డివివి ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై స్టార్ డైరెక్టర్ రాజమౌళి దర్శకత్వంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ , అలియా భట్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ , ఒలీవియా మోరిస్ జంటలుగా భారీ బడ్జెట్ , భారీ తారాగణం తో తెరకెక్కిన హై ఎమోషనల్ యాక్షన్ ఎంటర్ టైనర్ రౌద్రం రణం రుధిరం మూవీ మార్చి 25 వ తేదీ ప్రపంచవ్యాప్తంగా సూపర్ హిట్ టాక్ సొంతం చేసుకుని అన్ని భాషలలోనూ భారీ కలెక్షన్స్ సాధించిన విషయం తెలిసిందే. ప్రపంచవ్యాప్తంగా ఈ మూవీ 1,130 కోట్ల రూపాయల కి పైగా గ్రాస్ కలెక్షన్స్ సాధించింది. ఆర్ ఆర్ ఆర్ మూవీ గ్లోబల్ గా ప్రేక్షకులకు రీచ్ అయ్యింది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
View this post on Instagram
అల్లూరి సీతారామరాజుగా రామ్ చరణ్ , కొమురం భీమ్ గా ఎన్టీఆర్ అద్భుతంగా పెర్ఫార్మ్ చేసిన ఆర్ ఆర్ ఆర్ మూవీపై హాలీవుడ్ రైటర్స్ , డైరెక్టర్స్ ప్రశంసలు కురిపిస్తున్న విషయం తెలిసిందే. రిలీజ్ అయిన అన్ని చోట్ల ఘన విజయం సాధించిన ఆర్ ఆర్ ఆర్ మూవీ జపనీస్ వెర్షన్ అక్టోబర్ 21న గ్రాండ్ గా రిలీజ్ కానుంది. జపనీస్ వెర్షన్ కు చెందిన ఆర్ ఆర్ ఆర్ మూవీ పోస్టర్ ప్రేక్షకులను ఆకట్టుకుని సోషల్ మీడియా లో వైరల్ గా మారింది. ఈ మూవీ లో అద్భుతంగా పెర్ఫార్మ్ చేసిన ఎన్టీఆర్ పై దేశ , విదేశాలలో క్రేజ్ పెరిగింది. తాజాగా హీరో ఎన్టీఆర్ జపాన్ మీడియా కు ఇంటర్వ్యూ ఇచ్చిన తన ఫోటోను ఇన్ స్టా గ్రామ్ లో షేర్ చేయగా వైరల్ గా మారింది.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: