దళపతి విజయ్ కధానాయకుడిగా వంశీ పైడిపల్లి దర్శకత్వంలో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై ప్రముఖ నిర్మాతలు దిల్ రాజు, శిరీష్, పీవీపీ బ్యానర్ పై పరమ్ వి పొట్లూరి, పెరల్ వి పొట్లూరి సంయుక్తంగా నిర్మిస్తున్న ప్రతిష్టాత్మక చిత్రం ‘వారసుడు‘. తమిళ్ లో వారిసు అనే టైటిల్ తో ప్రేక్షకుల ముందుకు వస్తుంది. ప్రస్తుతం ఈసినిమా చెన్నైలో షూటింగ్ జరుపుకుంటుంది. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన పది స్టిల్స్ ఒకేసారి విడుదల చేశారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో ‘వారసుడు’ స్టిల్స్ వైరల్ గా మారాయి. వారసుడులో విజయ్ కొత్త లుక్స్ కి ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు. విజయ్ తో పాటు రష్మిక, ఖుష్బూ కూడా కొత్త లుక్స్ లో కనిపించారు. అలాగే విజయ్, వెటరన్ హీరోయిన్ జయసుధ, దర్శకుడు వంశీ పైడిపల్లి షూటింగ్ లొకేషన్ వర్కింగ్ స్టిల్స్ కూడా ఆకట్టుకున్నాయి.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
కాగా పూర్తిస్థాయి ఎంటర్ టైనర్‌గా రూపొందించబడిన ఈ చిత్రంలో నేషనల్ క్రష్ రష్మిక మందన్న కథానాయిక. ప్రభు, శరత్ కుమార్, ప్రకాష్ రాజ్, జయసుధ, శ్రీకాంత్, షామ్, యోగి బాబు, సంగీత, సంయుక్త ఈ సినిమాలో కీలక పాత్రల్లో నటిస్తున్నారు. భారీ నిర్మాణ విలువలతో లావిష్ అండ్ విజువల్ గ్రాండియర్ తెరకెక్కుతున్న ఈ చిత్రానికి అత్యున్నత స్థాయి సాంకేతిక నిపుణులు పనిచేస్తున్నారు. ఈ చిత్రానికి వంశీ పైడిపల్లితో పాటు హరి, అహిషోర్ సాల్మన్ కథ, స్క్రీన్ ప్లేను అందించారు. సెన్సేషనల్ మ్యూజిక్ డైరెక్టర్ థమన్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తుండగా, కార్తీక్ పళని సినిమాటోగ్రాఫర్ గా, కెఎల్ ప్రవీణ్ ఎడిటర్ గా, శ్రీ హర్షిత్ రెడ్డి, శ్రీ హన్షిత సహ నిర్మాతలుగా, సునీల్ బాబు, వైష్ణవి రెడ్డి ప్రొడక్షన్ డిజైనర్లుగా పని చేస్తున్నారు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: