కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
వెనక్కి

Telugu Film News 2021

ట్యాగ్ · 2112 కథనాలు · పేజీ 80

సినిమా వార్తలు

విక్ట‌రీ వెంకటేష్ దృశ్యం 2 ప్రారంభం

విక్ట‌రీ వెంకటేష్‌, మీనా జంటగా న‌టించిన `దృశ్యం` సినిమా ఎంత పెద్ద బ్లాక్ బ‌స్ట‌ర్ అయిందో అందరికీ తెలిసిందే. మ‌ళ్లీ విక్ట‌రి వెంక‌టేష్‌, మీనా జంట‌గా దృశ్యం సినిమాకి సీక్వెల్‌గా `దృశ్యం 2` వ‌స్తోంది. దృశ్యం, దృశ్యం 2 ఒరిజిన‌ల్ మ‌ళ‌యాల వెర్ష‌న్ డైరెక్ట్ చేసిన జీతు జోసెఫ్ ఈ మూవీతో తెలుగు ప‌రిశ్ర‌మ‌కి ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌య‌మ‌వుతున్నారు. సురేష్ ప్రొడ‌క్ష‌న్స్ ప్రై.లి, ఆశిర్వాద్ సినిమాస్‌, రాజ్‌కుమార్ థియేట‌ర్ ప్రై.లి ప‌తాకాల‌పై డి. సురేష్‌బాబు, ఆంటోని పెరుంబ‌వూర్‌, రాజ్‌కుమార్ సేతుప‌తి నిర్మిస్తున్నారు. ఈ మూవీ హైద‌రాబాద్ రామానాయుడు స్టూడియోస్‌లో పూజా కార్యక్రమాల‌తో ప్రారంభ‌మైంది. విక్ట‌రి…

Team TFNవాట్సాప్
సినిమా వార్తలు

ఏప్రిల్ 2న రియలిస్టిక్ ఇన్సిడెంట్స్ తో వైల్డ్ డాగ్

కింగ్ నాగార్జున దియా మీర్జా, సయామీ కేర్, అతుల్ కులకర్ణి, ఆలీ రెజా, బిలాల్ హుస్సేన్, ప్రకాష్ సుదర్శన్, మయాంక్ ప్రకాష్, రుద్ర ప్రదీప్, అనీష్ కురువిళ్ళ, కెసి శంకర్, షవ్వార్ అలీ,అవిజిత్ దత్ ముఖ్య పాత్రధారులుగా మాట్నీ ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై అహిషోర్ సొలోమన్ దర్శకత్వంలో నిరంజన్ రెడ్డి, అన్వేష్ రెడ్డి నిర్మించిన చిత్రం వైల్డ్ డాగ్. రియలిస్టిక్ ఇన్సిడెంట్స్ తో రూపొందిన ఈ చిత్రం సమ్మర్ కానుకగా ఏప్రిల్ 2న వరల్డ్ వైడ్ గా గ్రాండ్ రిలీజ్ కానుంది. ఈ సందర్బంగా చిత్ర యూనిట్ పాత్రికేయుల సమావేశాన్ని ఏర్పాటు చేశారు.. ఈ కార్యక్రమంలో కింగ్ నాగార్జున, నటులు ఆలీ రెజా, బిలాల్ హుస్సేన్, ప్రకాష్ సుదర్శన్, మయాంక్…

Team TFNవాట్సాప్
సినిమా వార్తలు

'బాహుబలి'ని తలపిస్తున్నయష్ 'గజకేసరి'

ఒకప్పుడు కన్నడ సినిమాలకు తెలుగులో పెద్దగా మార్కెట్ ఉండేది కాదు. అయితే కె.జి.యఫ్ పుణ్యమా అని అక్కడ సినిమాలను ఇక్కడ కూడా రిలీజ్ చేసి మార్కెట్ పెంచుకుందామనుకుంటున్నారు కన్నడ దర్శక నిర్మాతలు. నిజానికి కె.జి.యఫ్ తప్పా ఆ తర్వాత వచ్చిన సినిమాలేవి అంతగా ఆడిన దాఖలాలేవి లేవు.

TFN Adminవాట్సాప్
సినిమా వార్తలు

ఆచార్య 'సిద్ధ'మవుతున్నాడు

కొరటాల దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి హీరోగా ఆచార్య సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఇక ఈ సినిమాలో చిరు తనయుడు చెర్రీ కూడా నటిస్తుండతంతో ఈసినిమాపై క్రేజ్ ఇంకా పెరిగింది. ప్రస్తుతం సినిమా మారేడు మిల్లిలోని అటవీ ప్రాంతంలో శరవేగంగా చిత్రీకరణను జరుపుకుంటోంది. చిరంజీవి, చరణ్‌ల మధ్య సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. ఇప్పటికే ఈ షెడ్యూల్‌కు సంబంధించిన కొన్ని ఫొటోలు సోషల్ మీడియాలో ద్వారా బయటకు వచ్చిన సంగతి కూడా తెలిసిందే.

TFN Adminవాట్సాప్
సినిమా వార్తలు

'HIT' సీక్వెల్ కన్ఫామ్ చేసిన నాని

శైలేష్ కొలను దర్శకత్వంలో "ఫలక్ నుమా దాస్" మూవీ ఫేమ్ విశ్వక్ సేన్ హీరోగా తెరకెక్కిన సినిమా "HIT". సస్పెన్స్ థ్రిల్లర్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమా సూపర్ హిట్ అయింది. ఓ కిడ్నాప్ కేసు ఇన్వెస్టిగేషన్ స్టొరీగా హిట్ మూవీని తెరకెక్కించారు. ఈ సినిమాను.. హీరో నాని స్వంత ప్రొడక్షన్ హౌస్ వాల్ పోస్టర్ సినిమా బ్యానర్ పై నాని, ప్రశాంతి తిపిర్నేని కలిసి సంయుక్తంగా నిర్మించారు.

TFN Adminవాట్సాప్
ట్రైలర్ & టీజర్

'ఒక మంచి రోజు చూసి చెప్తా' టీజర్ రిలీజ్

విజయ్ సేతుపతి, నిహారిక ప్రధాన పాత్రల్లో ఆరుముగా కుమార్ దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘ఓరు నల్ల నాల్ పాతు సోలరెన్’. 2018 ఫిబ్రవరిలో విడుదలైన ఈ చిత్రం విజయవంతం అయ్యింది. మూడేళ్ల తరవాత ఇప్పుడు ఈ చిత్రాన్ని తెలుగులో ‘ఓ మంచి రోజు చూసి చెప్తా’ అనే టైటిల్‌తో విడుదల చేస్తున్నారు. నిహారిక పెళ్లికి ముందే నటించిన సినిమా అయినప్పటికీ తెలుగులో ఆలస్యంగా థియేటర్లలోకి వస్తోంది.

TFN Adminవాట్సాప్
ట్రైలర్ & టీజర్

రెండు రోజుల్లో 'అరణ్య' ట్రైలర్

ప్రభు సోలమన్ దర్శకత్వంలో రానా దగ్గుబాటి, జోయా హుస్సేన్ జంటగా "హాథీ మేరే సాథీ " అనే సినిమా వస్తున్న సంగతి తెలిసిందే. తెలుగులో 'అరణ్య', తమిళ్‌లో కదన్ పేరుతో ఈ సినిమా రిలీజ్ కానుంది. ప్రస్తుతం ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటుంది. ఇక ఇటీవలే ఈ సినిమా రిలీజ్ డేట్ కూడా ప్రకటించారు. ఇప్పుడు ఈ సినిమా రిలీజ్ డేట్ ను ఫిక్స్ చేశారు చిత్రయూనిట్. మార్చి 26వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది.

TFN Adminవాట్సాప్
ట్రైలర్ & టీజర్

రాజ్ తరుణ్ 'పవర్ ప్లే' ట్రైలర్ రిలీజ్

టాలీవుడ్ లో మంచి హిట్ కోసం ఎదురు చూసే హీరోల్లో రాజ్ తరుణ్ కూడా ఒకడు. రీసెంట్‌గా విజ‌య్ కుమార్ కొండా ద‌ర్శ‌క‌త్వంలో ఒరేయ్ బుజ్జిగా అనే చిత్రాన్ని చేశాడు. ఈ చిత్రం ఓటీటీలో రిలీజ్ అవ్వగా ఈ సినిమాకు కూడా మిశ్రమ ఫలితమే దక్కింది. . రాధామోహన్‌ నిర్మించగా, మాళవికానాయర్‌ కథానాయికగా నటించింది.

