ఈమధ్య చిన్న సినిమాలకు, చిన్న హీరోలకు పెద్ద హీరోలు తమ సపోర్ట్ బాగానే ఇస్తున్నారు. సోషల్ మీడియా ద్వారా తమ సపోర్ట్ ను అందిస్తూ బజ్ క్రియేట్ చేస్తున్నారు. ఈనేపథ్యంలోనే ఏక్ మినీ కథకు కూడా మన స్టార్ హీరోల నుండి సపోర్ట్ అందుతూనే ఉంది. ముఖ్యంగా ప్రభాస్ మాత్రం ఈసినిమాను బాగానే ప్రమోట్ చేస్తున్నాడు. అందులోనూ ఏక్ మినీ కథలో నటించిన సంతోష్ తనకు వర్షం లాంటి సూపర్ హిట్ అందించిన శోభన్ కొడుకు కావడంతో ప్రభాస్ ఇంకాస్త ఎక్కువగానే సపోర్ట్ అందిస్తున్నాడు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక తాజాగా ఈ ట్రైలర్‌ను చూసిన మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కూడా తన ట్విట్టర్‌లో స్పందించాడు. ఏక్ మినీ కథ ట్రైలర్‌ను చూస్తే యూనిక్ గా జెన్యూన్ గా అటెంప్ట్ చేసినట్టు కనిపిస్తున్నది. టీమ్ మెంబర్స్‌కు నా బెస్ట్ విషెస్. మే 27వ తేదీన అమెజాన్‌లో రిలీజ్ అవుతున్న ఏక్ మినీ కథను తప్పకుండా చూడండి అంటూ రాంచరణ్ తన ట్వీట్‌లో పేర్కొన్నారు.
Looks like a unique & genuine attempt.
My best wishes to the team!
Watch #EkMiniKatha on Amazon Prime from May 27. https://t.co/5kafKsegRz pic.twitter.com/mahIWvvS7a— Ram Charan (@AlwaysRamCharan) May 24, 2021
కాగా సంతోష్ శోభన్ హీరోగా నటిస్తున్నఈ బోల్డ్ అండ్ కామెడీ ఎంటర్టైనర్ లో కావ్య థాపర్ హీరోయిన్ గా నటిస్తుంది. ఈ చిత్రంతో కార్తీక్ రాపోలు దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. ఇంకా ఈ సినిమాలో శ్రద్ధాదాస్, బ్రహ్మాజీ, పోసాని కృష్ణ మురళి, సప్తగిరి, సుదర్శన్, జబర్దస్త్ అప్పారావు, జెమిని సురేష్ తదితరులు నటిస్తున్నారు. యూవీ కకాన్సెప్ట్స్ బ్యానర్, మ్యాంగో మాస్ మీడియా సంస్థ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా… మేర్లపాక గాంధీ ఈ చిత్రానికి కథను అందిస్తున్నారు. ప్రవీణ్ లక్కరాజు సంగీతం అందిస్తున్నాడు. కరోనా ఎఫెక్ట్ కారణంగా ‘ఏక్ మినీ కథ’ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ కి రెడీ అయింది. ఈ నెల 27న అమెజాన్ ప్రైమ్ లో విడుదల కాబోతుంది.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: