
మద్రాస్ టాకీస్ , లైకా ప్రొడక్షన్స్ బ్యానర్స్ పై పలు బ్లాక్ బస్టర్ మూవీస్ కు దర్శకత్వం వహించిన లెజెండరీ డైరెక్టర్ మణిరత్నం దర్శకత్వంలో కల్కి కృష్ణమూర్తి నవల ఆధారంగా హిస్టారికల్ డ్రామా పొన్నియిన్ సెల్వన్ తమిళ మూవీ రెండు భాగాలుగా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఈ మూవీ లో విక్రమ్ , కార్తీ , జయం రవి , ఐశ్వర్య రాయ్ , త్రిష , జయరామ్ , ప్రకాష్ రాజ్, పార్తీపన్, శరత్‌కుమార్, ప్రభులతో పాటు పలువురు నటీనటులు ముఖ్య పాత్రలలో నటించారు. ఆస్కార్ అవార్డ్ గ్రహీత ఏ ఆర్ రెహమాన్ సంగీతం అందించారు.పాన్ ఇండియా మూవీ గా రిలీజ్ అయిన పొన్నియిన్ సెల్వన్1 మూవీ కి ఆయా భాషల స్టార్ హీరోస్ వాయిస్ ఓవర్ ఇవ్వటం విశేషం.
సుమారు 500 కోట్ల భారీ బడ్జెట్, భారీ తారాగణంతో దర్శకుడు మణిరత్నం డ్రీమ్ ప్రాజెక్ట్ గా తెరకెక్కుతున్న పొన్నియిన్ సెల్వన్ మూవీ ఫస్ట్ పార్ట్ పొన్నియిన్ సెల్వన్ 1 మూవీ సెప్టెంబర్ 30 వ తేదీ గ్రాండ్ గా రిలీజ్ అయ్యి భారీ కలెక్షన్స్ రాబట్టి ప్రపంచవ్యాప్తంగా 300 కోట్ల క్లబ్ దిశగా దూసుకుపోతోంది. పొన్నియిన్ సెల్వన్ 1 మూవీ ని హీరోలు విక్రమ్ , కార్తి లతో వీక్షించిన కమల్ హాసన్ ఆ మూవీ పై ప్రశంసలు కురిపించారు. ఆ మూవీ టీమ్ మొత్తానికి కమల్ అభినందలు తెలిపారు.