TFN Adminవాట్సాప్
రిలీజ్ అప్‌డేట్

'గుడ్ లక్ సఖి' రిలీజ్ డేట్ ఫిక్స్

మహానటి సినిమా తరువాత కీర్తి సురేష్ ఎక్కువగా మహిళా ప్రాధాన్యత ఉన్న సినిమాలే ఒప్పుకుంది. వీటిలో భాగంగానే ఇప్పటికే పెంగ్విన్, మిస్ ఇండియా సినిమాలు ఓటీటీలో రిలీజ్ అయ్యాయి. ఇప్పుడు న‌గేష్ కుకునూర్ దర్శకత్వంలో కీర్తిసురేష్ ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న సినిమా గుడ్ లక్ సఖి సినిమా. ఇక ఈ సినిమా కూడా ఎప్పుడో పూర్తి చేసుకుంది. ఈ సినిమాలో కీర్తి సురేష్ గ్రామీణ ప్రాంత యువ‌తిగా షూటర్ గా క‌నిపించనున్న విషయం తెలిసిందే. ఈ సినిమా టీజర్ ను కూడా ఎప్పుడో రిలీజ్ చేశారు.

TFN Adminవాట్సాప్
సినిమా వార్తలు

అప్పుడు రామయ్య.. ఇప్పుడు కృష్ణయ్య

గోదావరి యాసలో మాట్లాడుతూ.. ఓ వెరైటీ టోన్ తో తన టాలీవుడ్ లో స్టార్ కమెడియన్ గా ఎదిగాడు సునీల్.ఆ తరువాత అందాల రాముడు సినిమాలో హీరోగా ఎంట్రీ ఇచ్చి అది కాస్త హిట్ అవ్వడంతో హీరోగానే ఫోకస్ పెట్టాడు. ఆ తరువాత వచ్చిన మర్వాద రామన్న సినిమా ఇంకా సక్సెస్ అవ్వడంతో పూర్తిగా కామెడీ రోల్స్ కు గుడ్ బై చెప్పి సినిమాలే చేసుకుంటూ వెళ్లాడు. కానీ ఆ తర్వాత వచ్చిన సినిమాలేవీ పెద్దగా సక్సెస్ ను అందించలేకపోయాయి. ఆ తర్వాత మళ్లీ అరవింద సమేత నుండి పలు సినిమాల్లో కామెడీ పాత్రలతో పాటు కీలక పాత్రలు నటిస్తున్నాడు.

TFN Adminవాట్సాప్
రిలీజ్ అప్‌డేట్

'సలార్' రిలీజ్ డేట్ ఫిక్స్

ఇప్పుడు ప్రభాస్ చేస్తున్న సినిమాలన్నీ పాన్ ఇండియా సినిమాలే.. జిల్ ఫేమ్ రాధాకృష్ణ దర్శకత్వంలో రాధేశ్యామ్, నాగ్ అశ్విన్ తో ఒక సినిమా, తానాజీ ఫేమ్ ఓం రౌత్ దర్శకత్వంలో ఆదిపురుష్, ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో సలార్ సినిమాలు చేస్తున్నాడు. ఒక్క నాగ్ అశ్విన్ తో సినిమా తప్పంచి మిగిలిన మూడు సినిమాలు కూడా షూటింగ్ జరుపుకుంటున్నాయి.

TFN Adminవాట్సాప్
Pawan Kalyan And Krish Upcoming Movie In 2022 Sankranthi Movie Race,Telugu Filmnagar,Telugu Film News 2021,Tollywood Movie Updates,Power Star Pawan Kalyan,Pawan Kalyan,Krish,Director Krish,Pawan Kalyan And Krish Upcoming Movie,Pawan Kalyan And Krish
సినిమా వార్తలు

2022 పొంగల్ పోరులో పవన్-క్రిష్ సినిమా

వేణు శ్రీరామ్ దర్శకత్వంలో పవన్ హిందీలో సూపర్ హిట్ కొట్టిన పింక్ రీమేక్ ను తెలుగులో 'వకీల్ సాబ్' సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఇక ప్రస్తుతం వకీల్ సాబ్ రిలీజ్ కు సిద్దంగా ఉంది. మరోవైపు అజ్ఞాతవాసి సినిమా తరువాత పవన్ ను వెండితెరపై చూసే అవకాశం రాకపోవడంతో ఫ్యాన్స్ ఎప్పుడెప్పడు వకీల్ సాబ్ రిలీజ్ అవుతుందా.. ఎప్పుడెప్పుడు తమ హీరోని స్క్రీన్ పై చూడాలా అని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఫైనల్లీ ఈ చిత్రం 9 ఏప్రిల్ 2021 న తెరపైకి వస్తోంది.

