
ట్యాగ్ · 4407 కథనాలు · పేజీ 57


రామ్ లీలా మైదానం లో రావణ దహనం చేసిన ప్రభాస్

జపాన్ లో యంగ్ టైగర్ ఎన్టీఆర్ క్రేజ్

పొన్నియిన్ సెల్వన్ 1 మూవీ పై కమల్ హాసన్ ప్రశంసలు

ఆదిపురుష్ టీజర్ విమర్శలపై దర్శకుడు ఓం రౌత్ స్పందన

ఆదిపురుష్ రిలీజ్ డేట్ పై మరోసారి క్లారిటీ

కన్ఫామ్.. రామ్ హీరోయిన్ గా శ్రీలీల

ఆదిపురుష్ టీజర్-వరల్డ్ వైడ్ సూపర్ రెస్పాన్స్

ఓరి దేవుడా మరో రోల్ రివీల్

ధనుష్-శేఖర్ కమ్ముల మూవీ క్రేజీ అప్ డేట్

మరో రేర్ ఫీట్ అందుకున్న విక్రమ్

డీజే టిల్లు 2 హీరోయిన్ పై సిద్దూ క్లారిటీ

జిన్నా ట్రైలర్ రిలీజ్ డేట్ ఫిక్స్

హరి హర వీరమల్లు మూవీ న్యూ రిలీజ్ డేట్?

RAPO 20 దసరా నుండి సందడి షురూ

జిన్నా ట్రైలర్ రిలీజ్
అవ ఎంటర్‌టైన్‌మెంట్స్ , 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ బ్యానర్స్ పై ఈషాన్ సూర్య దర్శకత్వంలో విష్ణు మంచు హీరోగా కామెడీ ఎంటర్ టైనర్ జిన్నా మూవీ అక్టోబర్ 21 వ తేదీ రిలీజ్ కానుంది. పాయల్ రాజ్ పుత్ , సన్నీ లియోన్ కథానాయికలు. వెన్నెల కిషోర్, రఘు బాబు, చమ్మక్ చంద్ర, కమెడియన్ సద్దాం ముఖ్య పాత్రలలో నటించారు. మూల కథను ప్రముఖ దర్శకుడు జి. నాగేశ్వరరెడ్డి అందించగా, ఈ మూవీ కి కథ , స్క్రీన్ ప్లే తో పాటు క్రియేటివ్ ప్రొడ్యూసర్‌గా స్టార్ రైటర్ కోన వెంకట్ వ్యవహరిస్తున్నారు.అనూప్ రూబెన్స్ సంగీతం అందిస్తున్నారు. చిత్రయూనిట్ రిలీజ్ చేసిన పోస్టర్స్ , సాంగ్స్ , టీజర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి.

జనరల్ కేటగిరీ లో ఆస్కార్ అవార్డ్స్ కు ఆర్ ఆర్ ఆర్
డివివి ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై స్టార్ డైరెక్టర్ రాజమౌళి దర్శకత్వంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ , అలియా భట్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ , ఒలీవియా మోరిస్ జంటలుగా భారీ బడ్జెట్ , భారీ తారాగణం తో తెరకెక్కిన హై ఎమోషనల్ యాక్షన్ ఎంటర్ టైనర్ రౌద్రం రణం రుధిరం మూవీ మార్చి 25 వ తేదీ ప్రపంచవ్యాప్తంగా సూపర్ హిట్ టాక్ సొంతం చేసుకుని అన్ని భాషలలోనూ భారీ కలెక్షన్స్ సాధించిన విషయం తెలిసిందే. ప్రపంచవ్యాప్తంగా ఈ మూవీ 1,130 కోట్ల రూపాయల కి పైగా గ్రాస్ కలెక్షన్స్ సాధించింది. ఆర్ ఆర్ ఆర్ మూవీ గ్లోబల్ గా ప్రేక్షకులకు రీచ్ అయ్యింది.అల్లూరి సీతారామరాజుగా రామ్ చరణ్ , కొమురం భీమ్ గా ఎన్టీఆర్ అద్భుతంగా పెర్ఫార్మ్ చేసిన…

హీరో గోపీచంద్ తో మూవీ అనౌన్స్ చేసిన దర్శకుడు శ్రీను వైట్ల
నీకోసం (1999) మూవీ తో టాలీవుడ్ కు డైరెక్టర్ గా పరిచయం అయిన శ్రీను వైట్ల సొంతం , వెంకీ , ఢీ , రెడీ , దూకుడు , బాద్ షా వంటి సూపర్ హిట్ మూవీస్ తో ప్రేక్షకులను అలరించిన విషయం తెలిసిందే. నీ కోసం , ఢీ , దూకుడు మూవీస్ కు బెస్ట్ స్క్రీన్ ప్లే రైటర్ గా శ్రీను వైట్ల నంది అవార్డ్స్ అందుకున్నారు. దూకుడు మూవీ కి బెస్ట్ డైరెక్టర్ గా ఫిల్మ్ ఫేర్ అవార్డ్ అందుకున్నారు. శ్రీను వైట్ల దర్శకత్వంలో తెరకెక్కిన ఆగడు , బ్రూస్ లీ , మిస్టర్ , అమర్ అక్బర్ ఆంథోనీ మూవీస్ పరాజయం పాలయ్యాయి.

రామ్ లీలా మైదానం లో రావణ దహనం చేసిన ప్రభాస్
ఢిల్లీ లోని రామ్‌లీలా మైదానంలో విజయదశమి వేడుకలు చాలా ఘనంగా జరుగుతాయన్న విషయం తెలిసిందే. అయితే కొవిడ్ కారణంగా గత రెండేళ్లుగా ఈ రావణ దహనం కార్యక్రమం జరగలేదు. ఈ సంవత్సరం రామ్ లీలా మైదానం లో రావణ దహన కార్యక్రమానికి పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ముఖ్య అతిథి గా పాల్గొన్నారు. దసరా పర్వదినం సందర్భంగా రామ్ లీలా మైదానం లో రావణ దహనం చేశారు. విల్లు ఎక్కిపెట్టి రావణాసురుడి బొమ్మను ప్రభాస్ భస్మం చేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రభాస్ నుచూసేందుకు వేలాది మందిగా అభిమానులు మైదానం వద్దకు చేరుకున్నారు.

ప్రపంచవ్యాప్తంగా మొదటి రోజు 38 కోట్లు కలెక్ట్ చేసిన గాడ్ ఫాదర్
కొణిదెల ప్రొడక్షన్స్ , మెగా సూపర్ గుడ్ ఫిల్మ్స్ , ఎన్ వి ఆర్ ఫిల్మ్స్ బ్యానర్స్ పై తమిళ దర్శకుడు మోహన్ రాజా దర్శకత్వంలో చిరంజీవి హీరోగా సూపర్ హిట్ లూసిఫర్ మలయాళ మూవీ తెలుగు రీమేక్ గా తెరకెక్కిన గాడ్ ఫాదర్ మూవీ దసరా పండగ కానుకగా అక్టోబర్ 5వ తేదీ రిలీజ్ అయ్యి ఘనవిజయం సాధించింది. .ఈ పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్ మూవీ లో లేడీ సూపర్ స్టార్ నయనతార ఒక కీలక పాత్రలో, సత్యదేవ్, అనసూయ, దర్శకుడు పూరి జగన్నాథ్ ముఖ్య పాత్రలలో నటించారు. బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ అతిథి పాత్రలో నటించారు. థమన్ ఎస్ సంగీతం అందించారు.

జపాన్ లో యంగ్ టైగర్ ఎన్టీఆర్ క్రేజ్
డివివి ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై స్టార్ డైరెక్టర్ రాజమౌళి దర్శకత్వంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ , అలియా భట్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ , ఒలీవియా మోరిస్ జంటలుగా భారీ బడ్జెట్ , భారీ తారాగణం తో తెరకెక్కిన హై ఎమోషనల్ యాక్షన్ ఎంటర్ టైనర్ రౌద్రం రణం రుధిరం మూవీ మార్చి 25 వ తేదీ ప్రపంచవ్యాప్తంగా సూపర్ హిట్ టాక్ సొంతం చేసుకుని అన్ని భాషలలోనూ భారీ కలెక్షన్స్ సాధించిన విషయం తెలిసిందే. ప్రపంచవ్యాప్తంగా ఈ మూవీ 1,130 కోట్ల రూపాయల కి పైగా గ్రాస్ కలెక్షన్స్ సాధించింది. ఆర్ ఆర్ ఆర్ మూవీ గ్లోబల్ గా ప్రేక్షకులకు రీచ్ అయ్యింది.

పొన్నియిన్ సెల్వన్ 1 మూవీ పై కమల్ హాసన్ ప్రశంసలు
మద్రాస్ టాకీస్ , లైకా ప్రొడక్షన్స్ బ్యానర్స్ పై పలు బ్లాక్ బస్టర్ మూవీస్ కు దర్శకత్వం వహించిన లెజెండరీ డైరెక్టర్ మణిరత్నం దర్శకత్వంలో కల్కి కృష్ణమూర్తి నవల ఆధారంగా హిస్టారికల్ డ్రామా పొన్నియిన్ సెల్వన్ తమిళ మూవీ రెండు భాగాలుగా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఈ మూవీ లో విక్రమ్ , కార్తీ , జయం రవి , ఐశ్వర్య రాయ్ , త్రిష , జయరామ్ , ప్రకాష్ రాజ్, పార్తీపన్, శరత్‌కుమార్, ప్రభులతో పాటు పలువురు నటీనటులు ముఖ్య పాత్రలలో నటించారు. ఆస్కార్ అవార్డ్ గ్రహీత ఏ ఆర్ రెహమాన్ సంగీతం అందించారు.పాన్ ఇండియా మూవీ గా రిలీజ్ అయిన పొన్నియిన్ సెల్వన్1 మూవీ కి ఆయా భాషల స్టార్ హీరోస్ వాయిస్ ఓవర్ ఇవ్వటం విశేషం.

ఆదిపురుష్ టీజర్ విమర్శలపై దర్శకుడు ఓం రౌత్ స్పందన
టి – సిరీస్ ,రెట్రో ఫైల్స్ బ్యానర్స్ పై సూపర్ హిట్ తానాజీ మూవీ ఫేమ్ ఓం రౌత్ దర్శకత్వంలో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా భారత చలన చిత్ర చరిత్ర లో అత్యధిక బడ్జెట్ తో, హాలీవుడ్ స్థాయి టెక్నాలజీ తో 3డి ఫార్మాట్ లో రామాయణం ఆధారంగా తెలుగు , హిందీ భాషలలో మైథలాజికల్ మూవీ గా తెరకెక్కుతున్న ఆదిపురుష్ మూవీ 2023 సంవత్సరం జనవరి 12వ తేదీ తెలుగు , హిందీ భాషలతో పాటు కన్నడ , తమిళ , మలయాళ భాష డబ్బింగ్ వెర్షన్స్ రిలీజ్ కానున్నాయి. హీరో ప్రభాస్ రాముడిగా నటిస్తున్న ఈ మూవీ లో సీతగా కృతి సనన్ , రావణుడిగా సైఫ్ అలీ ఖాన్ , లక్ష్మణుడిగా సన్నీసింగ్ నటిస్తున్నారు. హీరో ప్రభాస్ నటించిన ఫస్ట్ మైథలాజికల్ మూవీ ఆదిపురుష్…

ఆదిపురుష్ రిలీజ్ డేట్ పై మరోసారి క్లారిటీ
ఓం రౌత్ దర్శకత్వంలో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా వస్తున్న సినిమా ఆదిపురుష్. రామాయణం ఆధారంగా ఈసినిమాను తెరకెక్కిస్తున్నాడు ఓం రౌత్. ఈసినిమాలో ప్రభాస్ రాముడి పాత్రలో సైఫ్ అలీఖాన్ రావణాసురుడి పాత్రలో, సీత పాత్రలో కృతీసనన్ పాత్రలో నటిస్తుంది. ప్రస్తుతం అయితే ఈసినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులను జరుపుకుంటుంది. ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నఈసినిమా టీజర్ ఈనెల 2వ తేదీన రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే కదా. ఈ టీజర్ ప్రస్తుతం సూపర్ రెస్పాన్స్ ను సొంతం చేసుకుంటుంది. ప్రపంచ వ్యాప్తంగా పలు రికార్డులు క్రియేట్ చేస్తుంది. దీంతో ఈసినిమాపై అంచనాలు మరింత పెరిగాయి.

