పవన్-క్రిష్ సినిమా ఫస్ట్ లుక్,టైటిల్ అప్ డేట్

Power Star Pawan Kalyan and Director Krish Movie Title and First Look To Be Unveiled Soon,Telugu Filmnagar,Telugu Film News 2021,Tollywood Movie Updates,PSPK27,PSPK27 Movie,PSPK27 Film,PSPK27 Update,PSPK27 Latest News,PSPK27 Latest Updates,Pawan Kalyan and Director Krish Movie First Look On March 11,Pawan Kalyan,Power Star Pawan Kalyan,Krish,Director Krish,PSPK27 Title And First Look,Pawan Kalyan And Krish Title And First Look Update,PSPK27 Title On March 11,PSPK27 First Look Date,PSPK27 First Look And Title on 11th March,PSPK27 First Look On Mar 11,Pawan Kalyan And Krish Upcoming Movie First Look Soon,PSPK27 Movie First Look And Title Update,PSPK27 First Look Announcement,PSPK27 Movie First Look Details,PSPK27 Title And First Look To Be Unveiled Soon,#PSPK27

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వరుసపెట్టి సినిమాలను లైన్ లో పెట్టిన సంగతి తెలిసిందే. అయితే వాటిలో ఇప్పటి వరకూ పవన్ సినిమాల్లో వకీల్ సాబ్ సినిమాకు సంబంధించిన రెగ్యులర్ అప్ డేట్స్ మాత్రమే వచ్చాయి. కానీ మరే సినిమా షూటింగ్ కు సంబంధించి పెద్దగా అప్ డేట్స్ రాలేదు. ఇప్పుడు ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న పవన్-క్రిష్ సినిమా అప్ డేట్ వచ్చేసింది. క్రిష్ దర్శకత్వంలో పవన్ హీరోగా ఒక సినిమాను చేస్తున్న సంగతి తెలిసిందే కదా. ఈ సినిమా కూడా ప్రస్తుతం షూటింగ్ దశలో ఉంది. పీరియాడికల్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతున్న ఈ సినిమా టైటిల్, ఫస్ట్ లుక్ కు సంబంధించి తాజాగా అప్ డేట్ ఇచ్చారు. మార్చి 11న ఈ సినిమా ఫస్ట్ లుక్.. టైటిల్ ను రిలీజ్ చేస్తున్నట్టు అధికారికంగా ప్రకటించారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

కాగా ఏ ఎం రత్నం నిర్మాతగా వ్యవహరిస్తున్న ఈ సినిమాకు కీరవాణి సంగీతం అందిస్తున్నాడు. మొఘలుల కాలం నాటి పీరియాడిక్ యాక్షన్ డ్రామా కావడంతో ఈసినిమాను పాన్ ఇండియా లెవల్‌లో అన్ని భాషాల్లో విడుదల చేయడానికి ప్లాన్ చేస్తుంది చిత్రబృందం. ఈ చిత్రాన్ని వచ్చే సంక్రాంతి కానుకగా విడుదల చేయాలనే ప్లాన్‌లో ఉన్నారు.

ఇదిలా ఉండగా వేణు శ్రీ‌రామ్ దర్శకత్వంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రధాన పాత్రలో వకీల్ సాబ్ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఏప్రిల్ 9న వకీల్ సాబ్ ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. పవన్ 28వ సినిమా హరీష్ శంకర్ తో చేస్తున్న సంగతి తెలిసిందే. దర్శకుడు హరీష్ శంకర్ దర్శకత్వంలో మైత్రి మూవీ మేకర్స్ నిర్మాతలుగా ఈ చిత్రం తెరకెక్కనుంది.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

1 × 3 =