TFN Adminవాట్సాప్
Anchor Anasuya Shares Glimpse Of Her Latest Song Paina Pataaram From Chavu Kaburu Challaga Movie On Twitter,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2021,Tollywood Movie Updates,Anchor Anasuya,Anasuya,Anasuya Movies,Anasuya New Mov
ట్రైలర్ & టీజర్

'చావు కబురు చల్లగా'-అనసూయ 'పైన పటారం'

కార్తికేయ కౌశిక్ పెగళ్ళపాటి దర్శకత్వంలో 'చావు కబురు చల్లగా' సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఇక ఈసినిమాలో బస్తీ బాలరాజుగా ఒక పవర్ ఫుల్ మాస్ క్యారెక్టర్ లో కార్తికేయ నటిస్తున్నాడు. ఇప్పటికే ఈ చిత్రానికి సంబంధించి విడుదలైన హీరో, హీరోయిన్‌ల లుక్స్‌, 'బస్తీ బాలరాజు' క్యారెక్టర్‌ వీడియోకు మంచి రెస్పాన్స్ వచ్చింది.

TFN Adminవాట్సాప్
Niharika Konidela Starrer O Manchi Roju Choosi Chepta Movie Is All Set To Release In March,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2021,Tollywood Movie Updates,O Manchi Roju Chusi Chepta,O Manchi Roju Chusi Chepta Movie,O Manchi R
సినిమా వార్తలు

ఓ మంచి రోజు చూసి చెప్తా' అంటున్న నిహారిక

ఒక మ‌న‌సు చిత్రంతో వెండితెర ఆరంగేట్రం చేసిననిహారిక ఆసినిమాలో తన నటనతో మంచి పేరే సంపాదించుకుంది. ఆ తరువాత హ్యాపీ వెడ్డింగ్, ప్ర‌ణీత్ దర్శకత్వంలో సూర్యకాంతం, తమిళ్ లో ఒక సినిమా చేసింది. ఈ రెండు సినిమాలు కూడా నిహారికకు విజయం అందించలేకపోయాయి. అయితే సూర్యకాంతం సినిమాలో నిహారిక నటనకు మాత్రం అందరూ ఫిదా అయిపోయారు. ఇక ఆ సినిమా తర్వాత ఇప్పటి వరకూ మరే సినిమా చేయలేదు. అయితే గత ఏడాది సైరా చిత్రంలో చిన్న పాత్రలో కనిపించింది. ఇక ఇటీవలే నిహారిక చైతన్యను పెళ్లి చేసుకొని వివాహా జీవితాన్ని కొనసాగిస్తుంది.

TFN Adminవాట్సాప్
సినిమా వార్తలు

ఇంద్రగంటి-సుధీర్ బాబు సినిమా టైటిల్ అప్ డేట్

ఇంద్రగంటి మోహనకృష్ణ- సుధీర్ బాబు కాంబినేష‌న్ లో ఇప్పటికి రెండు సినిమాలు వచ్చిన సంగతి తెలసిందే. ఇప్పుడు ముచ్చటగా మూడోసారి వీరిద్దరి కాంబినేషన్ లో మరో సినిమా రాబోతుంది. ఇటీవలే ఈ సినిమాను లాంచ్ చేశారు కూడా.

TFN Adminవాట్సాప్
రిలీజ్ అప్‌డేట్

'దృశ్యం 3' వచ్చేది అప్పుడే

ఒక సినిమా హిట్ అయితే దానికి సీక్వెల్ లు ప్లాన్ చేస్తున్నారు ఈమధ్య. కొంతమంది అయితే సినిమా ఎండింగ్ లోనే చెప్పేస్తున్నారనుకోండి. లారెన్స్ ముని సినిమాను కాంచన 4 వరకూ లాగాడు. ఇక ఇప్పుడు దృశ్యం సినిమా కూడా ఆ కోవలోకే వెళుతుంది. జీతూజోసఫ్‌ దర్శకత్వంలో దృశ్యం, దృశ్యం 2 సినిమాలు రాగా ఇప్పుడు దృశ్యం3 కూడా రాబోతున్నట్టు తెలుస్తోంది.

TFN Adminవాట్సాప్
ట్రైలర్ & టీజర్

'గాలి సంపత్' ట్రైలర్ - కామెడీ, ఎమోషన్, థ్రిల్

అనీష్ కృష్ణ ద‌ర్శ‌క‌త్వంలో శ్రీ విష్ణు, ల‌వ్‌లీ సింగ్ హీరోహీరోయిన్లుగా తెరకెక్కిన సినిమా గాలి సంపత్. బ్లాక్ బ‌స్టర్ డైరెక్టర్ అనిల్ రావిపూడి స‌మ‌ర్పించడమే కాదు.. స్క్రీన్‌ప్లే, ద‌ర్శక‌త్వ ప‌ర్యవేక్షణ కూడా చేస్తుండ‌డం విశేషం. మార్చి 11న మ‌హాశివ‌రాత్రి సందర్భంగా ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ చేయనున్నారు. ప్రస్తుతం ప్రమోషన్ కార్యక్రమాల్లో బిజీగా ఉంది చిత్రయూనిట్. ఇక తాజాగా ఈ సినిమా ట్రైలర్‌ను రిలీజ్ చేశారు చిత్రయూనిట్. దర్శకధీరుడు రాజమౌళి చేతుల మీదుగా ట్రైలర్ ను లాంచ్ చేశారు.

TFN Adminవాట్సాప్
ట్రైలర్ & టీజర్

'తెల్లవారితే గురువారం' టీజర్ రిలీజ్

మణికాంత్ గెల్లి దర్శకుడిగా పరిచయమవుతూ శ్రీ సింహా హీరోగా మిషా నారంగ్‌, చిత్రా శుక్లా హీరోయిన్లుగా తెరకెక్కుతున్న సినిమా 'తెల్లవారితే గురువారం'. ఇప్పటికే ఈ సినిమా నుండి ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారు చిత్రయూనిట్. ప్రస్తుతం ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటుంది. ఇటీవలే ఈ సినిమా రిలీజ్ డేట్ ను కూడా ఫిక్స్ చేశారు. మార్చి 27న ఈ చిత్రాన్ని విడుద‌ల చేయ‌నున్నట్టు అధికారికంగా ప్రకటించారు. ఇక తాజాగా ఈసినిమా టీజర్ ను రిలీజ్ చేశారు.

TFN Adminవాట్సాప్
Akshara Movie Review: Thought Provoking Film With A Powerful Message,Akshara Telugu Movie Review,Latest Telugu Movie Reviews,Telugu Film News 2021,Telugu Filmnagar,Tollywood Movie Updates,Akshara,Akshara Movie,Akshara Movie Public Response,Akshara Mo
రివ్యూ

'అక్షర' మూవీ రివ్యూ

ఫైనల్ గా సామాజిక బాధ్యత అంశంగా వచ్చే సినిమాలను ఆదరించే ప్రేక్షకులకు అక్షర సినిమా తప్పకుండా నచ్చుతుంది.

TFN Adminవాట్సాప్
రివ్యూ

'చెక్' రివ్యూ - మైండ్ గేమ్‌తో సాగే సస్పెన్స్ థ్రిల్లర్

ఫస్టాఫ్‌ అంతా ఎలాంటి ట్విస్ట్‌లను రివీల్‌ చేయకుండా నార‍్మల్‌గా నడిపించాడు. అసలు హీరో ఈ కేసులో ఎలా ఇరుక్కున్నాడో చెప్పకుండా ప్రేక్షకుడికి క్యూరియాసిటీని పెంచాడు. మంచి ట్విస్ట్ తో ఫస్ట్ హాఫ్ ముగిస్తాడు. ఇక సెకండాఫ్‌లో అసలు కథ మొదలవుతుంది. సెకండాఫ్‌లో కోర్టు, చెస్ ఆట, జైలులో గొడవలు ఇలా ట్విస్ట్ లతో సాగుతుంది. ఫైనల్ గా చెప్పాలంటే మైండ్ గేమ్‌తో సాగే సస్పెన్స్ థ్రిల్లర్ ఈ సినిమా ప్రతి ఒక్కరికీ నచ్చుతుందని చెప్పొచ్చు.

TFN Adminవాట్సాప్

షేర్