కన్ఫామ్.. రామ్ హీరోయిన్ గా శ్రీలీల
ఈ ఏడాది ది వారియర్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన రామ్ ఇప్పుడు మరో సినిమా చేయడానికి రెడీ అయిపోతున్నాడు. బోయపాటి శ్రీను-ఎనర్జిటిక్ హీరో రామ్ కాంబినేషన్ లో ఒక సినిమా వస్తున్న సంగతి తెలిసిందే కదా. మాస్ యాక్షన్ ఎంటర్ టైనర్ తెరకెక్కబోతున్న ఈసినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. ఈసినిమా ఇప్పటికే పూజా కార్యక్రమాలు పూర్తిచేసుకుంది కానీ సెట్స్ పైకి మాత్రం వెళ్లలేదు. రీసెంట్ గానే ఈసినిమా నుండి అప్ డేట్ ఇచ్చారు మేకర్స్. ఈసినిమా అప్ డేట్స్ ను దసరా నుండి స్టార్ట్ చేయనున్నట్టు తెలిపారు. ఇక చెప్పినట్టే క్రేజీ అప్ డేట్ ఇచ్చారు చిత్రబృందం.

ఆదిపురుష్ టీజర్-వరల్డ్ వైడ్ సూపర్ రెస్పాన్స్
లేట్ గా వచ్చినా కూడా రికార్డులు మాత్రం క్రియేట్ చేస్తాడు పాన్ ఇండియా స్టార్ ప్రభాస్. ఓం రౌత్ దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా వస్తున్న సినిమా ఆదిపురుష్. ఈసినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులను జరుపుకుంటున్న సంగతి కూడా తెలిసిందే. ఈసినిమాకు వీఎఫ్ఎక్స్ కీలకం కాబట్టి పోస్ట్ ప్రొడక్షన్ పనులకే ఎక్కువ టైమ్ పట్టనుంది. ఇక ఇదిలా ఉండగా ఇన్ని రోజులు ఎలాంటి అప్ డేట్ ఇవ్వని చిత్రయూనిట్ దసరా పండుగ సందర్భంగా ఈసినిమా టీజర్ ను రిలీజ్ చేసి ఫ్యాన్స్ కు ట్రీట్ ఇచ్చారు. ఇక ఈ టీజర్ సూపర్ రెస్పాన్స్ ను సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే కదా. ఇప్పటికీ వ్యూస్ ను సొంతంచేసుకుంటూనే ఉంది. అంతేకాదు నార్త్ లో ఈసినిమా టీజర్…

ఓరి దేవుడా మరో రోల్ రివీల్
ప్రస్తుతం ఉన్న యంగ్ హీరోల్లో ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా వచ్చిన హీరోలలో విశ్వక్ సేన్ కూడా ఒకరు. ఈ నగరానికి ఏమైంది మూవీ తో తెలుగు సినిమా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన విశ్వక్ సేన్ ఆసినిమాతో మంచి గుర్తింపు ను తెచ్చుకున్నాడు. ఇక ఆతరువాత ఫలక్ నుమా దాస్ సినిమాకు దర్శకత్వం వహించి హీరోగా కూడా నటించి ఆ సినిమాతో ఒక్కసారి మాస్ ఆడియన్స్ కు బాగా కనెక్ట్ అయి యూత్ లో కూడా మంచి క్రేజ్ ను సొంతం చేసుకున్నాడు. ఆ తరువాత పలు సినిమాల ద్వారా ప్రేక్షకులను అలరిస్తూ వస్తున్నాడు. తాజాగా విశ్వక్ సేన్ 'ఓరి దేవుడా' అనే మూవీ లో హీరో గా నటిస్తున్న విషయం మన అందరికీ తెలిసిందే.

