బాలకృష్ణ-గోపీచంద్ మలినేని కాంబినేషన్ సెట్

All Set For Nandamuri Balakrishna And Gopichand Malineni New Movie,Telugu Filmnagar,Telugu Film News 2021,Tollywood Movie Updates,Nandamuri Balakrishna,Actor Nandamuri Balakrishna,Hero Nandamuri Balakrishna,Gopichand Malineni,Director Gopichand Malineni,Gopichand Malineni Shared A Picture With Balakrishna,Nandamuri Balakrishna And Gopichand Malineni Picture,Balakrishna And Gopichand Malineni Powerful Combo,Balakrishna And Gopichand Malineni New Movie,Balakrishna And Gopichand Malineni Viral Picture,Balakrishna Gopichand Malineni Latest Pic,Balakrishna Gopichand Malineni Powerful Combo,Balakrishna And Gopichand Malineni New Photo,Gopichand Malineni Meets Balakrishna,Balakrishna Latest Film Updates,Gopichand Malineni New Movie

క్రాక్ సినిమాతో మళ్లీ ఫామ్ లోకి వచ్చాడు గోపీచంద్ మలినేని. ఇక క్రాక్ తర్వాత ఎవరితో సినిమా చేస్తాడబ్బా అని అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్న నేపథ్యంలో ఇప్పుడు ఇంట్రెస్టింగ్ న్యూస్ ఒకటి బయటకు వచ్చింది. తన తర్వాత సినిమా బాలకృష్ణ తో సెట్ చేస్తున్నట్టు తెలుస్తుంది. దానికి కారణం బాలయ్యతో దిగిన ఫోటోను తన సోషల్ మీడియా అకౌంట్‌లో గోపీచంద్ పోస్ట్ చేయడమే.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

గోపీచంద్ మలినేని తాజాగా బాలకృష్ణ తో భేటీ అయి బాలయ్యతో చేయబోయే సినిమా స్టోరీని కూడా వివరించినట్టు సమాచారం. అంతేకాదు బాలకృష్ణ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు తెలుస్తుంది. మే లో ఈ సినిమాను సెట్స్ పైకి తీసుకెళ్ళనున్నారట. మరి ఇందులో ఎంత నిజముందో తెలియాలంటే అధికారిక ప్రకటన వచ్చేంత వరకూ ఆగాల్సిందే.

మరోవైపు ‘సింహా’, ‘లెజెండ్’ సినిమాల తర్వాత బోయపాటి దర్శకత్వంలో బాలకృష్ణ మూడో సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. టైటిల్ ఇంకా కన్ఫామ్ చేయని ఈ సినిమా ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటుంది. ఇక ఇటీవలే రిలీజ్ డేట్ ను కూడా ప్రకటించారు. విశ్వవిఖ్యాత న‌ట‌సార్వభౌమ, న‌ట‌ర‌త్న నందమూరి తారక రామారావు జ‌యంతి నాడు అంటే మే 28న ఈ సినిమాను ప్రపంచ‌వ్యాప్తంగా విడుద‌ల‌ చేస్తున్నట్టు అధికారికంగా ప్రకటించారు. మిర్యాల స‌త్యనారాయ‌ణ రెడ్డి స‌మ‌ర్పణ‌లో ద్వారకా క్రియేషన్స్ ప‌తాకంపై మిర్యాల రవీందర్ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఎస్.ఎస్ థమన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాకు సి.రాంప్రసాద్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here