాగా గ్లింప్స్ ను రిలీజ్ చేశారు మేకర్స్. గ్రామంలో జరిగే ఫన్నీ, సీరియస్ ఎలిమెంట్స్ తో పాటుగా సస్పెన్స్ ను కూడా గ్లింప్స్ లో చూడచ్చు. గ్లింప్స్ అయితే సినిమాపై ఆసక్తిని పెంచేస్తుంది.

కొరమీను ట్రైలర్ రిలీజ్
ప్రస్తుతం చిన్న సినిమాలు కూడా పెద్ద పెద్ద విజయాలు అందుకుంటున్నాయి. అందుకే మేకర్స్ నూతన దర్శకులను, కొత్త దర్శకులను పరిచయం చేస్తున్నారు. ఇక ఇప్పుడు అలాంటి నేపథ్యంలోనే వస్తున్న సినిమా కొరమీను. శ్రీపతి కర్రి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రంలో ఆనంద్ రవి ప్రధాన పాత్రలో నటిస్తున్నాడు. ఈసినిమా రిలీజ్ కు సిద్దమవుతుంది. దీనిలో భాగంగానే చిత్రయూనిట్ ప్రమోషన్ కార్యక్రమాలు చేస్తూ సినిమాపై మంచి బజ్ క్రియేట్ చేస్తున్నారు. ఇప్పటికే రిలీజ్ చేసిన మోషన్ పోస్టర్, పోస్టర్స్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. ఇక తాజాగా ఈసినిమా ట్రైలర్ ను రిలీజ్ చేశారు. టాలీవుడ్ టాలెంటెడ్ హీరో అడివి శేష్ చేతుల మీదుగా ఈ ట్రైలర్ ను రిలీజ్…