తెలుగు , తమిళ , హిందీ భాషల పలు బ్లాక్ బస్టర్ మూవీస్ తో ప్రేక్షకులను అలరిస్తున్న స్టార్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ ప్రస్తుతం బాలీవుడ్ లో బిజీగా ఉన్నారు. క్రిష్ దర్శకత్వంలో ఒక మూవీ షూటింగ్ ను కంప్లీట్ చేసిన రకుల్, శివ కార్తికేయన్ “అయలాన్ “, కమల్ హాసన్ “ఇండియన్ 2 “(తమిళ ), ఆయుష్మాన్ ఖురానా డాక్టర్ జీ”, జాన్ అబ్రహాం “ఎటాక్, అజయ్ దేవగన్ “మేడే”, “థ్యాంక్ గాడ్”( హిందీ) మూవీస్ లో కథానాయికగా నటిస్తున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ప్రస్తుతం తనకు లభిస్తున్న పాత్రల గురించి రకుల్ ప్రీత్ సింగ్ మాట్లాడుతూ .. ఇప్పుడు తాను నటిస్తున్న సినిమాల్లోని పాత్రలు వేటికవే భిన్నంగా ఉంటాయనీ , తాను ఏ పాత్రలు చేయాలనుకుంటున్నానో అవే వస్తున్నందుకు హ్యాపీగా ఉందనీ, సినిమాల్లో తాను పోషించే పాత్రల మధ్య భిన్నత్వాన్ని ప్రదర్శించే అవకాశం లభిస్తున్నందుకు చాలా సంతోషంగా ఉందనీ , కెరీర్‌లో కొంతదూరం ముందుకు వెళ్ళిన తరువాత ఒకరోజు వెనక్కి తిరిగి చూసుకుంటే ఫలానా సినిమాలు చేశాననే సంతృప్తి కలగాలనీ , దానికోసమే ప్రయత్నిస్తున్నాననీ రకుల్ చెప్పారు.
[subscribe]




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: