‘రాజుగాడు’ సినిమాతో దర్శకురాలిగా పరిచయమయ్యారు సంజనా రెడ్డి… ఇప్పుడు వెయిట్ లిఫ్టర్ కరణం మల్లేశ్వరి బయోపిక్ ను తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఇటీవల ఆమె అస్వస్థతకు గురైన సంగతి కూడా విదితమే. హై ఫీవర్ రావడంతో హాస్పిటల్లో జాయిన్ అయ్యారు. దానితో పలు రూమర్లు కూడా రాగా వాటికి చిత్ర యూనిట్ క్లారిటీ కూడా ఇచ్చింది. ఇక ఇప్పుడు పూర్తిగా కోలుకోవడంతో ఆమె తిరిగి వర్క్ చేయడానికి రెడీ అయినట్టు తెలుపుతున్నారు. అనారోగ్యంతో కొన్ని రోజులు రెస్ట్ తీసుకున్నాను.. ఇప్పుడు ఫిట్ అయ్యాను.. ఇంకా బయోపిక్ వర్క్ స్టార్ట్ చేయాలి.. అని తెలిపింది. ఇక ఈ విషయాన్ని తన ట్విట్టర్ ద్వారా తెలియచేస్తూ చాలా సంతోషంగా ఉంది కోన వెంకట్ సర్.. ఇది కేవలం శాంపిల్ మాత్రమే ముందు ముందు మరిన్ని అప్ డేట్స్ ఉన్నట్టు తెలిపింది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
Feel blessed @kmmalleswari and @konavenkat99 sir. I feel loved. And I love you all right back❤️. Note this is jus a appetiser. Massive delicious things ahead for us once carona goes out . Be safe wash you hands and keep distance ❤️ pic.twitter.com/R9NqvHQEBl
— Sanjanaa Reddy (@sanjanareddyd) July 14, 2020
కాగా సంజనా రెడ్డి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను ఎం.వి.వి.సత్యనారాయణ, కోన వెంకట్ నిర్మించనున్నారు. పాన్ ఇండియా చిత్రంగా తెలుగు, తమిళ, హిందీ భాషల్లో రూపొందనుంది. ఇటీవలే ఈ సినిమా ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేశారు చిత్రయూనిట్. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు కూడా జరుగుతున్నాయి. పరిస్థితులు చక్కబడిన తర్వాత సినిమా షూటింగ్ ప్రారంభించనున్నారు.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: