ప్రస్తుతం వరుసగా స్టార్ హీరోల సినిమాలు నిర్మిస్తున్న దిల్ రాజు.. తాజాగా షాదీ ముబారక్ అంటూ ఒక చిన్న సినిమాతో వస్తున్నాడు. పద్మశ్రీ దర్శకత్వంలో సాగర్ హీరోగా తెరకెక్కుతున్న సినిమా ‘షాదీ ముబారక్’. ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా రూపుదిద్దుకుంటోన్న ఈ సినిమా ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకొని ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటుంది. ఇక ఇటీవలే ఈ సినిమా నుండి ఫస్ట్ లుక్ పోస్టర్స్, టీజర్ ను రిలీజ్ చేయగా ఇప్ప్పుడు వాటికి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇక ఇప్పుడు తాజాగా ఈ సినిమా ట్రైలర్ ను రిలీజ్ చేశారు చిత్రయూనిట్.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ట్రైలర్ అంతా పెళ్లి చూపుల ఫార్మాట్ లోనే జరుగుతుంది. ఫారిన్ నుంచి వచ్చిన ఒక ఎన్నారై టైం వేస్ట్ చేయకుండా ఒక రోజు 3 పెళ్లి చూపులకు వెళ్తాడు. అక్కడ ఆయనకు ఎదురైన అనుభవాలే ఈ సినిమా కథ. ట్రైలర్ అయితే చూడటానికి ఆసక్తికరంగా ఉంది. మరి సినిమా ఎలా ఉంటుందో తెలియాలంటే మాత్రం రిలీజ్ వరకూ వెయిట్ చేయాల్సిందే
మరి మొగలిరేకులు, చక్రవాకం సీరియల్స్ తో తెలుగు ప్రేక్షకులకు బాగా చేరువైన టెలివిజన్ నటుడు సాగర్ ఆర్కే నాయుడు వెండితెరపై ఎంతవరకూ మ్యాజిక్ చేస్తాడో చూాడాలి.




[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: