టాక్సీవాలా దర్శకుడు రాహుల్ సంకీర్త్యన్‌తో కలిసి నాని ‘శ్యామ్ సింగరాయ్’ అనే సినిమాను చేస్తున్న సంగతి తెలిసిందే కదా. ఈ టైటిల్ తోనే సినిమాపై మంచి బజ్ క్రియేట్ చేశారు. దానికితోడు ఇప్పటికే ఈసినిమాకు సంబంధించి టైటిల్, కాన్సెప్ట్ పోస్టర్ ను రిలీజ్ చేయగా వాటికి మంచి రెస్పాన్స్ వచ్చింది.నాని పుట్టిన రోజు సందర్భంగా ఇప్పటికే టక్ జగదీష్ సినిమా నుండి టీజర్ ను రిలీజ్ చేయగా ఇప్పుడు ‘శ్యామ్ సింగరాయ్’ నుండి ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేశారు. ఇక ఈ సినిమాలో ఇప్పటివరకూ చేయని అత్యంత ఆసక్తికర పాత్రను నాని చేస్తున్నాడు అని చిత్రయూనిట్ చెప్పినట్టే ఉంది ఫస్ట్ లుక్ ను చూస్తుంటే. ఈ సినిమా కోసం నాని కొత్తగా మేకోవర్ అయినట్టు అర్ధమవుతుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఈ ఫస్ట్ లుక్ పోస్టర్ లో నాని లుక్కు.. మీసకట్టు.. బ్యాక్ గ్రౌండ్ లో ఉన్న ‘రాయల్ ప్రెస్, కలకత్తా, ఇండియా’ ఇవన్నీ చూస్తూనే పోస్టర్‌లో బ్రిటిష్ ఇండియా కాలం గుర్తొస్తుంది. బ్రిటిష్ ఇండియా టైమ్‌లో భారతీయులు ఎలా ఉండేవారో నాని అచ్చం అలానే ఉన్నారు. అంతేకాకుండా నానిని ఒక అమ్మాయి చేతులు వెనుక నుంచి హత్తుకొని ఉంది. ఆ అమ్మాయి సాయిపల్లవిలా అనిపిస్తోంది.
Proudly Presenting & Royally Celebrating the First Look of our Natural 🌟@NameisNani ‘s #ShyamSinghaRoy 💥#HappyBirthdayNani ❤️ #SSRFirstLook 🔥 @Rahul_Sankrityn @Sai_Pallavi92 @IamKrithiShetty @MadonnaSebast14 @vboyanapalli @MickeyJMeyer @NeerajaKona @SVR4446 @NiharikaEnt pic.twitter.com/CVxYnlBJJK
— Niharika Entertainment (@NiharikaEnt) February 24, 2021
ఇంకా ఈ సినిమాలో రాహుల్ రవీంద్రన్, మురళీ శర్మ, అభినవ్ గోమటం కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ప్రస్తుతం ‘శ్యామ్ సింగ రాయ్’ టీమ్ కోల్‌కతాలో షూటింగ్ జరుపుకుంటుంది. నిహారిక ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై వెంకట్ ఎస్. బోయనపల్లి ఈ సినిమాను నిర్మిస్తున్నారు. మడోన్నా సెబాస్టియన్, రాహుల్ రవీంద్రన్, మురళీ శర్మ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. మిక్కీ జే మేయర్ మ్యూజిక్ డైరెక్టర్ కాగా.. సను జాన్ వర్ఘీస్ సినిమాటోగ్రాఫర్‌గా, నవీన్ నూలి ఎడిటర్‌గా పని చేస్తున్నారు.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: