ధమాకా మూవీ రివ్యూ

Dhamaka Telugu Movie Review,Dhamaka Movie Review,Dhamaka Review,Dhamaka Telugu Review,Dhamaka Movie - Telugu,Dhamaka First Review,Dhamaka Movie Review And Rating,Dhamaka Critics Review,Dhamaka (2022) - Movie,Dhamaka (2022),Dhamaka (film),Dhamaka Movie (2022),Dhamaka (Telugu) (2022) - Movie,Dhamaka (2022 film),Dhamaka Review - Telugu,Dhamaka Movie: Review,Dhamaka Story review,Dhamaka Movie Highlights,Dhamaka Movie Plus Points,Dhamaka Movie Public Talk,Dhamaka Movie Public Response,Dhamaka,Dhamaka Movie,Dhamaka Telugu Movie,Dhamaka Movie Updates,Dhamaka Telugu Movie Live Updates,Dhamaka Telugu Movie Latest News,Ravi Teja,Sreeleela,Trinadha Rao Nakkina,Jayaram,Sachin Khedekar,Tanikella Bharani,Rao Ramesh,Bheems Ceciroleo,T G Vishwa Prasad,Telugu Cinema Reviews,Telugu Movie Reviews,Telugu Movies 2022,Telugu Reviews,Telugu Reviews 2022,New Telugu Movies 2022,New Telugu Movie Reviews 2022,Latest Telugu Reviews,Latest Telugu Movies 2022,Latest Telugu Movie Reviews,Latest Tollywood Reviews,Tollywood Reviews,New Movie Reviews,Telugu Movie Reviews 2022,2022 Latest Telugu Reviews,Telugu Movie Ratings,2022 Latest Telugu Movie Review,2022 Telugu Reviews,Latest 2022 Telugu Movie,latest movie review,Latest Telugu Movie Reviews 2022,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Latest Tollywood Updates

మాస్ మహారాజా రవితేజ హీరోగా నక్కిన త్రినాథరావు దర్శకత్వంలో వచ్చిన సినిమా ధమాకా. మాస్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా రూపొందించిన ఈసినిమాపై భారీ అంచనాలే ఉన్నారు. రిలీజ్ అయిన పాటలు, టీజర్, ట్రైలర్ కూడా సినిమాపై అంచనాలు పెంచేయడంతో సినిమాపై ఎక్స్ పెక్టేషన్స్ మరింత పెరిగాయి. దాంతో ఈసినిమాపై మొదటి నుండీ మేకర్స్ మంచి నమ్మకంతో ఉన్నారు. రవితేజకు ఖచ్చితంగా ఈసినిమా హిట్ ఇస్తుందంటున్నారు. మరి వారి నమ్మకం ఎంతవరకూ నిజమైంది.. ఈసినిమా రవితేజకు ఎలాంటి ఫలితాన్ని అందించింది అన్న విషయం తెలియాలంటే రివ్యూలోకి వెళ్లాల్సిందే.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

నటీనటులు.. రవితేజ, శ్రీలీల, సచిన్ ఖేడ్కర్, రావు రమేష్, జయరామ్, తనికెళ్ల భరణి, సీత, పవిత్ర లోకేష్, సమీర్, ప్రవీణ్, హైపర్ ఆది తదితరులు
దర్శకత్వం.. నక్కిన త్రినాథరావు
బ్యానర్.. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ బ్యానర్
నిర్మాత.. అభిషేక్ అగర్వాల్, టీజీ విశ్వప్రసాద్
సంగీతం.. భీమ్స్
సినిమాటోగ్రఫి.. కార్తీక్

కథ..

స్వామి(రవితేజ) కు అనుకోకుండా ఉద్యోగం పోవడంతో తన చెల్లి (మోనికారెడ్డి) కి పెళ్లి చేసేందుకు తండ్రి గోవిందరావు(తనికెళ్ళ భరణి) తో కలిసి ప్రయత్నాలు చేస్తూ ఉంటాడు. ఈక్రమంలో ఒకరోజు స్వామి చెల్లెలు ఫోన్ లో నుంచి ఆపదలో ఉన్నాను ఆదుకోమని మెసేజ్ రావడంతో వెళ్లిన స్వామికి అక్కడ చెల్లెలు స్థానంలో ప్రణవి(శ్రీ లీల) కనిపిస్తుంది. మొదటి చూపులోనే ఆమెతో ప్రేమలో పడిన స్వామి వెంటనే ఆమెకు ప్రపోజ్ చేస్తాడు. ఇక మరోపక్క పీపుల్స్ మార్ట్ కంపెనీ అధినేత చక్రవర్తి (సచిన్ ఖేడ్కర్) ఏకైక కొడుకు ఆనంద్ చక్రవర్తి (రవితేజ). ఇక తన కూతురు ప్రణవిని ఆనంద్ చక్రవర్తికి ఇచ్చి పెళ్లి చేయాలనేది తన తండ్రి (రావు రమేష్) ఆశ. ఈనేపథ్యంలో వీరిద్దరినీ చూసి షాకైన ప్రణవి ఇద్దరిలో ఎవరివి సెలెక్ట్ చేసుకోవాలో తెలియక ఇద్దరితోనూ ట్రావెల్ చేస్తూ ఉంటుంది. మరోవైపు పీపుల్స్ మార్ట్ కంపెనీ చేజిక్కించుకోవాలని జేపీ (జయరాం) ప్రయత్నిస్తుంటాడు. మరి చివరికి ఏమైంది.. చివరికి ఏమైంది? అసలు స్వామి, ఆనంద్ లకు పరిచయం ఉందా? అసలు వీరిద్దరూ ఒక్కరేనా? లేక వేరు వేరు వ్యక్తులా? ప్రణవి ఇద్దరిలో ఎవరిని సెలక్ట్ చేసుకుంది..? జేపీ ప్రయత్నాలు ఆనంద్ అడ్డుకున్నాడా?లేదా? అనే విషయాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే..

