ఝుమ్మంది నాదం చిత్రంతో వెండితెరకి పరిచయమైంది తాప్సీ. అయితే ఆతరువాత కూడా తాప్సీ కేవలం గ్లామర్ పాత్రలకే పరిమితమవ్వడంతో.. ఇక మేకర్స్ కూడా అలాంటి పాత్రలే ఇవ్వడంతో తెలుగులో ఈ అమ్మడికి అంత సక్సెస్‌లు రాలేదు. కానీ హిందీలో మాత్రం తన మార్క్ ను చూపించింది. పింక్, బద్లా, తప్పడ్, సాండ్ కీ ఆంఖ్, మిషన్ మంగళ్ ఇలా వరుస విజయాలు సొంతం చేసుకొని అక్కడ మంచి గుర్తింపు తెచ్చుకుంది. ముఖ్యంగా లేడి ఓరియెంటెడ్ సినిమాలకు బ్రాండ్ అంబాసిడర్ లా మారింది తాప్సీ. ఇప్పటికే విభిన్న కథా చిత్రాలతో బాలీవుడ్ లో తనదైన ముద్ర వేసి కేవలం పాత్ర ప్రధానమైన సినిమాలను మాత్రమే చేసుకుంటూ వెళుతుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక తాజాగా తన సినిమాల ఎంపిక గురించి మాట్లాడుతూ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేసింది తాప్సీ. గత కొంతకాలంగా నేను కథలు ఎంచుకునే విధానంలో మార్పు వచ్చింది.. ఎప్పుడూ రొటీన్ గా ఉండే కథలు… కేవలం కమర్షియల్ హంగులు ఉండే సినిమాలు చేయాలని నేను అనుకోవడం లేదు.. ఎప్పుడూ ఒకే తరహా సినిమాలు చేసినా ప్రేక్షకులకు విసుగుగా ఉంటుంది.. అలా చేసి ప్రేక్షకుల టైమ్ వేస్ట్ చేయదలుచుకోట్లేదు అని తెలిపింది. అంతేకాదు.. నా సినిమాలు కాస్త యువతకు స్పూర్తి నిచ్చేలా ఉండాలని చూస్తున్నాను… అందుకే నాకు నచ్చిన కథలను ఎంచుకుంటున్నాను అని నిర్మొహమాటంగా చెప్పింది తాప్సీ.
ప్రస్తుతం తాప్సీ ఇండియన్ ఉమెన్ క్రికెట్ టీమ్ కెప్టెన్ మిథాలీరాజ్ బయోపిక్ చేస్తుంది. శభాష్ మిత్తు అనే టైటిల్ తో తెరకెక్కుతున్న ఈసినిమా కూడా షూటింగ్ దశలో ఉంది. హిందీ తో పాటు తెలుగులో కూడా ఈసినిమాను రిలీజ్ చేయనున్నారు.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: