
ట్యాగ్ · 2112 కథనాలు · పేజీ 40


స్పెషల్ డే కు "హరి హర వీరమల్లు "టీజర్

ఫన్‌రైడర్‌గా ‘ముగ్గురు మొనగాళ్లు’ ట్రైలర్

విభిన్న పాత్రలలో రకుల్ ప్రీత్ సింగ్

'ఆచార్య' రూమర్లను కొట్టిపారేసిన కొరటాల

కరోనా ను జయించిన "కొమరం భీమ్ "

తండ్రి బాధ్యతలు తీసుకున్న కొడుకు

ప్రేక్షకుల టైమ్ వేస్ట్ చేయకూడదు

నేను సీఎం కావాలి.. చేస్తారా..?

ప్రేరణ నిచ్చే కథలనే ఎంపిక చేసుకుంటున్నా -తాప్సీ

"ఆదిపురుష్ " సీత ఫీలింగ్స్

'ఏక్ మినీ కథ' యూనిక్ అండ్ జెన్యూన్

రణ్ బీర్ కపూర్ తో నటించాలని ఉంది -సమంత

ప్రకృతి మాత కై శ్రియ డ్యాన్స్

'బంగార్రాజు' లో లేను..!

'ఆచార్య' మెయిన్ ఎమోషన్ చరణ్ దే

కీర్తి సురేష్ యోగాసనం

'అఖండ' టీజర్ ట్రీట్ అప్పుడేనా..?

ఉషోదయ "చందమామ"

'ఆర్ఆర్ఆర్' ఎన్టీఆర్-చరణ్ యాక్షన్ సీన్స్ కు కన్నీళ్లొచ్చాయి
రాజమౌళి దర్శకత్వంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్.. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రధాన పాత్రల్లో వస్తున్న భారీ పీరియాడిక్ ఫిక్షన్ సినిమా ఆర్ఆర్ఆర్. స్వాతంత్య్ర సమర యోధులు అల్లూరి సీతారామరాజు, కొమరం భీం జీవిత చరిత్రలను ఆధారం చేసుకొని రాజమౌళి ఈ సినిమా తెరకెక్కిస్తున్నాడు. ఇక ఈ సినిమా గురించి ఎంతలా ఎదురుచూస్తున్నారో చెప్పనవసరం లేదు.

స్పెషల్ డే కు "హరి హర వీరమల్లు "టీజర్
మెగా సూర్య ప్రొడక్షన్ బ్యానర్ పై క్రిష్ దర్శకత్వంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా భారీ బడ్జెట్ , భారీ సెట్స్ తో పీరియాడికల్ మూవీ “హరిహర వీరమల్లు “ 2022 సంవత్సరం జనవరి లో సంక్రాంతి కానుకగా రిలీజ్ కానుంది. మొఘల్ , కుతుబ్ షాహి కాలం నాటి చట్టాలను ఎదిరించే వీరుడిగా పవన్ కళ్యాణ్ నటిస్తున్నారు. జాక్వెలిన్ ఫెర్నాండెజ్ , నిధి అగర్వాల్ కథానాయికలు. అర్జున్ రామ్ పాల్ ఒక కీలక పాత్రలో నటిస్తున్నారు. కీరవాణి సంగీతం అందిస్తున్నారు .

