‘ఆదిపురుష్’-అంత ఈజీ కాదు  

Rebel Star Prabhas Adipurush Is A Tough Movie To Make Says Director Om Raut,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2021,Tollywood Movie Updates,Latest Tollywood News,Director Om Raut,Om Raut,Prabhas,Rebel Star Prabhas,Actor Prabhas,Prabhas Adipurush,Adipurush Movie,Adipurush Film,Adipurush Telugu Movie,Adipurush Update,Adipurush Movie Latest News,Adipurush Movie Latest Updates,Prabhas Adipurush Update,Director Om Raut Latest Interview,Director Om Raut Says Adipurush Is A Tough Film To Make,Director Om Raut About Making Adipurush,Director Om Raut Spoke About Adipurush,Director Om Raut Adipurush,Director Om Raut New Movie,Adipurush Is A Tough Movie To Make Says Om Raut,Om Raut About Making Adipurush Movie,Om Raut Opened Up About Making Adipurush

మాములుగా ఒక సినిమా తీయాలంటేనే ఎంతో కష్టంతో కూడుకున్న పని.. ఒకవేళ తీసినా అది ఆడియన్స్ కు నచ్చుతుందో..లేదో అన్నది దర్శక నిర్మాతలకు పెద్ద టెన్షన్.. అలాంటిది పురాణాల ఆధారంగా తీసే సినిమాలకు ఇంకెంత టెన్షన్ ఉంటుంది. రామాయణం నేపథ్యంలో కాబట్టి కొంచం తేడా జరిగినా రచ్చ చేయడానికి వెయిట్ చేస్తుంటారు చాలా మంది. దీపికా పదుకొనె చేసిన పద్మావతి సినిమా విషయంలో ఎన్ని గొడవలు జరిగాయో చూశాం. ఆదిపురుష్ డైరెక్టర్ ఓం రౌత్ కూడా అదే చెపుతున్నాడు. ‘ఆదిపురుష్’ సినిమా తీయడం అంత ఈజీ కాదని. ఓం రౌత్ దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా మైథలాజికల్ నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే కదా. మరి ఇలాంటి సినిమాను తీయాలంటే ఎన్నో కాంప్లికేషన్స్ ను తట్టుకోవాల్సి వస్తుంది.

తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న ఓం రౌత్ కూడా రామాయణం ఆధారంగా ఈ కథను తీసుకొని దానిని సినిమా రూపంలో చూపించడం చాలా కష్టం. ప్రపంచంలో ఎంతో మంది ప్రజలు చూస్తారు.. వీటితో పాటు వీఎఫ్ఎక్స్ చేయడం అనేది మరో పెద్ద టాస్క్ అంటూ ఈ సినిమాకు ఎదుర్కోవాల్సిన ఛాలెంజెస్ గురించి చెప్పాడు.

కాగా 3డీ విజువ‌ల్ ఎఫెక్ట్స్ తో మైథిలాజికల్ సోషియో ఫాంటసీ ఎంటర్‌టైనర్‌గా రూపుదిద్దుకోనున్న ఈ సినిమాలో ప్రభాస్ రాముడి పాత్రలో కనిపించనుండగా.. రావణాసురిడిగా బాలీవుడ్ నటుడు సైఫ్ అలీ ఖాన్ కనిపించనున్నారు. మరో బాలీవుడ్ హీరో సన్నీ సింగ్ కూడా ఒక కీలక పాత్రలో నటిస్తున్నాడు. ఈ చిత్రాన్ని బాలీవుడ్ నిర్మాతలు భూషణ్ కుమార్, కృష్ణ కుమార్, ప్రసాద్ సుతార్, రాజేష్ నాయర్ భారీ బడ్జెట్‌తో అత్యంత ప్రతిష్టాత్మకంగా.. హిందీ, తెలుగు, కన్నడ, తమిళ్, మలయాళం భాషల్లో నిర్మించనున్నారు. ఆగ‌స్ట్ 11,2022న చిత్రాన్ని విడుద‌ల చేయ‌నున్న‌ట్టు  ఇప్పటికే ప్రకటించారు.

Subscribe to our Youtube Channel Telugu Filmnagar for the latest Tollywood updates.Download the My Mango App for more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here