కళ్యాణ్ కృష్ణ దర్శకత్వంలో నాగార్జున హీరోగా వచ్చిన ‘సోగ్గాడే చిన్ని నాయన’ సినిమా ఎంత మంచి హిట్ అయిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. 2016 లో విడుదలైన ‘సోగ్గాడే చిన్నినాయనా కింగ్ నాగార్జున కెరీర్లోనే హయ్యస్ట్ గ్రాసర్‌గా నిలిచింది. నాగార్జున ద్విపాత్రాభినయం చేసిన ఈసినిమాకు సీక్వెల్ గా బంగార్రాజు పేరుతో మరో సినిమాను తీసుకురావాలని ఎప్పటినుండో అనుకుంటున్నారు. కానీ ఇంతవరకూ ఈసినిమా సెట్స్ పైకి మాత్రం వెళ్లలేదు. అయితే ఈమధ్యే బంగార్రాజు సీక్వెల్ కు సంబంధించి పలు వార్తలు వినిపిస్తూనే ఉన్నాయి. ఈ సినిమా షూటింగ్‌ను జులైలో ప్రారంభించేందుకు సన్నాహాలు జరుగుతున్నట్టు కూడా తెలుస్తుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇదిలా ఉండగాఇందులోని ఓ ప్రత్యేక గీతం కోసం ‘ఆర్ఎక్స్ 100’ భామ పాయల్ రాజ్‌పుత్‌ను ఎంపిక చేశారని వార్తలొచ్చిన సంగతి తెలిసిందే కదా. అయితే దాదాపు ఇది కన్ఫామ్ అనుకున్నారు. కానీ ఇప్పుడు ఈ న్యూస్ పై క్లారిటీ ఇచ్చేసింది పాయల్. తన ట్విట్టర్ ద్వారా స్పందిస్తూ నేను బంగార్రాజు సినిమాలో ఎలాంటి పాట చేయట్లేదు అని ట్వీట్ చేసింది. మరి ఈ ట్వీట్ తో అందరికీ క్లారిటీ వచ్చేసినట్టే.
Posting just to make clear I’m not going to be part of any song .
Thanks 🙏🏻 pic.twitter.com/n2kysTV6J0— paayal rajput (@starlingpayal) May 24, 2021
కాగా ఆర్ ఎక్స్ 100తో టాలీవుడ్ లోకి హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన పాయల్ పలు సినిమాల్లో నటించింది. ప్రస్తుతం తమిళంలో ఉదయనిధి స్టాలిన్‌తో కలిసి ‘ఏంజెల్’ అనే చిత్రంలో చేస్తోంది. ఇక సినిమాలతో పాటు అప్పుడప్పుడు పలు సినిమాల్లో ఐటమ్ సాంగ్స్ కూడా చేస్తుంది. ఈనేపథ్యంలో ఈ న్యూస్ తెరపైకి వచ్చింది.




[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:



