హీరో రామ్ మూవీ లో నిధి అగర్వాల్ స్పెషల్ సాంగ్ ?
బిజినెస్ మేనేజ్ మెంట్ గ్రాడ్యుయేట్ , బాలెట్ , కథక్ , బెల్లీ డ్యాన్స్ లో ప్రావీణ్యం , తెలుగు , తమిళ , కన్నడ భాషలు మాట్లాడే నిధి అగర్వాల్ "మున్నా మైఖేల్ "మూవీతో బాలీవుడ్ కు పరిచయం అయ్యారు. “సవ్యసాచి “మూవీ తో టాలీవుడ్ కు కథానాయికగా పరిచయం అయిన నిధి అగర్వాల్, బ్లాక్ బస్టర్ “ఇస్మార్ట్ శంకర్ “మూవీ లో తన అందం , అభినయం తో ప్రేక్షకులను అలరించి గుర్తింపు పొందారు. “భూమి “, ఈశ్వరన్”తమిళ మూవీస్ లో కథానాయికగా నటించి నిధి తమిళ ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. నిధి ప్రస్తుతం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా రూపొందుతున్న పీరియాడికల్ యాక్షన్ అడ్వెంచర్ “హరి హర వీరమల్లు ” మూవీ లో కథానాయికగా నటిస్తున్నారు. ఒక తమిళ…

ఫన్‌రైడర్‌గా ‘ముగ్గురు మొనగాళ్లు’ ట్రైలర్
ఎన్నో సినిమాల్లో కమెడియన్ గా తనదైన శైలిలో నవ్వించిన శ్రీనివాస్ రెడ్డి ప్రధాన పాత్రలో వస్తున్న సినిమా ముగ్గురు మొనగాళ్లు. శ్రీనివాస్ రెడ్డితో పాటు కన్నడ మూవీ దియా ఫేమ్ దీక్షిత్ శెట్టి అలానే.. వెన్నెల రామారావు కూడా ప్రధాన పాత్రలలో నటిస్తున్నారు. ఓ ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్‌తో రూపొందుతోన్నఈ చిత్రం నుండి ఇప్పటికే విడుదలైన ఫస్ట్‌లుక్‌పోస్టర్ కి మంచి రెస్పాన్స్ ను సొంతం చేసుకుంది.

విభిన్న పాత్రలలో రకుల్ ప్రీత్ సింగ్
తెలుగు , తమిళ , హిందీ భాషల పలు బ్లాక్ బస్టర్ మూవీస్ తో ప్రేక్షకులను అలరిస్తున్న స్టార్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ ప్రస్తుతం బాలీవుడ్ లో బిజీగా ఉన్నారు. క్రిష్ దర్శకత్వంలో ఒక మూవీ షూటింగ్ ను కంప్లీట్ చేసిన రకుల్, శివ కార్తికేయన్ "అయలాన్ ", కమల్ హాసన్ "ఇండియన్ 2 "(తమిళ ), ఆయుష్మాన్ ఖురానా డాక్టర్ జీ", జాన్ అబ్రహాం "ఎటాక్, అజయ్ దేవగన్ "మేడే", "థ్యాంక్ గాడ్"( హిందీ) మూవీస్ లో కథానాయికగా నటిస్తున్నారు.

'ఆచార్య' రూమర్లను కొట్టిపారేసిన కొరటాల
మెగాస్టార్ చిరు- తనయుడు రామ్ చరణ్ ఇద్దరూ కలిసి వస్తున్న సినిమా ఆచార్య. అప్పుడెప్పుడో ‘మగధీర’ సినిమాలో మెగాస్టార్ చిరంజీవి చిన్న క్యామియో రోల్ చేశాడు. ఆ తరువాత ఒకపాటలో కలిసి చిందేశారు. అది తప్పితే ఈ తండ్రీ కొడుకులిద్దరూ ఇప్పటిదాకా కలిసి నటించింది లేదు. కానీ ఇప్పుడు ‘ఆచార్య’ లో మాత్రం కీలక పాత్రలో నటిస్తున్నాడు చరణ్. దీంతో ఈ సినిమా కోసం ఈ కాంబినేషన్ ను సిల్వర్ స్క్రీన్ పై చూడాలని మెగా ఫ్యాన్స్ ఎప్పటినుండో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

కరోనా ను జయించిన "కొమరం భీమ్ "
కరోనా టెస్ట్ లో ఎన్టీఆర్ కు పాజిటివ్ రావడం తో అభిమానులతో పాటు సినిమా ప్రముఖులు , బంధువులు ఆందోళనకు గురి అయిన విషయం తెలిసిందే. కొన్ని రోజులుగా హోమ్ ఐసోలేషన్ లో ఉన్న ఎన్టీఆర్ తనకు నెగటివ్ వచ్చిందనే శుభవార్తను సోషల్ మీడియా ద్వారా తెలియజేశారు. తన ఆరోగ్యం బాగుండాలని కోరుకున్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాననీ , అంతే కాకుండా తన ఆరోగ్యం కోసం స్పెషల్ కేర్ తీసుకున్న వైద్యులకు కూడా స్పెషల్ థాంక్స్ తెలిపారు.

తండ్రి బాధ్యతలు తీసుకున్న కొడుకు
ప్రముఖ నిర్మాత, సీనియర్ సినీ పీఆర్వో బిఏ రాజు గుండెపోటుతో మరణించిన సంగతి తెలిసిందే కదా. బిఏ రాజు మరణంతో ఇండస్ట్రీ నిజంగా ఒక మంచి పీఆర్వోని కోల్పోయినట్టే. అలాంటి పీఆర్వో ఇప్పటివరకూ లేడు..ఇకపై రాడు అన్నంత పేరు తెచ్చుకున్నాడు. ప్రతి ఒక్క సినిమా గురించి ఆయన దగ్గర అప్ డేట్ ఉంటుంది. కలెక్షన్ల్ రిపోర్ట్ ఉంటుంది. రిలీజ్ డేట్ లు నాలుకపైనే ఉంటాయి. ఇలా ప్రతి క్షణం సినిమాల గురించి ఆలోచించే వ్యక్తి కాబట్టే మేకర్ కూడా తనపై నమ్మకంతో ఉండేవాళ్లు.. దీంతోనే ఇండస్ట్రీలో వేయి పైగా సినిమాలకు పీఆర్వో గా పనిచేశాడు.

ప్రేక్షకుల టైమ్ వేస్ట్ చేయకూడదు
ఝుమ్మంది నాదం చిత్రంతో వెండితెరకి పరిచయమైంది తాప్సీ. అయితే ఆతరువాత కూడా తాప్సీ కేవలం గ్లామర్ పాత్రలకే పరిమితమవ్వడంతో.. ఇక మేకర్స్ కూడా అలాంటి పాత్రలే ఇవ్వడంతో తెలుగులో ఈ అమ్మడికి అంత సక్సెస్‌లు రాలేదు. కానీ హిందీలో మాత్రం తన మార్క్ ను చూపించింది. పింక్, బద్లా, తప్పడ్, సాండ్ కీ ఆంఖ్, మిషన్ మంగళ్ ఇలా వరుస విజయాలు సొంతం చేసుకొని అక్కడ మంచి గుర్తింపు తెచ్చుకుంది. ముఖ్యంగా లేడి ఓరియెంటెడ్ సినిమాలకు బ్రాండ్ అంబాసిడర్ లా మారింది తాప్సీ. ఇప్పటికే విభిన్న కథా చిత్రాలతో బాలీవుడ్ లో తనదైన ముద్ర వేసి కేవలం పాత్ర ప్రధానమైన సినిమాలను మాత్రమే చేసుకుంటూ వెళుతుంది.

