టి – సిరీస్ ,రెట్రో ఫైల్స్ బ్యానర్స్ పై సూపర్ హిట్ తానాజీ మూవీ ఫేమ్ ఓం రౌత్ దర్శకత్వంలో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా భారత చలన చిత్ర చరిత్ర లో అత్యధిక బడ్జెట్ తో, హాలీవుడ్ స్థాయి టెక్నాలజీ తో 3డి ఫార్మాట్ లో రామాయణం ఆధారంగా తెలుగు , హిందీ భాషలలో మైథలాజికల్ మూవీ గా తెరకెక్కుతున్న ఆదిపురుష్ మూవీ 2023 సంవత్సరం జనవరి 12వ తేదీ తెలుగు , హిందీ భాషలతో పాటు కన్నడ , తమిళ , మలయాళ భాష డబ్బింగ్ వెర్షన్స్ రిలీజ్ కానున్నాయి. హీరో ప్రభాస్ రాముడిగా నటిస్తున్న ఈ మూవీ లో సీతగా కృతి సనన్ , రావణుడిగా సైఫ్ అలీ ఖాన్ , లక్ష్మణుడిగా సన్నీసింగ్ నటిస్తున్నారు. హీరో ప్రభాస్ నటించిన ఫస్ట్ మైథలాజికల్ మూవీ ఆదిపురుష్ మూవీ ని పాన్ వరల్డ్ మూవీ గా రిలీజ్ చేయడానికి మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్టు సమాచారం.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
హీరో ప్రభాస్ రాముడిగా ఎంట్రీ , పవర్ ఫుల్ డైలాగ్స్ ,యాక్షన్ సీన్స్ తో విజువల్ వండర్ గా రూపొందిన టీజర్ ప్రేక్షక, అభిమానులను విశేషంగా ఆకట్టుకుని 24 గంటలలో 100 మిలియన్ వ్యూస్ కు పైగా రాబట్టి రికార్డ్ క్రియేట్ చేసింది. టీజర్ ను కొంతమంది ప్రేక్షకులు విమర్శించడంతో దర్శకుడు ఓం రౌత్ స్పందించారు. ఆదిపురుష్ ను థియేటర్స్ కోసం నిర్మించామనీ , మొబైల్ ఫోన్స్ కోసం కాదనీ , సినిమా హాల్స్‌లో వెండితెర పరిమాణాన్ని తగ్గించొచ్చు కానీ, ఆ పరిమాణాన్ని మొబైల్ స్క్రీన్ కోసం తగ్గించకూడదనీ , తనకు కనుక అవకాశం వస్తే యూట్యూబ్‌లో టీజర్‌ను ఎప్పటికీ రిలీజ్ చేయననీ , కానీ, ఎక్కువ మంది ప్రేక్షకులకు చేరువ కావాలనే ఉద్దేశ్యంతో టీజర్‌ను యూట్యూబ్‌లో విడుదల చేశామనీ దర్శకుడు ఓం రౌత్ తెలిపారు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: