బిజినెస్ మేనేజ్ మెంట్ గ్రాడ్యుయేట్ , బాలెట్ , కథక్ , బెల్లీ డ్యాన్స్ లో ప్రావీణ్యం , తెలుగు , తమిళ , కన్నడ భాషలు మాట్లాడే నిధి అగర్వాల్ “మున్నా మైఖేల్ “మూవీతో బాలీవుడ్ కు పరిచయం అయ్యారు. “సవ్యసాచి “మూవీ తో టాలీవుడ్ కు కథానాయికగా పరిచయం అయిన నిధి అగర్వాల్, బ్లాక్ బస్టర్ “ఇస్మార్ట్ శంకర్ “మూవీ లో తన అందం , అభినయం తో ప్రేక్షకులను అలరించి గుర్తింపు పొందారు. “భూమి “, ఈశ్వరన్”తమిళ మూవీస్ లో కథానాయికగా నటించి నిధి తమిళ ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. నిధి ప్రస్తుతం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా రూపొందుతున్న పీరియాడికల్ యాక్షన్ అడ్వెంచర్ “హరి హర వీరమల్లు ” మూవీ లో కథానాయికగా నటిస్తున్నారు. ఒక తమిళ మూవీ లో నిధి కథానాయికగా నటిస్తున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
సోషల్ మీడియా లో నిధి అగర్వాల్తన ఫొటోస్ ,వీడియోస్ షేర్ చేస్తూ అభిమానులను అలరిస్తున్న విషయం తెలిసిందే. శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్ బ్యానర్ పై “పందెంకోడి “, “ఆవారా “మూవీస్ ఫేమ్ లింగుస్వామి దర్శకత్వంలో ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని హీరోగా తెలుగు , తమిళ భాషలలో ఒక యాక్షన్ ఎంటర్ టైనర్ మూవీ తెరకెక్కనుంది. ఈ మూవీ లో నిధి అగర్వాల్ ఒక స్పెషల్ సాంగ్ కై ఎంపిక అయినట్టు సమాచారం. “ఇస్మార్ట్ శంకర్ “మూవీ లో రామ్ , నిధి జంటగా ప్రేక్షకులను అలరించిన విషయం తెలిసిందే.
[subscribe]



మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:




