నేను సీఎం కావాలి.. చేస్తారా..?
సినిమాలకు-రాజకీయాలకు అవినాభావ సంబంధం ఉంటుంది. ఇక ఎంతో మంది సినీ ప్రముఖులు రాజకీయాల్లోకి వచ్చి అందులో కూడా చక్రం తిప్పిన వాళ్లు ఉన్నారు. అంతేకాకుండా రాజకీయాల్లోకి వచ్చి ఎదురుదెబ్బ తగిలిన వాళ్లు కూడా ఉన్నారు. ఇక ఈ ఉపోద్ఘాతం ఎందుకంటే ఇక్కడ ఒక స్టార్ హీరో కూడా సీఎం కావాలని అనుకుంటున్నాడు. ఇంతకీ ఆ స్టార్ హీరో ఎవరనుకుంటున్నారా ఎవరో కాదు కన్నడ స్టార్ హీరో ఉపేంద్ర. అంతేకాదు తనను సీఎం చేస్తారా అని కూడా అడుగుతున్నాడు. నాకు సీఎం అవ్వాలని ఉంది… ఎన్నికల్లో పోటీ చేస్తే నన్ను గెలిపిస్తారా అంటూట్విట్టర్ లో ఓ లేఖను విడుదల చేశాడు ఉపేంద్ర. ఇప్పుడుఈ లేఖ హాట్ టాపిక్ అయింది.

ప్రేరణ నిచ్చే కథలనే ఎంపిక చేసుకుంటున్నా -తాప్సీ
"ఝుమ్మంది నాదం"మూవీ తో టాలీవుడ్ లో కెరీర్ ప్రారంభించిన తాప్సీ పన్ను సూపర్ హిట్ "ఆడుకాలం" మూవీ తో కోలీవుడ్ కు పరిచయం అయ్యారు. సూపర్ హిట్ "చష్మే బద్దూర్ "మూవీ తో బాలీవుడ్ లో తాప్సీ అడుగుపెట్టారు. తెలుగు, తమిళ, హిందీ భాషల పలు బ్లాక్ బస్టర్ మూవీస్ తో ప్రేక్షకులను అలరించిన తాప్సీ ఉమెన్ సెంట్రిక్ మూవీస్ పై ఫోకస్ పెట్టి బాలీవుడ్‌లో "పింక్", "బద్లా", "థప్పడ్", "నామ్ షబానా", "సాండ్ కీ ఆంఖ్", "మిషన్ మంగళ్" వంటి స్ఫూర్తిదాయక చిత్రాల్లో నటించి సత్తా చాటారు.

"ఆదిపురుష్ " సీత ఫీలింగ్స్
“1:నేనొక్కడినే ” మూవీ తో కెరీర్ ప్రారంభించిన కృతి సనన్ బ్లాక్ బస్టర్ “హీరోపంతి ” మూవీ తో బాలీవుడ్ కు పరిచయం అయ్యారు.సక్సెస్ ఫుల్ "దోచేయ్ "మూవీ తో ప్రేక్షకులను అలరించారు. బ్లాక్ బస్టర్ "దిల్ వాలే "మూవీ ఘనవిజయం సాధించడంతో కృతి సనన్ బాలీవుడ్ లో బిజీగా మారారు. బాలీవుడ్ లో పలు సూపర్ హిట్ మూవీస్ లో నటించి ప్రేక్షకులను అలరించిన కృతి ప్రస్తుతం 4 హిందీ మూవీస్ లో కథానాయికగా నటిస్తున్నారు. తెలుగు , హిందీ భాషలలో భారీ బడ్జెట్ తో రూపొందుతున్న “ఆదిపురుష్ “మూవీలో కృతి సనన్ సీత పాత్రలో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ కు జోడీగా నటిస్తున్నారు. ఈ మూవీలో క్యారెక్టర్ కై కృతి తెలుగు భాషను నేర్చుకొనడం విశేషం.