ధనుష్-శేఖర్ కమ్ముల మూవీ క్రేజీ అప్ డేట్
ప్రస్తుతం తమిళ్ హీరోలు కూడా డైరెక్ట్ గా తెలుగులో సినిమాలు చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్న సంగతి తెలిసిందే. ఇక అందులో విలక్షణ నటుడు ధనుష్ కూడా ఉన్నాడు. ఇప్పటికే ధనుష్ సార్ అనే సినిమా చేస్తున్నాడు. వెంకీ అట్లూరీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈసినిమాప్రస్తుతం షూటింగ్ పూర్తిచేసుకునే పనిలో ఉంది. ఇప్పటికే ఈసినిమా నుండి టీజర్ కూడా రిలీజ్ చేసేశారు కూడా. ఈ సినిమాలో సంయుక్త హీరోయిన్ గా నటిస్తుంది. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్ లపై ఈసినిమాను నిర్మిస్తున్నారు.

మరో రేర్ ఫీట్ అందుకున్న విక్రమ్
లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో కమల్ హాసన్ హీరోగా వచ్చిన సినిమా విక్రమ్. ఎన్నో అంచనాల మధ్య జులై3వ తేదీన రిలీజ్ అయిన ఈసినిమా బ్లాక్ బస్టర్ హిట్ కొట్టింది. ఇక ఈసినిమా కమల్ కెరీర్ బెస్ట్ హిట్ ను అందిచడమే కాదు.. తమిళంలో ‘బాహుబలి-2’ రికార్డును బ్రేక్ చేసి కోలీవుడ్ లో ఆల్ టైం ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది. అంతేకాదు కలెక్షన్స్ విషయంలో ఈసినిమా సాలిడ్ కలెక్షన్స్ ను అందించింది. దాదాపు 500 కోట్లకు పైగా కలెక్షన్స్ ను ఈసినిమా సాధించింది. ఇక తెలుగులో కూడా ఈసినిమా మంచి కలెక్షన్స్ అందించింది.

దసరా ధూమ్ ధామ్ దోస్తాన్ సాంగ్ రిలీజ్
ఈమధ్య హీరోలు విభిన్నమైన పాత్రలు చేయడానికి ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. రొటీన్ గా కమర్షియల్ సినిమాలకు మాత్రమే పరిమితం కాకుండా తమను విభిన్నమైన పాత్రల ద్వారా ఆవిష్కరించుకోవడానికి ముందుకొస్తున్నారు. ఇక అలాంటి ప్రయోగాలు చేయడానికి ఏమాత్రం వెనుకాడని హీరోల్లో నాని కూడా ఒకరు. విభిన్నమైన సినిమాలు చేసుకుంటూ కెరీర్ లో దూసుకుపోతున్నాడు న్యాచురల్ స్టార్ నాని. ఈ ఏడాది అంటే సుందరానికి సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చి ఆ సినిమాతో డీసెంట్ హిట్ ను అందుకున్నాడు.

డీజే టిల్లు 2 హీరోయిన్ పై సిద్దూ క్లారిటీ
కొన్ని సినిమాలు ఎలాంటి అంచనాలు లేకండా వచ్చి బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ కొట్టిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. అలాంటి సినిమాల్లో ఈమధ్య కాలంలో వచ్చిన డీజే టిల్లు సినిమా కూడా ఒకటి. విమల్ కృష్ణ దర్శకత్వంలో యంగ్ హీరో సిద్దు జొన్నలగడ్డ, నేహా శెట్టి హీరో హీరోయిన్లుగా తెరకెక్కిన సినిమా డీజే టిల్లు. ఈసినిమా ఫిబ్రవరి 12వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇక చిన్న సినిమాగా వచ్చిన ఈసినిమా పెద్ద హిట్ అయింది. కలెక్షన్ల పరంగా కూడా సాలిడ్ కలెక్షన్స్ ను సొంతం చేసుకుంది. ముఖ్యంగా సిద్ద జొన్నలగడ్డ తన టైమింగ్ తో బాడీ లాంగ్వేజ్ తో అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు.

జిన్నా ట్రైలర్ రిలీజ్ డేట్ ఫిక్స్
మంచు విష్ణు చివరిగా మోసగాళ్లు అనే సినిమాతో ప్రేక్షకులను అలరించాడు. అయితే ఈసినిమా విష్ణు కు ఆశించినంత ఫలితాన్ని అయితే అందించలేకపోయింది. ఇక ఇప్పుడు చాలా గ్యాప్ తరువాత మరో సినమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. ఆసినిమానే జిన్నా. ఈషాన్ సూర్య దర్శకత్వంలో వస్తున్న ఈసినిమాలో విష్ణు గాలి నాగేశ్వర్రావు అనే పాత్రలో నటిస్తున్నాడు. ఈసినిమా కామెడీ ఎంటర్ టైనర్ గా తెరకెక్కుతుందని ఇప్పటికే రిలీజ్ అయిన గ్లింప్స్, టీజర్ ను బట్టి అర్థమవుతుంది. అంతేకాదు ఆ అప్ డేట్స్ అన్నీ సినిమాపై మంచి అంచనాలను క్రియేట్ చేశాయి.

హీరో ప్రభాస్ తో మరో సినిమా అనౌన్స్ చేసిన టి - సిరీస్ సంస్థ అధినేత
టి – సిరీస్ ,రెట్రో ఫైల్స్ బ్యానర్స్ పై సూపర్ హిట్ తానాజీ మూవీ ఫేమ్ ఓం రౌత్ దర్శకత్వంలో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా భారత చలన చిత్ర చరిత్ర లో అత్యధిక బడ్జెట్ తో, హాలీవుడ్ స్థాయి టెక్నాలజీ తో 3డి ఫార్మాట్ లో రామాయణం ఆధారంగా తెలుగు , హిందీ భాషలలో మైథలాజికల్ మూవీ గా తెరకెక్కుతున్న ఆదిపురుష్ మూవీ 2023 సంవత్సరం జనవరి 12వ తేదీ తెలుగు , హిందీ భాషలతో పాటు కన్నడ , తమిళ , మలయాళ భాష డబ్బింగ్ వెర్షన్స్ రిలీజ్ కానున్నాయి. అక్టోబర్ 2వ తేదీ అయోధ్యలో ఆదిపురుష్ మూవీ టీజర్ రిలీజ్ ఈవెంట్‌ను మేకర్స్ గ్రాండ్‌గా నిర్వహించిన విషయం తెలిసిందే.

హరి హర వీరమల్లు మూవీ న్యూ రిలీజ్ డేట్?
బ్లాక్ బస్టర్ భీమ్లా నాయక్ మూవీ లో అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి ప్రేక్షకులను అలరించిన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఇప్పుడు ఒక పీరియాడికల్ యాక్షన్ ఎంటర్ టైనర్ తో అలరించనున్నారు. మెగా సూర్య ప్రొడక్షన్ బ్యానర్‌పై క్రియేటివ్ డైరెక్టర్ క్రిష్ దర్శకత్వంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా 17వ శతాబ్దం నాటి మొఘలాయిలు, కుతుబ్ షాహీల కాలం నేపథ్యంలో భారీ సెట్స్ , భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న పీరియాడికల్ యాక్షన్ అడ్వెంచర్ హరి హర వీరమల్లు పాన్ ఇండియా మూవీ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. నిధి అగర్వాల్ , నర్గీస్ ఫక్రి కథానాయికలు. కీరవాణి సంగీతం అందిస్తున్నారు.చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన పోస్టర్స్ ప్రేక్షకులను…

RAPO 20 దసరా నుండి సందడి షురూ
మాస్ యాక్షన్ ఎంటర్ టైనర్ లు తెరకెక్కించడంలో బోయపాటి శ్రీను ఎంత స్పెషలిస్టో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. మరి అలాంటి డైరెక్టర్ కు ఎనర్జిటిక్ హీరో రామ్ దొరికితే ఆ కాంబినేషన్ పై ఎలాంటి క్రేజ్ ఉంటుందో. ఈసినిమాను ఎప్పుడో ప్రకటించారు..ఈసినిమా పూజా కార్యక్రమాలు కూడా ఎప్పుడో జరిగిపోయాయి. కానీ షూటింగ్ మాత్రం ఇంతవరకూ మొదలుపెట్టలేదు. మరోవైపు వీరిద్దరి కాంబినేషన్ లో సినిమా ఎప్పుడు మొదలవుతుందా అని ఆసక్తికరంగా ఎదురుచూస్తున్నారు ఫ్యాన్స్.