విశ్లేషణ..

గతంలో త్రినాధరావు నక్కిన దర్శకత్వంలో బెజవాడ ప్రసన్న కుమార్ అందించిన కథలు సూపర్ హిట్ కావడంతో ఈ కాంబినేషన్ మీద అంచనాలు ఏర్పడ్డాయి. అంచనాలకు తగినట్లుగానే ఈ సినిమాని కూడా రూపొందించారు. రవితేజ సినిమాలో ప్రేక్షకులు ఎలాంటి ఎలిమెంట్స్ కోరుకుంటారో అవన్నీ కథలో ఉండేలా చూసుకుంటారు. అటు కామెడీ తో పాటు యాక్షన్ ఎలిమెంట్స్, ఇంకా పాటలు, డ్యాన్స్ లు, హీరో హీరోయిన్ కి మధ్య కెమిస్ట్రీ, ఎమోషన్ అన్నింటినీ సమపాళ్లలో మేనేజ్ చేస్తూ సినిమా నడిపించారు డైరెక్టర్. నిజానికి అందరికీ తెలిసిన కథే అయిన డైరెక్టర్ మేకింగ్ తో ఆకట్టుకున్నాడు.

రవితేజ కిక్ సినిమాతో మళ్లీ ఫామ్ లోకి వచ్చాడు. అయితే ఆ తరువాత వచ్చిన రెండు సినిమాలు కూడా మళ్లీ బాక్సాఫీస్ వద్ద బోల్తాకొట్టాయి. ఇక ఇప్పుడు ఈసినిమాతో ఎలాగైనా హిట్ కొట్టాలని చూస్తున్నాడు. మరి సినిమా జయాపజయాలను పక్కన పెడితే రవితేజ నటన గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కరెక్ట్ పాత్ర పడితే ఎలా చెలరేగిపోతాడో ఎన్నో సినిమాల్లో చూశాం. ఇక ఈసినిమాలో కూడా చెలరేగిపోయాడు రవితేజ. సినిమా మొత్తం రవితేజ వన్ మ్యాన్ షోగా సాగుతుంది.

ఇక ఈసినిమాలో హీరోయిన్ గా నటించిన శ్రీలీల గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. నిజానికి శ్రీలీలకు, రవితేజకు మధ్య ఏజ్ గ్యాప్ ఎక్కువగానే ఉండటంతో శ్రీలీల సెట్ అవుతుందా లేదా అన్న అనుమానం అందరికీ కలిగింది. కానీ సినిమా చూసిన తరువాత ఆ అనుమానాలు అన్నీ తొలగిపోయాయి. అందరికీ షాక్ ఇచ్చే విధంగా ఇద్దరి కెమిస్ట్రీ బాగా వర్కౌట్ అయింది. శ్రీలీల తన పాత్రకు పూర్తి న్యాయం చేసింది. శ్రీలీల ఈ సినిమాలో తన ఎనర్జీతో సర్‌ప్రైజ్ చేస్తుంది. ఎక్స్‌ప్రెషన్స్, డ్యాన్స్‌ల్లో రవితేజతో పోటీ పడింది. వీరి తర్వాత చెప్పుకోదగ్గ పాత్ర పడింది రావు రమేష్, హైపర్ ఆదిలకే. వీరిద్దరి మధ్య కామెడీ ట్రాక్ నవ్విస్తుంది. మిగిలిన నటీనటులు తమ పాత్రల మేర నటించారు.

టెక్నికల్ వాల్యూస్

ఇక సాంకేతిక విభాగానికి వస్తే.. భీమ్స్ సిసిరోలియో అందించిన మ్యూజిక్ సినిమాకి బాగా ప్లస్ అయింది. పాటలు ప్రేక్షకులందరినీ ఆకట్టుకున్నాయి. సినిమాటోగ్రఫీ కూడా రిచ్ గా ఉంది. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగినట్లుగా సరిపోయాయి.

ఓవరాల్ గా చెప్పాలంటే ఒక కామెడీ ప్లస్ మాస్ సినిమా ఎంజాయ్ చేయాలనుకునేవారికి ఈ సినిమా ఖచ్చితంగా నచ్చుతుంది.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

16 − 6 =