'ఏక్ మినీ కథ' యూనిక్ అండ్ జెన్యూన్
ఈమధ్య చిన్న సినిమాలకు, చిన్న హీరోలకు పెద్ద హీరోలు తమ సపోర్ట్ బాగానే ఇస్తున్నారు. సోషల్ మీడియా ద్వారా తమ సపోర్ట్ ను అందిస్తూ బజ్ క్రియేట్ చేస్తున్నారు. ఈనేపథ్యంలోనే ఏక్ మినీ కథకు కూడా మన స్టార్ హీరోల నుండి సపోర్ట్ అందుతూనే ఉంది. ముఖ్యంగా ప్రభాస్ మాత్రం ఈసినిమాను బాగానే ప్రమోట్ చేస్తున్నాడు. అందులోనూ ఏక్ మినీ కథలో నటించిన సంతోష్ తనకు వర్షం లాంటి సూపర్ హిట్ అందించిన శోభన్ కొడుకు కావడంతో ప్రభాస్ ఇంకాస్త ఎక్కువగానే సపోర్ట్ అందిస్తున్నాడు.

రణ్ బీర్ కపూర్ తో నటించాలని ఉంది -సమంత
పలు బ్లాక్ బస్టర్ మూవీస్ లో తన అందం , అభినయం తో ప్రేక్షకులను ఆకట్టుకుని టాలీవుడ్ , కోలీవుడ్ లలో స్టార్ హీరోయిన్ గా రాణిస్తున్న సమంత ప్రస్తుతం గుణ శేఖర్ దర్శకత్వంలో భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న మైథలాజికల్ మూవీ "శాకుంతలం " లో కథానాయికగా నటిస్తున్నారు. ఒక తమిళ మూవీ లో కూడా సమంత నటిస్తున్నారు. సోషల్ మీడియా లో యాక్టివ్ గా ఉంటూ సమంత తన లేటెస్ట్ ఫొటోస్ ను షేర్ చేసి అభిమానులను అలరిస్తున్నారు.

ప్రకృతి మాత కై శ్రియ డ్యాన్స్
కథక్ డ్యాన్సర్ శ్రియశరణ్ "ఇష్టం " మూవీ తో టాలీవుడ్ కు పరిచయం అయ్యారు. "తుఝే మేరే కసమ్ "మూవీ తో బాలీవుడ్ కు , "ఎనక్కు 20 ఉనక్కు 18 "మూవీ తో కోలీవుడ్ కు పరిచయం అయ్యారు. ,తెలుగు తమిళ , కన్నడ , మలయాళ , హిందీ భాషలలో పలు బ్లాక్ బస్టర్ మూవీస్ లో శ్రియ తన అందం , అభినయం తో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. శ్రియ ప్రస్తుతం "గమనం ", "రౌద్రం రణం రుధిరం "మూవీస్ లో నటిస్తున్నారు.

'బంగార్రాజు' లో లేను..!
కళ్యాణ్ కృష్ణ దర్శకత్వంలో నాగార్జున హీరోగా వచ్చిన 'సోగ్గాడే చిన్ని నాయన' సినిమా ఎంత మంచి హిట్ అయిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. 2016 లో విడుదలైన ‘సోగ్గాడే చిన్నినాయనా కింగ్ నాగార్జున కెరీర్‌లోనే హయ్యస్ట్ గ్రాసర్‌గా నిలిచింది. నాగార్జున ద్విపాత్రాభినయం చేసిన ఈసినిమాకు సీక్వెల్ గా బంగార్రాజు పేరుతో మరో సినిమాను తీసుకురావాలని ఎప్పటినుండో అనుకుంటున్నారు. కానీ ఇంతవరకూ ఈసినిమా సెట్స్ పైకి మాత్రం వెళ్లలేదు. అయితే ఈమధ్యే బంగార్రాజు సీక్వెల్ కు సంబంధించి పలు వార్తలు వినిపిస్తూనే ఉన్నాయి. ఈ సినిమా షూటింగ్‌ను జులైలో ప్రారంభించేందుకు సన్నాహాలు జరుగుతున్నట్టు కూడా తెలుస్తుంది.

