‘ఆర్ఆర్ఆర్’ ఎన్టీఆర్-చరణ్ యాక్షన్ సీన్స్ కు కన్నీళ్లొచ్చాయి

Veteran Movie Writer Vijayendra Prasad Makes Some Interesting Revelation About RRR Movie Action Scenes,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2021,Tollywood Movie Updates,Latest Tollywood News,Veteran Movie Writer Vijayendra Prasad,Writer Vijayendra Prasad,Vijayendra Prasad,Vijayendra Prasad Movies,Vijayendra Prasad Latest News,Vijayendra Prasad News,Vijayendra Prasad Movie News,Vijayendra Prasad Movie Updates,Vijayendra Prasad About RRR Movie Action Scenes,Vijayendra Prasad About RRR,Vijayendra Prasad About RRR Movie,RRR,RRR Movie,RRRTelugu Movie,RRR Update,RRR Movie Updates,RRR Movie Latest News,RRR Movie News,RRR Action Scenes,RRR Movie Action Scenes,Vijayendra Prasad About RRR Action Scenes,SS Rajamouli,Ram Charan,Jr NTR,SS Rajamouli's Father,Vijayendra Prasad Reveals About Action Scenes In RRR,Writer Vijayendra Prasad About RRR Emotional Fight Scene,RRR Emotional Fight Scene,KV Vijayendra Prasad About RRR,RRR Fight Scene,RRR Fight Scenes,#RRR,#RRRMovie

రాజమౌళి దర్శకత్వంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్.. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రధాన పాత్రల్లో వస్తున్న భారీ పీరియాడిక్ ఫిక్షన్ సినిమా ఆర్ఆర్ఆర్. స్వాతంత్య్ర సమర యోధులు అల్లూరి సీతారామరాజు, కొమరం భీం జీవిత చరిత్రలను ఆధారం చేసుకొని రాజమౌళి ఈ సినిమా తెరకెక్కిస్తున్నాడు. ఇక ఈ సినిమా గురించి ఎంతలా ఎదురుచూస్తున్నారో చెప్పనవసరం లేదు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక ఈసినిమాలో యాక్షన్ సీన్స్ గురించి ఇప్పటికే పలు వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే కదా. ముఖ్యంగా ఎన్టీఆర్ ఇంట్రడక్షన్ లో వచ్చే ఫైట్ చాలా ఎగ్జైటింగ్ గా ఉంటుందని..పులితో పోరాడతాడని ఇలా పలు ఆసక్తికరమైన విషయాలు బయటకు వచ్చాయి. మరి జక్కన్న సినిమా కాబట్టి ఎక్పేక్టేషన్స్ కు ఏమాత్రం తగ్గదని అందరికీ అదో నమ్మకం. ఇక ఇదే విషయాన్ని రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్ కూడా చెబుతుండటంతో సినిమాపై ఇంకా క్యూరియాసిటీ పెరిగి పోతుంది. రీసెంట్ గా ఒక వీడియో రిలీజ్ చేసిన విజయేంద్ర ప్రసాద్ అందులో ఏం చెప్పాడంటే.. ఆర్ఆర్ఆర్ సినిమాలో ఎన్టీఆర్-రామ్ చరణ్ యాక్షన్ సీక్వెన్స్ ను చూసి కళ్లల్లో నీళ్లు తిరిగాయి.. నాకే కాదు ప్రతి ఒక్క ఫ్యాన్ ప్రతి ఒక్క యాక్షన్ సీన్ లో ఆ పెయిన్ ను ఫీల్ అవుతారు.. ఆడియన్స్ కు తప్పకుండా ఇది డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ ను ఇస్తుంది అని చెప్పాడు.

ఇంకా ఈ సినిమాలో రామ్ చరణ్ సరసన బాలీవుడ్ బ్యూటీ అలియా భట్ నటిస్తుండగా.. ఎన్టీఆర్ సరసన హాలీవుడ్ భామ ‘ఒలివియా మోరిస్’ నటిస్తుంది. ఇక ముఖ్యమైన పాత్రల్లో బాలీవుడ్ స్టార్ హీరో అజయ్ దేవగన్, సముద్రఖని, రే స్టీవెన్సన్, ఆలిసన్ డూడి కూడా నటిస్తున్నారు. డీవీవీ ఎంటెర్టైన్మెంట్స్ పతాకం ఫై దానయ్య ఈ సినిమాని నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి కీరవాణి సంగీతం అందిస్తున్నారు. ఇక ఈసినిమాను అక్టోబర్ 13న ఈసినిమాను రిలీజ్ చేయాలని చూస్తున్నారు కానీ ఇప్పుడప్పుడే రిలీజ్ అయ్యే అవకాశం కనిపించట్లేదు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.