'ఆచార్య' మెయిన్ ఎమోషన్ చరణ్ దే
మెగాస్టార్ చిరంజీవి - దర్శకుడు కొరటాల శివ కాంబినేషన్ లో వస్తున్న సినిమా ఆచార్య. ఈసినిమా షూటింగ్ కూడా చివరి దశలో ఉంది. ఇక ఇప్పుడు ఈసినిమాను మే13న రిలీజ్ చేద్దామనుకున్నారు కానీ ఇంకా షూటింగే పూర్తి కాలేదు.. మే 13న రావడం కష్టమే. దానికితోడు కరోనా రావడంతో సినిమా రిలీజ్ ను వాయిదా వేస్తున్నట్టు ఇటీవలే అధికారికంగా ప్రకటించారు కూడా. ఈ కరోనా తగ్గితే మళ్లీ షూటింగ్ ను ప్రారంభిస్తారు.

కీర్తి సురేష్ యోగాసనం
తెలుగు , తమిళ, మలయాళ భాషల బ్లాక్ బస్టర్ మూవీస్ లో కీర్తి సురేష్ తన అందం , అభినయం తో ప్రేక్షకులను ఆకట్టుకుని స్టార్ హీరోయిన్ గా రాణిస్తున్నారు. బ్లాక్ బస్టర్ “మహానటి “మూవీ లో అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి బెస్ట్ యాక్ట్రెస్ గా కీర్తి నేషనల్ అవార్డ్ అందుకున్న విషయం తెలిసిందే. కీర్తి కథానాయికగా రూపొందిన ఉమెన్ సెంట్రిక్ మూవీ “గుడ్ లక్ సఖి “ "మరక్కార్ " మలయాళ మూవీ విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. కీర్తి సురేష్ ప్రస్తుతం "సర్కారు వారి పాట ", "అన్నాత్తే" , "సాని కాయిదం "(తమిళ ), "వాశి " మలయాళ మూవీ లో కథానాయికగా నటిస్తున్నారు.

'అఖండ' టీజర్ ట్రీట్ అప్పుడేనా..?
నందమూరి బాలకృష్ణ ప్రధాన పాత్రలో మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను దర్శకత్వంలో అఖండ సినిమా వస్తోన్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటోన్న ఈ అఖండ సినిమా కరోనా కారణంగా వాయిదా పడింది. అయితే ముందుగా అనుకున్న షెడ్యూల్ ప్రకారం ఈ సినిమా ఎన్టీఆర్ జయంతి సందర్భంగా మే 28న రిలీజ్ కావాల్సింది. ప్రస్తుత కరోనా పరిస్థితుల్లో ఈ సినిమా విడుదలయ్యే అవకాశాలు ఏ మాత్రం లేవు. దీంతో ఈ సినిమాను సంక్రాంతికి ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. దీనిపై త్వరలో అధికారిక ప్రకటన ఇవ్వనున్నట్టు తెలుస్తుంది.

ఉషోదయ "చందమామ"
తరగని అందం తో టాలీవుడ్, కోలీవుడ్ లలో స్టార్ హీరోయిన్ గా రాణిస్తున్న కాజల్ అగర్వాల్ పలు బ్లాక్ బస్టర్ మూవీస్ లో తన అందం , అభినయం తో ప్రేక్షకులను అలరిస్తున్న విషయం తెలిసిందే. ఫ్యామిలీ లైఫ్ ఎంజాయ్ చేస్తూ షూటింగ్స్ లో పాల్గొంటున్న హీరోయిన్ కాజల్ అగర్వాల్ తెలుగు , తమిళ , హిందీ చిత్రాలతో బిజీ గా ఉన్నారు. కాజల్ ప్రస్తుతం “ఆచార్య “ నాగార్జున హీరోగా రూపొందుతున్న యాక్షన్ ఎంటర్ టైనర్ (తెలుగు ), “ఇండియన్ 2 “, “హే సనామికా “, “హారర్ మూవీ “ఘోస్టీ “(తమిళ ),”ముంబై సాగా “(హిందీ )మూవీస్ లో కథానాయికగా నటిస్తున్నారు.